ETV Bharat / technology

'ఒప్పో K13x 5G' డిజైన్, కలర్ ఆప్షన్స్ రివీల్- లాంఛ్ ఎప్పుడంటే? - OPPO K13X 5G

ఎంట్రీకి రెడీగా 'ఒప్పో K13x 5G'- రూ. 16వేల లోపు ధరలోనే!!- వివరాలు మీకోసం!

Oppo K13x 5G
Oppo K13x 5G (Photo Credit- Anvin X Account)
author img

By ETV Bharat Tech Team

Published : June 11, 2025 at 6:19 PM IST

2 Min Read

Oppo K13x 5G: భారత మార్కెట్​లోకి త్వరలో 'ఒప్పో K13x 5G' స్మార్ట్‌ఫోన్ ఎంట్రీ ఇవ్వబోతోంది. కంపెనీ దీని లాంఛ్ డేట్​ను ఇంకా ప్రకటించనప్పటికీ ఫోన్ డిజైన్, ఫీచర్లను టీజ్ చేయడం ప్రారంభించింది. ఒప్పో ఇటీవలే ఈ హ్యాండ్‌సెట్ సిల్హౌట్‌ను షేర్ చేసింది. తాజాగా ఫోన్ వెనక ప్యానెల్ డిజైన్​ను రివీల్ చేయడంతో పాటు దీన్ని మిడ్‌నైట్ వైలెట్, సన్‌సెట్ పీచ్ కలర్ ఆప్షన్‌లలో తీసుకొస్తున్నట్లు వెల్లడించింది.

ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్, ఒప్పో అధికారిక వెబ్‌సైట్​తో పాటు ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. లీక్ ప్రకారం ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 6,000mAh బ్యాటరీ, 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్​పై ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న సమాచారంపై ఓ లుక్కేద్దాం రండి.

'ఒప్పో K13x 5G' కలర్ ఆప్షన్స్: ఈ ఫోన్ రెండు ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది.

  • మిడ్‌నైట్ వైలెట్
  • సన్‌సెట్ పీచ్

ఈ ఫోన్ ప్రమోషనల్ పోస్ట్ దీని వెనక భాగాన్ని చూపిస్తుంది. ఇది ఎగువ ఎడమ మూలలో నిలువుగా అమర్చిన ఎలిప్టికల్ కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంటుంది. ఈ మాడ్యూల్‌లో రెండు కెమెరా సెన్సార్లు, వృత్తాకార స్లాట్‌లలో LED ఫ్లాష్ యూనిట్ ఉన్నాయి. కెమెరా మాడ్యూల్ దగ్గర ఉన్న టెక్స్ట్ 'ఒప్పో K13x 5G'లో AI-ఆధారిత కెమెరా సిస్టమ్ ఉంటుందని సూచిస్తుంది. ఇందులో AI ఇమేజింగ్, ఎడిటింగ్ ఫీచర్లు ఉంటాయి.

'ఒప్పో K13x 5G' లాంఛ్ ఎప్పుడు?: డిజిట్ నివేదిక ప్రకారం ఈ ఫోన్ జూన్ చివరి వారంలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. లాంఛ్ అనంతరం ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఇండియా వెబ్‌సైట్​తో పాటు కొన్ని ఆఫ్‌లైన్ స్టోర్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.

ధర ఎంత ఉండొచ్చు?: లీక్ ప్రకారం, ఈ ఫోన్ ధర రూ. 15,999 కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది.

ఒప్పో K13x 5G ఫీచర్లు: లీక్ ప్రకారం.. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ 6,000mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. దీనితో పాటు ఇది ఫ్లాట్ డిస్​ప్లే, గుండ్రని అంచులు, మధ్యలో హోల్-పంచ్ స్లాట్‌తో వస్తుంది. ఈ ఫోన్​కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ఈ ఫోన్ బడ్జెట్ విభాగంలో కొత్త ఎంపికను అందించవచ్చు.

సరికొత్త డిజైన్​తో 'నథింగ్ ఫోన్ 3'!- ధర ఎంత ఉంటుందో తెలుసా?

మంచి పెర్ఫార్మెన్స్ అందించే బైక్ కొనాలా?- మార్కెట్​లో ఇవే టాప్!!- ఓ లుక్కేయండి మరి!

ఫ్లాగ్​షిప్ స్థాయి ఫీచర్లతో 'వివో T4 అల్ట్రా'- మిడ్-రేంజ్​ ధరలోనే లాంఛ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.