OpenAI New Social Media Platform: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఫేమస్ కంపెనీ అయిన ఓపెన్ఏఐ నుంచి త్వరలో కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ మేరకు కంపెనీ 'X' లాంటి సొంత సోషల్ నెట్‌వర్క్‌ను తీసుకొచ్చే పనిలో పడినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ ప్లాట్‌ఫారమ్ అనేక AI ఫీచర్లతో నిండి ఉంటుంది. అయితే వాటి ఇంటిగ్రేషన్‌పై వివరణాత్మక సమాచారం ఇంకా అందుబాటులో లేదు.
ఈ ప్లాట్‌ఫామ్ ఎలాన్ మస్క్ 'ఎక్స్', మార్క్ జుకర్‌బర్గ్ యాజమాన్యంలోని మెటా-ఓన్డ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌కు గట్టి పోటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 'X', 'Meta' సంస్థలూ ఇటీవలే తమ ప్లాట్‌ఫామ్‌లకు AI ఫీచర్లను జోడించాయి. ఇకపోతే GPT-4.1 AI మోడళ్లను ప్రకటించిన కొద్ది రోజుల తర్వాత ఓపెన్ఏఐ నుంచి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై ఈ నివేదికలు వచ్చాయి.
ChatGPT ఆధారిత సోషల్ యాప్: ది వెర్జ్ నివేదిక ప్రకారం.. ఓపెన్ఏఐ "X-లాంటి సోషల్ నెట్‌వర్క్"ను అభివృద్ధి చేసే యోచనలో ఉంది. మల్టిపుల్ అనోనిమస్ సోర్స్‌ను ఉటంకిస్తూ ఈ ప్లాట్‌ఫామ్ ఇంటర్నల్ ప్రోటోటైప్ ఇప్పటికే క్రియేట్ అయినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈ ప్రోటోటైప్ చాట్‌జీపీటీ GPT-4o-ఆధారిత ఇమేజ్ జనరేషన్ కేపబిలిటీస్పై ఫోకస్ చేస్తుంది. ఈ ప్లాట్‌ఫామ్ 'social' యాస్పెక్ట్‌లో పబ్లిక్ ఫీడ్ ఉంటుంది. జనరేట్ అయిన ఇమేజ్‌లు అక్కడ కనిపించే అవకాశం ఉంది.
ప్రత్యక యాప్: ఓపెన్ఏఐ CEO సామ్ ఆల్ట్‌మాన్ ఈ ప్రోటోటైప్పై కంపెనీ నుంచి కాకుండా బయటి వ్యక్తుల నుంచి ఫీడ్‌బ్యాక్ కోరినట్లు ఈ నివేదికలు పేర్కొన్నాయి. ఈ ప్లాట్‌ఫామ్ స్టాండలోన్ యాప్‌గా ప్రారంభం కానుందా? లేదా ChatGPTలో విలీనం చేస్తారా? అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఆసక్తికరంగా కంపెనీ వీడియో క్రియేషన్ ప్లాట్‌ఫారమ్ అయిన సోరా కూడా ఇలాంటి ఫీడ్‌నే కలిగి ఉంది. అయితే ఇమేజ్‌లు, వీడియో క్రియేటర్ల పేర్లు ఫీడ్‌లో కనిపించకపోవడంతో దీనికి సామాజిక అనుభవం లేదు.
AI ప్లాట్‌ఫామ్‌లపై సోషల్ మీడియా: ఈ సమాచారం ప్రకారం ఓపెన్ఏఐ సోషల్ యాప్ కాన్సెప్ట్ అనేది AI ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. సోషల్ మీడియా రంగంలోకి ఓపెన్ఏఐ ఎంట్రీ 'X', 'Meta'తో కంపెనీలతో పోటీని మరోసారి తీవ్రతరం చేస్తుంది. 'X' అధినేత మస్క్ గతంలో ఆల్ట్‌మాన్, ఓపెన్‌ఏఐపై విమర్శలు గుప్పించారు.
అంతటితో ఆగకుండా మస్క్ ఓపెన్ఏఐపై దావా వేసి, ఆ కంపెనీని కొనుగోలు చేస్తానంటూ ఆఫర్ కూడా ఇచ్చారు. దీనిపై ప్రతిస్పందిస్తూ ఆల్ట్మాన్ ఒక పోస్ట్‌లో 'No, thanks' అంటూ "కానీ మీరు కోరుకుంటే, మేం ట్విటర్‌ను $9.74 బిలియన్లకు కొనుగోలు చేస్తాం" అని రిటర్న్ ఆఫర్ జోడించారు. ఈ క్రమంలో ఫిబ్రవరిలో ChatGPTతో పోటీ పడేందుకు మెటా ఒక సెపరేట్ 'మెటా AI యాప్'ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నివేదికలు వచ్చాయి. దీనికి ప్రతిస్పందిస్తూ ఓపెన్ఏఐ CEO.. 'ఓకే, మనం కూడా ఒక సోషల్ యాప్ క్రియేట్ చేద్దాం అయితే' అని అన్నారు.
హైవేపై ఆగాల్సిన అవసరం లేదిక!- కొత్త టోల్ పాలసీతో మీ జర్నీకి నో బ్రేక్స్!
లేటెస్ట్ అప్డేట్స్తో 'హోండా డియో 125' స్కూటీ- కొత్త ఫీచర్ల వివరాలివే!
బ్లాక్ కలర్ వావ్.. స్టన్నింగ్ లుక్‌లో డార్క్ ఎడిషన్ కార్లు- వీటిని చూస్తే కొనకుండా ఉండగలరా..??