OnePlus Pad 3: వన్‌ప్లస్ త్వరలో భారతదేశంలో 'వన్‌ప్లస్ ప్యాడ్ 3' అనే కొత్త టాబ్లెట్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ టాబ్లెట్ కంపెనీ గతేడాది లాంఛ్ చేసిన 'వన్‌ప్లస్ ప్యాడ్ 2'కు సక్సెసర్. కంపెనీ మొట్టమొదటి కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 'వన్‌ప్లస్ 13s'ను ఇవాళ లాంఛ్ చేసింది. ఆ సమయంలో 'వన్‌ప్లస్ ప్యాడ్ 3' టాబ్లెట్‌ను పరిచయం చేసింది. ఇకపోతే 'వన్‌ప్లస్ ప్యాడ్ 3' ఫుల్ మెటల్ యూనిబాడీ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇది 6mm కంటే తక్కువ మందంతో వస్తుంది. ఈ టాబ్లెట్ మందం 5.97mm, బరువు 675 గ్రాములు.
'వన్‌ప్లస్ ప్యాడ్ 3' ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:
డిస్ప్లే: ఈ టాబ్లెట్ 13.2-అంగుళాల LCD LTPS స్క్రీన్‌ను కలిగి ఉంది. దీని రిజల్యూషన్ 3.4K. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 900 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను అందిస్తుంది. ఈ టాబ్లెట్‌లో వన్‌ప్లస్ మొత్తం 8 స్పీకర్లను అందించింది. వీటిలో 4 వూఫర్‌లు, 4 ట్వీటర్‌లు ఉన్నాయి.
ప్రాసెసర్: ఈ టాబ్లెట్‌లో ప్రాసెసర్ కోసం స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ఉంటుంది. ఇది అడ్రినో 830 GPU తో వస్తుంది. ఈ ఫోన్ 12GB LPDDR5x లేదా 16GB LPDDR5T RAMతో 512GB వరకు UFS 4.0 స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది.
Meet the all-new #OnePlusPad3 - ultra-fast with Snapdragon 8 Elite, ultra-smooth with a 144Hz 3.4K display. #StayTuned
— OnePlus India (@OnePlus_IN) June 5, 2025
Know more: https://t.co/CJkeVRAttS pic.twitter.com/KcsLI6HK2Q
బ్యాటరీ: ఇందులో 12,140mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌కు సపోర్ట్ చేస్తుంది.
ఆపరేటింగ్ సిస్టమ్: ఈ 'వన్‌ప్లస్ ప్యాడ్ 3' ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఆక్సిజన్ OS 15 పై నడుస్తుంది.
కెమెరా సెటప్: ఈ టాబ్లెట్ వెనక భాగంలో 13MP రియర్ కెమెరా, ముందు భాగంలో 8MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
Specification | Details |
---|---|
Display | 13.2-inch LCD LTPS, 144Hz refresh rate, 900 nits peak brightness |
Speaker | 8 Speaker (4 Woofer, 4 Tweeter) |
Weight | 675 grams |
Thickness | 5.97 mm |
Processor | Snapdragon 8 Elite Mobile Platform |
GPU | Adreno 830 (Maximum 1.1GHz) |
RAM options | 12GB LPDDR5x / 16GB LPDDR5T |
Storage option | 256GB / 512GB UFS 4.0 |
Rear camera | 13 MP |
Front camera | 8 MP |
Battery | 12,140mAh |
Charging | 80W fast wired charging |
Operating system | Oxygen OS 15 (based on Android 15) |
వన్‌ప్లస్ ప్యాడ్ 3 వేరియంట్లు, ధర వివరాలు: 'వన్‌ప్లస్ ప్యాడ్ 3' ఇంకా భారతదేశంలో లాంఛ్ కాలేదు. దీన్ని ఇవాళ అంటే జూన్ 5న యూరప్, ఉత్తర అమెరికాలో ప్రారంభించారు. అయితే ఈ టాబ్లెట్ అతి త్వరలో భారత మార్కెట్లోకి కూడా ఎంట్రీ ఇవ్వనుంది. భారతదేశంలో ఈ టాబ్లెట్ ధర దాదాపు రూ. 50,000 ఉండొచ్చు.
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లతో వివో మిడ్ రేంజ్ ఫోన్!- లాంఛ్ డేట్ ఫిక్స్- ఎప్పుడంటే?
భారీ డేటా లీక్- 'ప్రమాదంలో 18.4 కోట్ల పాస్‌వర్డ్‌లు'- జాగ్రత్త సుమీ!!
ప్రపంచ కంపెనీలను ఆకర్షించే ప్రయత్నాలు- టెస్లాకు నాట్ ఇంట్రెస్ట్, BYDకి నో ఎంట్రీ!