OnePlus 13s Launch Date in India: వన్‌ప్లస్ నుంచి ఫ్లాగ్‌షిప్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉంది. కంపెనీ దీన్ని 'వన్‌ప్లస్ 13s' పేరుతో జూన్ మొదటి వారంలో భారత్‌తో సహా ప్రపంచంలోని అనేక ఇతర మార్కెట్లలో ప్రారంభించనుంది. తాజాగా దీని లాంఛ్ డేట్‌ను కూడా కన్ఫార్మ్ చేసింది. దీంతోపాటు లాంఛ్‌కు ముందే కీలక స్పెసిఫికేషన్లను రివీల్ చేసింది. ఆ వివరాలు మీకోసం.
వన్‌ప్లస్ 13s లాంఛ్: కంపెనీ ఈ ఫోన్‌ను జూన్ 5న మధ్యాహ్నం 12 గంటలకు భారతదేశంలో లాంఛ్ చేయనున్నట్లు ప్రకటించింది. దీన్ని బ్లాక్ వెల్వెట్, పింక్ శాటిన్, గ్రీన్ సిల్క్ అనే మూడు రంగులలో విడుదల చేయనుంది. అయితే వీటిలో గ్రీన్ కలర్ భారతదేశంలో మాత్రమే అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్లోని అత్యంత ప్రత్యేకమైన విషయం దాని ప్రాసెసర్. ఈ ఫోన్‌లో క్వాల్‌కామ్ లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌ను అందించనున్నారు. ఇది ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్. ఈ చిప్‌సెట్ క్రయో-వెలాసిటీ వేపర్ చాంబర్‌తో వస్తుంది.
వన్‌ప్లస్ 13s గేమింగ్ టెస్ట్: హెవీ టాస్క్‌లు నిర్వహించి ఈ ఫోన్‌ను పరీక్షించినట్లు కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్‌లో బాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా అంటే BGMI ప్లే చేశారు. ఆ సమయంలో ఫోన్ బ్యాటరీ పూర్తిగా అయిపోయే వరకు 7 గంటల పాటు గేమింగ్ ఫ్రేమ్ రేట్ పూర్తిగా స్థిరంగా ఉంది. ఇది కాకుండా ఈ ఫోన్‌ను సింగిల్ ఛార్జ్‌తో 24 గంటల పాటు వాట్సాప్ కాల్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో 16 గంటల పాటు కంటిన్యూస్‌గా కంటెంట్ బ్రౌజింగ్ కోసం ఉపయోగించవచ్చని కంపెనీ చెబుతోంది.
ఈ ఫోన్ డిజైన్, చిప్‌సెట్‌తో పాటు అనేక ఇతర స్పెసిఫికేషన్లను వన్‌ప్లస్ రివీల్ చేసింది. ఇందులో 6.32 అంగుళాల డిస్ప్లే ఉంటుంది. ఫోన్ వెనక భాగంలో స్క్వేర్ ఆకారపు కెమెరా మాడ్యూల్ ఉంది. దాని లోపల రెండు కెమెరా సెన్సార్లు వెర్టికల్ పిల్ ఆకారంలో అమర్చారు. ఇది కాకుండా ఈ ఫోన్‌లో కొత్త ప్లస్ కీని చేర్చబోతున్నట్లు, ఇది అలర్ట్ స్లయిడర్‌ను భర్తీ చేస్తుందని కంపెనీ తెలిపింది. ఇది కస్టమైజబుల్ బటన్ అవుతుంది. దీన్ని ఒక్కసారి ప్రెస్ చేస్తే సౌండ్, వైబ్రేషన్, డు నాట్ డిస్టర్బ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే AI టూల్స్ వంటి ఫీచర్లకు యాక్సెస్ లభిస్తుంది.
'ఓలా S1 ప్రో' vs 'ఏథర్ 450X'- ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటీలలో ఏది బెస్ట్?
సూపర్ ఫీచర్లతో 'ఇన్ఫినిక్స్ GT 30 ప్రో'- దీనిలో గేమ్ ఆడితే ఆ మజానే వేరు!
ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 26 కార్లు- గేమ్ ఛేజింగ్ ప్లాన్‌తో హ్యుందాయ్!