ETV Bharat / technology

సరికొత్త డిజైన్​తో 'నథింగ్ ఫోన్ 3'!- ధర ఎంత ఉంటుందో తెలుసా? - NOTHING PHONE 3 LEAKS

త్వరలో మార్కెట్​లోకి నథింగ్ ఫ్లాగ్​షిప్ ఫోన్- లాంఛ్​కు ముందే ధర, డిజైన్​ రివీల్!

Nothing Phone 3
Nothing Phone 3 (Photo Credit- Shivank Tiwari/X)
author img

By ETV Bharat Tech Team

Published : June 11, 2025 at 5:17 PM IST

3 Min Read

Nothing Phone 3: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'నథింగ్ ఫోన్ (3)' లాంఛ్ సమయం దగ్గర పడింది. కంపెనీ ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను జూలై 1న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. దీని ప్రీవియస్ మోడల్ 'నథింగ్ ఫోన్ 2' దాదాపు రెండేళ్ల కిందట అంటే జులై 2023 ప్రారంభించారు. ఇప్పుడు దీని అప్​గ్రేడ్ మోడల్​ను తీసుకొచ్చేందుకు కంపెనీ రెడీ అయ్యింది.

అయితే ఈ ఫోన్​కు సంబంధించిన కొన్ని వివరాలను ఇంకా గోప్యంగానే ఉంచింది. అయినప్పటికీ ఆన్​లైన్​లో లీక్ అయిన సమాచారం ఈ ఫోన్ డిజైన్, ధరపై మనకు ఒక అవగాహనను అందించింది. లీక్ అయిన రెండర్‌ల ప్రకారం ఈ అప్​ కమింగ్ 'నథింగ్ ఫోన్ (3)' కొత్త డిజైన్‌తో ఎంట్రీ ఇస్తుంది. ఇది ఈ ఫోన్‌ను మార్కెట్లో ప్రత్యేకంగా నిలబెట్టే అవకాశం ఉంది. ఈ ఫోన్​పై ఇప్పటివరకు ఉన్న సమాచారంపై ఓ లుక్కేద్దాం రండి.

గ్లిచ్ ఇంటర్‌ఫేస్ తొలగింపు: టిప్‌స్టర్ మాక్స్ జాంబోర్ షేర్ చేసిన రెండర్ ప్రకారం 'నథింగ్ ఫోన్ (3)' వెనక భాగంలో LED లైట్లు ఉండవు. కంపెనీ తన ఐకానిక్ "గ్లిచ్ ఇంటర్‌ఫేస్"ను తొలగించినట్లు ఇటీవలి ట్వీట్‌లో స్పష్టం చేసింది. ఈ నిర్ణయం నథింగ్ అభిమానులకు కాస్త ఆశ్చర్యం కలిగించిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ డిజైన్ కంపెనీకి ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టింది.

అయితే ఫోన్ సెమీ-ట్రాన్స్​పరెంట్ డిజైన్ అలాగే ఉంది. ఇది మార్కెట్‌లోని ఇతర ఫోన్‌ల నుంచి దీనిని ప్రత్యేకంగా నిలబెట్టింది. ఇది గుండ్రని అంచులు, వంపుతిరిగిన ఫ్రేమ్‌లను కలిగి ఉంటుంది. ఇది చేతితో పట్టుకోవడం సులభం చేస్తుంది. ఫోన్ తెలుపు రంగులో వస్తుంది. ఇది కంపెనీ మునుపటి మోడళ్ల మాదిరిగానే ఉంటుంది. నథింగ్ ఈ ఫోన్​తో ప్రీమియం కొనుగోలుదారులను ఆకర్షించేందుకు దీని డిజైన్‌పై దృష్టి సారిస్తోంది.

కెమెరా, పనితీరు: 'నథింగ్ ఫోన్ (3)' వెనక మూడు కెమెరాలు ఉంటాయి. ఇది మునుపటి 'నథింగ్ ఫోన్ (2)' కంటే అప్‌గ్రేడ్. లీక్ ప్రకారం.. ఇది మూడు 50-మెగాపిక్సెల్ సెన్సార్‌లను కలిగి ఉంటుంది. అవి మెయిన్, అల్ట్రావైడ్, 3x ఆప్టికల్ జూమ్‌తో టెలిఫోటో కెమెరా. అయితే ఈ సెన్సార్ల వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఈ ఫోన్‌లో క్వాల్​కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ఉండే అవకాశం ఉంది. ఇది ఈ ఫోన్​కు ఫ్లాగ్‌షిప్ పనితీరును అందించడంలో సహాయపడుతుంది.

ధర ఎంత?: 'నథింగ్ ఫోన్ (3)' ధర కూడా వెల్లడైంది. ఓ లీక్ ప్రకారం 12 GB RAM, 256GB స్టోరేజ్ కలిగిన బేస్ మోడల్ ధర US మార్కెట్లో $799 (సుమారు రూ. 68,320) ఉంటుంది. ఈ ధర 'నథింగ్ ఫోన్ (2)' కంటే $100 (సుమారు రూ. 5,560) ఎక్కువ. యూరప్‌లో ఈ ఫోన్ దాదాపు రూ. 90,000కు అందుబాటులో ఉంటుంది. కానీ భారతదేశంలో దీని ధర తక్కువగా ఉండే అవకాశం ఉంది.

'నథింగ్ ఫోన్ (2)' మోడల్​ను భారతదేశంలో రూ. 44,999కు ప్రారంభించారు. ఇది USలో $525. దీన్నిబట్టి 'నథింగ్ ఫోన్ (3)' భారతదేశంలో రూ. 60,000 కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉండచ్చని ఓ అంచనాకి రావచ్చు. ఎందుకంటే భారతదేశం నథింగ్‌కు ఒక ముఖ్యమైన మార్కెట్. ఇక్కడి వినియోగదారులు ప్రైస్-సెన్సిటివ్​గా ఉంటారు. ఈ నేపథ్యంలో కంపెనీ భారత మార్కెట్​లో దీన్ని ఆకర్షణీయమైన ధరలోనే అందుబాటులో ఉంచే అవకాశం ఉంది.

మార్కెట్​లో దీని స్థానం: 'నథింగ్ ఫోన్ (3)' ధర 'వన్​ప్లస్​ 13' (రూ. 69,999) కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇది ప్రీమియం కొనుగోలుదారులను ఆకర్షించడంలో సహాయపడుతుంది. ఇది రూ. 60,000 కంటే తక్కువ ధర ఉన్న విభాగంలో 'ఐఫోన్ 16e', 'ఐకూ 13' మోడల్స్​తో పోటీ పడనుంది. కంపెనీ గత రెండు సంవత్సరాలుగా ఈ ఫోన్‌పై పనిచేస్తోంది. ఇది మార్కెట్​లో ఈ ఫోన్ ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడటంపై ఆసక్తిని రేకెత్తించింది.

మంచి పెర్ఫార్మెన్స్ అందించే బైక్ కొనాలా?- మార్కెట్​లో ఇవే టాప్!!- ఓ లుక్కేయండి మరి!

ఫ్లాగ్​షిప్ స్థాయి ఫీచర్లతో 'వివో T4 అల్ట్రా'- మిడ్-రేంజ్​ ధరలోనే లాంఛ్

జోరుగా విస్తరిస్తున్న వీఐ 5G సేవలు!- ఇప్పుడు మరో నగరంలో అన్​లిమిటెడ్ డేటాతో హైస్పీడ్ ఇంటర్నెట్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.