ETV Bharat / technology

ఎక్స్ యూజర్స్​కు క్రేజీ అప్​డేట్​- మిమ్మల్ని బ్లాక్ చేసిన వారి పోస్ట్​లను ఇకపై చూడొచ్చు- అదెలాగంటే? - X UPDATES BLOCK FEATURE

ఎక్స్​లో సరికొత్త అప్​డేట్- బ్లాక్ ఫీచర్​లో మార్పులు

X Updates Block Feature
X Updates Block Feature (X)
author img

By ETV Bharat Tech Team

Published : Nov 5, 2024, 10:14 AM IST

X Update Block Features: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్​ఫారమ్ ఎక్స్ (గతంలో ట్విటర్) యూజర్స్​కు క్రేజీ అప్​డేట్ వచ్చింది. ఇకపై ​మీరు.. మిమ్మల్ని బ్లాక్​ చేసిన వ్యక్తుల పోస్ట్​లను చూడొచ్చు. అదెలాగో తెలుసుకుందాం రండి.

ఎలాన్​ మస్క్​ యాజమాన్యంలోని ఎక్స్​ (X) సరికొత్త అప్​డేట్​ను అందించింది. ఈ సామాజిక మాధ్యమం తన బ్లాక్ ఫీచర్​ను అప్​డేట్​ చేసింది. దీంతో మీరు బ్లాక్ చేసిన వ్యక్తి ఇకపై మీ పబ్లిక్ పోస్ట్​ను చూడగలరు. అయితే దీనికి కొన్ని నియమాలు ఉంటాయి.

ఎక్స్​ తెలిపిన వివరాల ప్రకారం.. ఎక్స్​లో వచ్చిన ఈ కొత్త అప్​డేట్​తో మీరు బ్లాక్ చేసిన వ్యక్తి మీ పబ్లిక్ పోస్ట్​ను మాత్రమే చూడగలరు. అంతేకానీ వారు మీ పోస్ట్​కు లైక్ కొట్టలేరు. దీంతోపాటు రిప్లై లేదా రీపోస్ట్ కూడా చేయలేరు. ఈ ఫీచర్ అప్​డేట్​ మీకు నేరుగా మెసేజ్ చేయకుండా అకౌంట్స్​ను బ్లాక్ చేస్తుంది. ఇలా మీతో ఎంగేజ్ అవ్వకుండా చూస్తుంది.

గతంలో టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ మీ పబ్లిక్ పోస్ట్​లను చూడకుండా వ్యక్తులను బ్లాక్ చేయడంలో అర్థం లేదని అన్నారు. ఈ నేపథ్యంలోనే 'ఎక్స్' ఇప్పుడు కాంట్రవర్సియల్ బ్లాక్ ఫీచర్​ను స్వయంగా అప్​డేట్ చేస్తోంది. ఈ అప్​డేట్ మీరు బ్లాక్ చేసిన వ్యక్తి కూడా మీ పబ్లిక్ పోస్ట్​లను చూడటానికి అనుమతిస్తుంది.

అయితే ఈ​ ఫీచర్​ అప్​డేట్​తో మీరు బ్లాక్ చేసిన అకౌంట్స్​ మిమ్మల్ని ఫాలో చెయ్యలేవు. అలాగే మీరూ బ్లాక్​ చేసిన వ్యక్తిని ఫాలో అవ్వలేరు. అంటే మీరు ప్రస్తుతం ఫాలో అయిన అకౌంట్​ను బ్లాక్ చేయడం వల్ల ఆ అకౌంట్​ను అన్​ఫాలో చేసేస్తుంది. ఒకవేళ మీరు ఆ అకౌంట్​ను అన్​బ్లాక్ చేయాలని అనుకుంటే మీరు ఆ అకౌంట్​ను మళ్లీ ఫాలో కొట్టాల్సి ఉంటుందని ఎక్స్ తెలిపింది. అంటే ఇకపై ఇతరుల నుంచి హానికరమైన/ప్రైవేట్ సమాచారాన్ని షేర్ చేయడానికి/హైడ్ చేసేందుకు మాత్రమే ఈ బ్లాక్​ ఫీచర్​ ఉపయోగపడుతుంది. అయితే ఎక్స్​లో ఈ మార్పును చాలామంది వ్యతిరేకిస్తున్నారు.

రైల్వే ప్రయాణికుల కోసం 'సూపర్ యాప్'- అన్ని సౌకర్యాలు ఒకే చోట- ఇక నో టెన్షన్ బాస్..!

బడ్జెట్ ధరలో శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్- రిలీజ్ ఎప్పుడంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.