ETV Bharat / technology

ఇండియా ఫ్లాగ్‌షిప్ SUVగా వోక్స్‌వ్యాగన్ కొత్త కారు- ధర ఎంతంటే? - NEW GEN VOLKSWAGEN TIGUAN LAUNCHED

కొత్త తరం వోక్స్‌వ్యాగన్ టిగువాన్‌ లాంఛ్- గంటకు 229km టాప్​ స్పీడ్​!

New-generation Volkswagen Tiguan R-Line launched in India
New-generation Volkswagen Tiguan R-Line launched in India (Photo Credit- Volkswagen India)
author img

By ETV Bharat Tech Team

Published : April 14, 2025 at 5:30 PM IST

2 Min Read

New Gen Volkswagen Tiguan Launched: వోక్స్‌వ్యాగన్ ఇండియా తన కొత్త తరం వోక్స్‌వ్యాగన్ టిగువాన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. కంపెనీ ఈ కారును రూ. 49 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో ప్రారంభించింది. వోక్స్‌వ్యాగన్ ఇండియా ఫ్లాగ్‌షిప్ SUVగా తీసుకొచ్చిన ఈ SUV భారతదేశంలో R-లైన్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ కారును లిమిటెడ్ క్వాంటిటీస్​లో CBU (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) గా దిగుమతి చేసుకుంటారు.

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ R-లైన్ ఎక్స్​టీరియర్: టిగువాన్ R-లైన్ కొత్త తరం మోడల్. కాబట్టి ఇది ప్రస్తుత టిగువాన్ కంటే చాలా భిన్నంగా కన్పిస్తుంది. దీని ముందు భాగంలో కనెక్టెడ్ LED స్ట్రిప్‌తో ఆకర్షణీయంగా హెడ్‌లైట్‌లను, దిగువన సిల్వర్ లిప్‌తో కూడిన భారీ మెష్-ప్యాటర్న్డ్ ఎయిర్ డ్యామ్‌ను అందించారు. ఈ కారు స్పోర్టి స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుంటే దీని ముందు భాగంలో క్రోమ్ వాడకాన్ని కనిష్ఠంగా ఉంచారు.

Side profile of the new-generation Volkswagen Tiguan R-Line
Side profile of the new-generation Volkswagen Tiguan R-Line (Photo Credit- Volkswagen India)

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ R-లైన్ ఇంటీరియర్: మనం టిగువాన్ ఆర్-లైన్ క్యాబిన్‌ను పరిశీలిస్తే ఇది స్పోర్ట్స్ సీట్లపై బ్లూ స్టిచింగ్​తో ఆల్​-బ్లాక్ కలర్​ స్కీమ్​ను కలిగి ఉంది. దీని సెంటర్ కన్సోల్ పైన 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఇది క్లైమేట్ కంట్రోల్ ఫంక్షన్‌తో వస్తుంది. దీనితో పాటు వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవికాకుండా 'R' బ్యాడ్జింగ్‌తో కూడిన త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్ ఇందులో ఉంది. దీని వెనక 10.3-అంగుళాల ఆల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కన్పిస్తుంది.

New-generation Volkswagen Tiguan R-Line Interior
New-generation Volkswagen Tiguan R-Line Interior (Photo Credit- Volkswagen India)

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ R-లైన్ ఫీచర్లు: టిగువాన్ R-లైన్​లో అందించిన ఇతర గొప్ప ఫీచర్లలో పనోరమిక్ సన్‌రూఫ్, 30-రంగుల యాంబియంట్ లైటింగ్, ట్రై-జోన్ క్లైమేట్ కంట్రోల్, బ్రష్డ్ స్టెయిన్‌లెస్ స్టీల్ పెడల్స్, మసాజ్ ఫ్రంట్ సీట్లు, రెండు ఫోన్‌ల వరకు వైర్‌లెస్ ఛార్జింగ్, లెవల్ 2 ADAS ఉన్నాయి. భారతదేశంలో అందుబాటులో ఉన్న టిగువాన్ R-లైన్ వోక్స్‌వ్యాగన్ పార్క్ అసిస్ట్ ప్లస్ టెక్నాలజీని కూడా కలిగి ఉంది.

Rear profile of the new-generation Volkswagen Tiguan R-Line
Rear profile of the new-generation Volkswagen Tiguan R-Line (Photo Credit- Volkswagen India)

వోక్స్‌వ్యాగన్ టిగువాన్ R-లైన్ పవర్‌ట్రెయిన్: వోక్స్‌వ్యాగన్ టిగువాన్ R-లైన్​లో 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించింది. ఇది 201bhp శక్తిని, 320Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఇది కారు నాలుగు చక్రాలకు శక్తినిస్తుంది. ఈ ఇంజిన్ కారణంగా ఈ కారు 7.1 సెకన్లలో 0-100kph వేగాన్ని సులభంగా సాధించగలదు. దీని టాప్​ స్పీడ్ గంటకు 229 కిలోమీటర్లు అని కంపెనీ చెబుతోంది.

సీనియర్లు, విద్యార్థులకు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటీ- లైసెన్స్​ కూడా అవసరం లేదు!

స్టన్నింగ్ లుక్​లో టాటా కర్వ్ 'బ్లాక్ బ్యూటీ'- రేటెంతో తెలుసా?

నేడు ప్రపంచ క్వాంటం దినోత్సవం- ఇవాళే ఎందుకో తెలుసా? దీని హిస్టరీ ఏంటంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.