NASA Drops Woman Moon Mission: నాసా ప్రపంచానికి చేసిన ఒక వాగ్దానాన్ని విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు చంద్రునిపై తలపెట్టిన ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ను వదిలేసినట్లు సమాచారం. అసలేంటీ వాగ్దానం? దీన్ని ఇప్పుడు ఎందుకు విరమించుకుంది? వంటి వివరాలను తెలుసుకుందాం రండి.
నాసా వాగ్దానం ఏంటి?: చంద్రునిపై మానవులను దింపేందుకు అమెరికన్ అంతరిక్ష సంస్థ నాసా ఆర్టెమిస్ కార్యక్రమాన్ని రూపొందించింది. అమెరికా చివరిసారిగా 1972 డిసెంబర్‌లో చంద్రునిపైకి వ్యోమగాములను పంపింది. అదే చివరి అపోలో మిషన్. ఆ తర్వాత 2027లో ఆర్టెమిస్ ప్రోగ్రాం ద్వారా మానవులను చంద్రుని ఉపరితలంపైకి పంపాలని ప్రణాళికలు రూపొందించింది. ఈ ఆర్టెమిస్ కార్యక్రమం ద్వారా మొట్ట మొదటిసారి మహిళను, మొదటి నల్లజాతి వ్యక్తిని చంద్రునిపైకి పంపిస్తామని నాసా వాగ్దానం చేసింది. కానీ ఇప్పుడు ఈ వాగ్దానాన్ని నెరవేర్చే ఆలోచనను విరమించుకుంది.
NASA వెబ్‌సైట్‌లోని ఆర్టెమిస్ ప్రోగ్రామ్ పేజ్లో గతంలో దీని గురించి ప్రస్తావించారు. "నాసా చంద్రునిపై మొదటి మహిళ, మొదటి నల్లజాతి వ్యక్తి, ఫస్ట్ ఇంటర్నేషనల్ పార్టనర్ ఆస్టానాట్ను చంద్రునిపై దింపనుంది. ఇందుకోసం మునుపెన్నడూ లేని విధంగా చంద్రుని ఉపరితలాన్ని అన్వేషించేందుకు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుంది" అని అది రాసుకొచ్చింది. అయితే ఇప్పుడు నాసా వెబ్‌సైట్ నుంచి ఈ రిఫెరనెన్స్ను తొలగించారు. దీంతో నాసా ఈ ప్లాన్ను విరమించుకున్నట్లు అంతా భావిస్తున్నారు.
ఇందుకు కారణం ఏంటంటే?: ఓ నివేదిక అందించిన సమాచారం ప్రకారం.. నాసా ఈ వాగ్దానాన్ని విరమించుకునేందుకు కారణం అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన నూతన విధానాలే. ట్రంప్ మళ్లీ అధ్యక్షుడైనప్పటి నుంచి అమెరికాలోని అన్ని సమాఖ్య సంస్థలను వైవిధ్యం (Diversity), సమానత్వం (Equity), చేరిక (Inclusion) అంటే DEI పద్ధతులను తొలగించాలని ఆదేశించారు.
ఓ నివేదిక ప్రకారం నాసా ప్రతినిధి అల్లార్డ్ బ్యూటెల్ గార్డియన్‌కు ఇమెయిల్ చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపారు. "అధ్యక్షుడి కార్యనిర్వాహక ఉత్తర్వుల దృష్ట్యా, NASA ఆర్టెమిస్ మిషన్‌లో భాగంగా చంద్రుని ఉపరితలంపైకి సిబ్బందిని పంపే ప్రణాళికలపై మా ప్రకటనను మేం నవీకరిస్తున్నాం. ట్రంప్ పరిపాలన మా ఏజెన్సీ కోసం ప్రణాళికల గురించి, అందరి ప్రయోజనం కోసం చంద్రుడు, అంగారక గ్రహానికి అన్వేషణను ఎలా విస్తరించాలనే దాని గురించి మరింత తెలుసుకునేందుకు మేం ఎదురుచూస్తున్నాం." అని ఆయన పేర్కొన్నారు.
యాపిల్ WWDC 2025 ఈవెంట్ డేట్స్ ఫిక్స్- iOS 19తో పాటు ఐఫోన్ 17 ఎయిర్ టీజర్ రిలీజ్ అప్పుడే!
హోండా అమేజ్ vs టాటా టిగోర్- ఈ రెండింటి టాప్ వేరియంట్లలో ఏది బెస్ట్?
దేశంలో మొట్టమొదటి 'మేక్ ఇన్ ఇండియా' MRI మెషీన్- ఇకపై తక్కువ ఖర్చుతోనే వైద్యం!