ETV Bharat / technology

50MP సెల్ఫీ కెమెరా, సూపర్ AI ఫీచర్లతో మోటరోలా 'స్మార్ట్​'ఫోన్- ధర ఎంతంటే? - MOTOROLA EDGE 60 PRO LAUNCHED

దేశీయ మార్కెట్​లోకి 'మోటరోలా ఎడ్జ్ 60 ప్రో' వచ్చేసిందోచ్- ధర, ఫీచర్ల వివరాలివే!

Motorola Edge 60 Pro Launched in India
Motorola Edge 60 Pro Launched in India (Photo Credit- Motorola)
author img

By ETV Bharat Tech Team

Published : April 30, 2025 at 3:29 PM IST

3 Min Read

Motorola Edge 60 Pro Launched: దేశీయ మార్కెట్​లోకి 'మోటరోలా ఎడ్జ్ 60 ప్రో' స్మార్ట్​ఫోన్ ఎంట్రీ ఇచ్చింది. కంపెనీ దీన్ని మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఎక్స్‌ట్రీమ్ చిప్‌సెట్, 1.5K రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల స్క్రీన్, 6000mAh బ్యాటరీ, వైర్డు అండ్ వైర్‌లెస్​తో పాటు రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి అనేక ప్రత్యేక ఫీచర్లతో లాంఛ్​ చేసింది. మరెందుకు ఆలస్యం ఈ మోటరోలా కొత్త ఫోన్​ ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్ల మరిన్ని వివరాలపై ఓ లుక్కేద్దాం రండి.

'మోటరోలా ఎడ్జ్ 60 ప్రో' స్పెసిఫికేషన్లు:

డిస్​ప్లే: మోటరోలా ఎడ్జ్ 60 ప్రో 1.5K (1,220×2,712 పిక్సెల్స్) రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల క్వాడ్ కర్వ్డ్ pOLED స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 446ppi పిక్సెల్ డెన్సిటీ, 4,500 నిట్స్ పీక్ బ్రైట్​నెస్​ను కలిగి ఉంది. కంపెనీ ఈ ఫోన్‌లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్​ కూడా అందించింది.

ప్రాసెసర్: ఈ ఫోన్‌లోని ప్రాసెసర్ కోసం కంపెనీ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఎక్స్‌ట్రీమ్ SoC చిప్‌సెట్‌ను అందించింది. ఇది 12GB వరకు LPDDR4X RAM, 512GB వరకు UFS 4.0 స్టోరేజీ సామర్థ్యంతో వస్తుంది.

ఆపరేటింగ్ సిస్టమ్: ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ OS పై రన్ అవుతుంది. కంపెనీ దీనితోపాటు మూడేళ్లపాటు OS అప్‌డేట్‌లను, నాలుగేళ్లపాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్‌డేట్‌లను అందిస్తామని హామీ ఇచ్చింది. ఈ OSతో పాటు కంపెనీ ఈ ఫోన్‌లో Moto AI రూపంలో అనేక ప్రత్యేక AI ఫీచర్లను కూడా చేర్చింది.

కెమెరా: ఈ ఫోన్ వెనక భాగంలో కంపెనీ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించింది. దీని మెయిన్ కెమెరా 50MP సోనీ లైటియా 700C సెన్సార్‌తో వస్తుంది. దీని ఎపర్చరు f/1.8. ఈ సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో కూడా వస్తుంది. ఈ ఫోన్ రెండవ వెనక కెమెరా 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌తో వస్తుంది. దీని ఎపర్చరు f/2.0. ఈ ఫోన్ మూడవ వెనక కెమెరా 10MP టెలిఫొటో లెన్స్‌తో వస్తుంది. దీని ఎపర్చరు f/2.0. ఇది 3x ఆప్టికల్ జూమ్ సపోర్ట్‌తో వస్తుంది.

ఫ్రంట్ కెమెరా: ఈ ఫోన్ ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాలింగ్​ కోసం కంపెనీ 50MP ఫ్రంట్ కెమెరాను అందించింది. దీని ఎపర్చరు f/2.0.

బ్యాటరీ: ఇందులో 6000mAh బ్యాటరీ ఉంది. ఇది 90W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్​కు సపోర్ట్‌ చేస్తుంది. ఈ ఫోన్‌లో 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్, 5W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఫెసిలిటీలు కూడా ఉన్నాయి.

కనెక్టివిటీ: కనెక్టివిటీ కోసం ఈ ఫోన్ 5G, 4G LTE, Wi-Fi 6E, బ్లూటూత్ 5.4, GPS, గ్లోనాస్, గెలీలియో, USB టైప్-C పోర్ట్ వంటి అనేక ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంది.

ఇతర ఫీచర్లు: ఈ ఫోన్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP68 + IP69 రేటింగ్స్​తో వస్తుంది. దీనితో పాటు ఈ ఫోన్ మిలిటరీ-గ్రేడ్ (MIL-STD-810H) డ్యూరబిలిటీ సర్టిఫికేషన్​ను కలిగి ఉంది. అంటే ఈ ఫోన్ చాలా స్ట్రాంగ్​గా ఉంటుంది.

ఈ ఫోన్‌లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లతో పాటు డాల్బీ అట్మోస్ సపోర్ట్ కూడా అందించారు. అంతేకాకుండా దీనికి ఇన్-డిస్​ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఈ ఫోన్ 160.69×73.06×8.24mm కొలతలు, 186 గ్రాముల బరువుతో వస్తుంది.

భారతదేశంలో ఈ ఫోన్ ధర: భారత మార్కెట్​లో ఈ ఫోన్ ధర రూ. 29,999. దీనిలో వినియోగదారులు 8GB RAM + 256GB స్టోరేజ్ సౌకర్యాన్ని పొందుతారు. ఈ ఫోన్ రెండవ వేరియంట్ 12GB RAM + 256GB స్టోరేజ్​తో వస్తుంది. దీని ధర రూ. 33,999.

కలర్ ఆప్షన్స్: కంపెనీ ఈ ఫోన్‌ను మూడు రంగులలో విడుదల చేసింది.

  • పాంటోన్ డాజ్లింగ్ బ్లూ
  • పాంటోన్ స్పార్క్లింగ్ గ్రేప్
  • పాంటోన్ షాడో

సేల్ వివరాలు: ఈ ఫోన్ సేల్ మే 7న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్, మోటరోలా ఇండియా వెబ్‌సైట్‌లో ప్రారంభమవుతుంది. అయితే వినియోగదారులు ఈ ఫోన్‌ను ఈరోజు నుంచే ఫ్లిప్‌కార్ట్, మోటరోలా ఇండియా వెబ్‌సైట్‌ ద్వారా ముందుగానే ఆర్డర్ చేసుకోవచ్చు.

ట్రూ కాలర్​లో 'స్కామ్​ఫీడ్' ఫీచర్- సరికొత్త సైబర్ మోసాలకు చెక్​ పెట్టండిలా!

'CMF ఫోన్ 2 ప్రో' vs 'ఒప్పో K13 5G': ఏ ఫోన్ కొనడం మంచిది?- ఎందులో ఎక్కువ ఫీచర్లు ఉన్నాయి?

అదిరే ఫీచర్లతో 'CMF బడ్స్ 2' సిరీస్ లాంఛ్- 50dB నాయిస్ క్యాన్సిలేషన్, 61.5 గంటల బ్యాటరీ లైఫ్‌తో!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.