Motorola Edge 60 Launched in India: భారత మార్కెట్లో 'మోటరోలా ఎడ్జ్ 60' స్మార్ట్‌ఫోన్ లాంఛ్ అయింది. ఇది బడ్జెట్ ధరలో ఫ్లాగ్‌షిప్ లాంటి ఫీచర్లను అందిస్తుంది. ఇది వీగన్ లెదర్ బ్యాక్‌తో రెండు పాంటోన్-సర్టిఫైడ్ షేడ్స్‌లో వస్తుంది. ఈ సందర్భంగా ఈ ఫోన్ ధర, స్పెసిఫికేషన్లు, ఫీచర్లపై ఓ లుక్కేద్దాం రండి.
మోటరోలా ఎడ్జ్ 60 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:
డిస్ప్లే: ఇది 6.67-అంగుళాల 1.5K 10-బిట్ pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌తో వస్తుంది.
ప్రాసెసర్: ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో 12GB LPDDR4X RAM, 256GB UFS 2.2 స్టోరేజ్ సదుపాయం అందుబాటులో ఉంది. వీటిని మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు విస్తరించుకోవచ్చు.
సాఫ్ట్వేర్: ఇది Android 15పై నడుస్తుంది. ఈ ఫోన్‌తో 3 OS అప్‌డేట్‌లు, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ను అందిస్తామని కంపెనీ ప్రకటించింది.
The Motorola Edge 60 (12+256GB) is priced at ₹24,999*, while the Edge 60 Fusion starts at ₹21,999*. Whether you want a pro-grade camera or an all-curved Pantone-validated display, there’s an Edge for you.
— Motorola India (@motorolaindia) June 10, 2025
ఏఐ ఫీచర్లు: ఈ ఫోన్ మోటో ఏఐ సూట్‌తో వస్తుంది. ఇందులో క్యాచ్ మీ అప్ స్మార్ట్ సమ్మరీస్, పే అటెన్షన్ రియల్-టైమ్ ట్రాన్స్క్రిప్షన్, రిమెంబర్ దిస్ పర్సనల్ మెమరీ రీకాల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ప్రొటెక్షన్: ఇది డస్ట్, వాటర్ ప్రొటెక్షన్ కోసం IP68 + IP69 రేటింగ్‌తో వస్తుంది. దీంతోపాటు MIL-STD-810H సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. ఇది ఫోన్ ఎత్తు నుంచి కిందపడిపోయినా దెబ్బతినకుండా తట్టుకోగలదని నిర్ధారిస్తుంది.
బ్యాటరీ: 'మోటరోలా ఎడ్జ్ 60' 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 68W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
కలర్ ఆప్షన్స్: ఈ ఫోన్ మార్కెట్లో రెండు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది.
- పాంటోన్ జిబ్రాల్టర్ సీ (నైలాన్-లుక్ ఫినిష్)
- పాంటోన్ షామ్రాక్ (లెదర్-లుక్ ఫినిష్)
ధర, సేల్ వివరాలు: దీని 12GB + 256GB వేరియంట్ ధర రూ.25,999. ఈ ఫోన్ జూన్ 17 నుంచి Flipkart, motorola.inతో పాటు ఆఫ్‌లైన్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది. కంపెనీ ఈ ఫోన్‌పై లాంఛ్ ఆఫర్లను కూడా ప్రకటించింది. యాక్సిస్ బ్యాంక్, IDFC బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ.1000 డిస్కౌంట్ లభిస్తుంది.
మార్కెట్లో దీని ప్రత్యర్థులు: మోటరోలా ఎడ్జ్ 60 రూ.30,000 కంటే తక్కువ ధర ఉన్న విభాగంలో ఐకూ నియో 10R, పోకో X7 ప్రో, వన్‌ప్లస్ నార్డ్ 4, ఇన్ఫినిక్స్ GT 30 ప్రో వంటి మోడల్స్‌తో పోటీ పడనుంది.
ఐఫోన్ల కోసం కొత్త 'iOS 26'- 'iOS 19'ను ఎందుకు రిలీజ్ చేయలేదు?