ETV Bharat / technology

మీ ఫోన్​ ఛార్జింగ్ త్వరగా అయిపోతోందా? ఈ ట్రిక్స్ పాటిస్తే ప్రాబ్లమ్ సాల్వ్!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 27, 2024, 6:16 PM IST

Mobile Battery Health Check : మీ స్మార్ట్ ఫోన్​లో తరచుగా ఛార్జింగ్ అయిపోతోందా? మీ ఫోన్ బ్యాటరీ పుల్​గా చూపిస్తున్నా ఛార్జింగ్ ఎక్కువసేపు నిలవటం లేదా? మరేం కంగారు పడకండి కొన్ని చిట్కాలను పాటించటం ద్వారా మీ ఫోన్ ఛార్జింగ్​ను సేవ్ చేయవచ్చు అవేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే!

mobile-battery-health-check
mobile-battery-health-check

Mobile Battery Health Check : ఈ కాలంలో ప్రతి ఒక్కరి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉండటం అనేది సర్వసాధారణం. అంతే కాకుండా ప్రస్తుతం నడుస్తున్న డిజిటల్ యుగంలో అన్ని చెల్లింపులు ఫోన్ ద్వారానే చేస్తుంటాం. అయితే కొన్ని కొన్ని సార్లు మన ఫోన్​లో తరచుగా ఛార్జింగ్ అయిపోతుంటుంది. ( Mobile Battery Draining Fast ) అప్పుడు మనం కంగారు పడి బ్యాటరీ లైఫ్ టైమ్ అయిపోయిందనుకుంటాం. కొత్త ఫోన్ కొనటమే బ్యాటరీ మార్చటమో చేస్తుంటాం. అయితే చాలా వరకూ మనం వినియోగించని యాప్​లు ఫోన్​లో ఉండటం లేదా అనవసర సెట్టింగ్​ల వలనే మన ఫోన్ ఛార్జింగ్ తగ్గిపోతుంటుంది. ఇక్కడ మీ ఫోన్ బ్యాటరీని సేవ్ చేసే కొన్ని చిట్కాలు.

1.బ్యాటరీ సెట్టింగ్ ఆప్షన్ చూసుకోండి.
ఆండ్రాయిడ్ ఫోన్లను వివిధ రకాల కంపెనీలు తయారుచేస్తాయి. ప్రతి కంపెనీ తన ఆపరేటింగ్ సిస్టమ్​ను తన అనుగుణంగా తయారు చేస్తారు. కాబట్టి, మీ ఫోన్​ సెట్టింగ్స్​లోకి వెళ్లగానే మీ బ్యాటరీ ఆప్షన్ మెుదటగా ఉందా లేదా చూడండి.

2.ఎంతసేపు ఛార్జ్ చేస్తున్నారు?
సెట్టింగ్స్​లో మీ బ్యాటరీ ఎంత ఉంది అనేది మాత్రమే కాకుండా, దానిని ఎంత సేపు ఛార్జింగ్ చేయాలి అనే విషయాన్ని గమనించాలి. దీని ద్వారా మీ బ్యాటరీని ఎలా సురక్షితంగా ఉంచాలో తెలుస్తుంది.

3.బ్యాటరీ హిస్టరీ
చాలా మంది తమ ఫోన్​ను రోజూ ఒకే విధంగా ఉపయోగిస్తారు. అందుకే బ్యాటరీ హిస్టరీ చెక్ చేయటం వల్ల ఎందుకు ఛార్జింగ్ త్వరగా అయిపోతోందో తెలుస్తుంది.

4.యాప్​ల వినియోగాన్ని గమనించండి.
కొన్ని యాప్స్ గ్రాఫిక్స్, గేమ్స్​కు సంబంధించినవి ఉంటాయి. అవి సాధారణ వాటితో పోల్చితే ఎక్కువగా ఛార్జింగ్​ను తీసుకుంటాయి. కాబట్టి ఫోన్​ల యాప్​ల వినియోగాన్ని గమనించండి. మీకు అవసరమైనవి లేకుంటే వాటిని డిలీట్ చేయండి.

5.వాటిని డిలీట్ చేయండి.
మీ ఫోన్​లో ఉన్న యాప్​లలో ఏది ఎక్కువ ఛార్జింగ్ తీసుకుంటుందో గమనించండి. ఒకవేళ ఆ యాప్ అవసరం మీకు లేకుంటే దానిని మీఫోన్ నుంచి తొలగించండి.

6.అతిగా ఛార్జింగ్ చేయకండి
రాత్రి వేళ మీ ఫోన్​ను ఛార్జింగ్ చేసి నిద్రపోకండి. ఇలా రాత్రంతా ఛార్జింగ్ అవటం వల్ల మీ ఫోన్ బ్యాటరీపై ఒత్తిడి పడుతుంది. ఒకవేళ ఇలా చేయాల్సి వస్తే ఆప్టిమైజ్​డ్ ఛార్జింగ్ ఆప్షన్​ను ఎంచుకొండి.

7.Accu బ్యాటరీ యాప్
మీ బ్యాటరీ స్థాయిని పూర్తిగా తెలుసుకోవడానికి Accu బ్యాటరీ యాప్​ను ఇన్ స్టాల్ చేసుకొండి. దీనికి కొంత మెుత్తంలో రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

8.ఛార్జింగ్ వివరాలు
మీరు Accu బ్యాటరీని ఇన్​స్టాల్ చేసుకున్న తర్వాత అది మీ బ్యాటరీ కండీషన్​ను, అది ఎంతకాలం వస్తుంది అన్న విషయాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా మన ఫోన్​ను ఏ విధంగా ఛార్జింగ్ చేయాలి అన్న విషయం తెలియజేస్తుంది.

9.ఆఫ్​స్క్రీన్​ వినియోగం ఎంత?
బ్యాటరీ డిశ్చార్జింగ్ వివరాలనూ చూడండి. దాని వల్ల మీ ఫోన్ స్క్రీన్ ఆఫ్​లో ఉన్నప్పుడు ఎంత ఛార్జింగ్ వినియోగిస్తున్నారో తెలుస్తుంది. మీ బ్యాటరీ ఉష్ణోగ్రతపై ఓ కన్ను వేయండి. ఒకవేళ అది అధికంగా ఉంటే ప్రమాదం.

10.బ్యాటరీ కండీషన్
మీరు బ్యాటరీ హెల్త్ సెక్షన్​కు వెళ్లటం వల్ల మీకు దాని కండీషన్​పై పూర్తి సమాచారం లభిస్తుంది. అదే విధంగా Accu బ్యాటరీ ఉపయోగించటం వల్ల బ్యాటరీ కండీషన్​పై సమాచారం ఎప్పటికప్పుడు మీకు లభిస్తుంది.
ఇవండీ మీ ఫోన్ బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచి దాని లైఫ్ టైమ్​ను పెంచే పద్ధతులు. వీటిని పాటించి ఎంచక్కా మీ బ్యాటరీ సామర్థ్యం పెంచుకోండి.

హై-కెపాసిటీ పవర్​ బ్యాంక్​ కొనాలా? మార్కెట్లోని టాప్​-10 ఆప్షన్స్ ఇవే!

కొత్త స్మార్ట్​ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఈ ఫీచర్లు ఉంటేనే తీసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.