ETV Bharat / technology

విండోస్‌ 10 వాడుతున్నారా? - మరికొన్ని రోజులే గడువు - ఇలా చేయకపోతే సపోర్ట్​ బంద్​!

- అతి త్వరలో ఆగిపోనున్న మైక్రోసాఫ్ట్ విండోస్​ 10 సపోర్ట్ - మీరు అదే ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నారా? - ఇలా చేయాలంటున్న టెక్​ నిపుణులు

Last Date for Windows 10 Update
Last Date for Windows 10 Update (Eenadu)
author img

By ETV Bharat Telugu Team

Published : October 4, 2025 at 12:03 PM IST

2 Min Read
Choose ETV Bharat

Last Date for Windows 10 Update: మీరు కంప్యూటర్​ వాడుతున్నారా? విండోస్‌ 10 ఓఎస్ ఉపయోగిస్తున్నారా?? అయితే మీకో అలర్ట్‌. ఈ వెర్షన్​కు సెక్యూరిటీ సపోర్ట్‌ నిలిపివేయనున్నట్టు మైక్రోసాఫ్ట్​ ప్రకటించింది. 2025 అక్టోబర్‌ 14 నుంచి సెక్యూరిటీ అప్‌డేట్స్‌ విడుదల చేయబోమని స్పష్టం చేసింది. మరి, ఇప్పటికీ ఈ ఆపరేటింగ్‌ సిస్టమ్‌నే వాడుతుంటే ఏం చేయాలి? విండోస్​ 11కు అప్‌డేట్‌ అవ్వాల్సిందేనా? అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

రెండేళ్ల క్రితమే!

విండోస్‌ 10కు సపోర్ట్‌ నిలిపివేయనున్నట్లు సుమారు రెండు సంవత్సరాల క్రితమే టెక్​ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ప్రకటించింది. ఆ గడువు మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం Windows 10 వాడుతున్నవారు ఏం చేయాలనే దానిపై మైక్రోసాప్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ యూసఫ్‌ మెహ్దీ తన బ్లాగ్‌ పోస్ట్‌లో రాసుకొచ్చారు. విండోస్‌ 10కు మైక్రోసాఫ్ట్‌ సపోర్ట్‌ నిలిపివేసినా.. OS​ మాత్రం ఎప్పటిలాగానే పనిచేస్తుందని ఆయన తెలిపారు. కానీ సెక్యూరిటీ అప్‌డేట్స్‌ మాత్రం రావని స్పష్టం చేశారు. దీని వల్ల భద్రతాపరమైన రిస్కులు, మాల్‌వేర్‌, కంపాటబిలిటీ సహా ఇతర సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో బ్రౌజింగ్‌ చేసే వారికి రిస్క్‌ పొంచి ఉంటుందని పేర్కొన్నారు.

ఆ సేవలు మరో మూడేళ్లు!

అయితే, సెక్యూరిటీ ఇంటెలిజెన్స్‌ అప్‌డేట్స్‌ మాత్రం 2028 అక్టోబర్‌ వరకు కొనసాగుతాయని మైక్రోసాఫ్ట్‌ స్పష్టం చేసింది. కానీ ఇది ప్రాథమిక స్థాయి భద్రతను మాత్రమే అందించగలదు. అలాగే, ఆపరేటింగ్‌ సిస్టమ్‌ సెక్యూరిటీ అప్‌డేట్స్‌తో పోలిస్తే యాంటీ వైరస్‌లు ఇచ్చే భద్రత అంతంతమాత్రమేనని పేర్కొంది. ఒకవేళ పూర్తి స్థాయిలో భద్రత కోరుకునేవారైతే ఎక్సటెండెడ్‌ సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ప్రోగ్రామ్‌ను (ESU) ఎంపిక చేసుకోవచ్చని మైక్రోసాఫ్ట్‌ సూచించింది. అయితే దీనికి కొంత అమౌంట్​ చెల్లించాల్సి ఉంటుంది. 2025 అక్టోబర్‌ 15 నుంచి డివైజ్‌ సెట్టింగ్స్‌లో సబ్‌స్క్రిప్షన్‌ ఆప్షన్‌ అందుబాటులో ఉంటుందని తెలిపింది.

మరి ఇప్పుడేం చేయాలి? :

మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ 10 వెర్షన్​ ను లక్షలాది మంది వినియోగిస్తున్నారు. వారంతా 11కు అప్‌గ్రేడ్‌ అయ్యేలా చూడాలని మైక్రోసాఫ్ట్‌ భావిస్తోంది. అందుకే విండోస్‌ 11కు అప్‌గ్రేడ్‌ అవ్వకపోతే సెక్యూరిటీ అప్‌డేట్స్‌ నిలిపివేస్తామంటోంది. అయితే, ఏదైనా కారణం చేత విండోస్‌ 10లోనే కొనసాగాల్సి వస్తే.. డబ్బులు పెట్టి ఎక్సెటెండెడ్‌ సెక్యూరిటీ అప్‌డేట్స్‌ (ESU) ప్రోగ్రామ్‌ కింద సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు ఈ ESU ప్రోగ్రామ్‌లో సెక్యూరిటీ అప్‌డేట్స్‌ మాత్రమే లభిస్తాయి. కొత్త ఫీచర్స్​ గానీ, డిజైన్‌ ఛేంజ్ రిక్వెస్టులు గానీ, నాన్‌ సెక్యూరిటీ రిక్వెస్టులు గానీ అందవు. కాబట్టి మీ పీసీ హార్డ్‌వేర్‌ సపోర్ట్‌ చేస్తే నిర్ణీత గడువులోగా విండోస్‌ 11కు అప్‌గ్రేడ్ అవ్వడం మంచిదని టెక్​ నిపుణులు సూచిస్తున్నారు. లేదనుకుంటే వారెంటీ ప్రోగ్రామ్‌కు సబ్‌స్క్రైబ్‌ చేసుకోవాలని చెబుతున్నారు.

GST 2.0 ఎఫెక్ట్- మరింత ఖరీదైనవిగా మారిన హార్లే-డేవిడ్సన్ మోటార్​సైకిళ్లు!

ఇప్పుడు చాటింగ్ దేశీ స్టైల్​లో- వాట్సాప్‌కు పోటీగా మేడ్ ఇన్ ఇండియా కొత్త యాప్!