ETV Bharat / technology

'డిజిటల్ టెక్నాలజీలో కీలక అడుగు'- మెటా 'కనెక్ట్'​లో ఏఐ స్మార్ట్​గ్లాసెస్!

Meta Connect 2025: మార్క్ జుకర్‌బర్గ్ ఏమన్నారో తెలుసా?

Meta to Launch AI Powered Smart Glasses at Connect Conference
Meta to Launch AI Powered Smart Glasses at Connect Conference (Photo Credit- AP Photo)
author img

By ETV Bharat Tech Team

Published : September 17, 2025 at 8:02 PM IST

2 Min Read
Choose ETV Bharat

Meta Connect 2025: మెటా తన "కనెక్ట్" ఈవెంట్‌లో కొత్త AI-ఆధారిత స్మార్ట్ గ్లాసెస్‌ను ఆవిష్కరించనుంది. ఇది హ్యూమన్-కంప్యూటర్ ఇంటరాక్షన్ టెక్నాలజీలో కీలక అడుగు కానుంది. ఈ మేరకు ఈ స్మార్ట్ గ్లాసెస్ ఇకపై కేవలం ఒక ప్రయోగంగా ఉండవని, మానవ-యంత్ర సంబంధాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లే మార్గంగా ఉంటాయని మెటా CEO మార్క్ జుకర్‌బర్గ్ ఈ కార్యక్రమానికి ముందుగా ఓ హింట్ ఇచ్చారు.

మెటా "కనెక్ట్" డెవలప్ ఈవెంట్​ను ఏటా నిర్వహిస్తూ వస్తోంది. ఈ వార్షిక కార్యక్రమాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ 18న 5:30 గంటలకు నిర్వహించనున్నారు. ఈ ఏడాది నిర్వహించనున్న ఈవెంట్​లో AI లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఆధిపత్యం చెలాయించనుంది.

గతేడాది కంపెనీ "ఓరియన్" అనే AR గ్లాసెస్ మోడల్​ను ప్రదర్శించింది. దీనిని జుకర్‌బర్గ్ "మోస్ట్ అడ్వాన్స్డ్ గ్లాసెస్ ఎవర్​"గా అభివర్ణించారు. అయితే మార్కెట్లో ఈ ప్రొడక్ట్​ను ఇంకా ప్రారంభించలేదు. మరోవైపు అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక ప్రకారం ఈసారి మెటా చిన్న డిస్‌ప్లే కలిగి ఉండే స్మార్ట్ గ్లాసెస్‌ను ప్రవేశపెట్టవచ్చని, ఇవి యూజర్ మణికట్టు (Wrist)పై ధరించే బ్యాండ్ నియంత్రణలో ఉంటాయని భావిస్తున్నారు.

మెటా AI గ్లాసెస్ ప్రత్యేక ఫీచర్లు: ఈ కొత్త గ్లాసెస్ టైమ్, వెదర్, నోటిఫికేషన్స్, ఫొటో ప్రివ్యూస్, క్యాప్షన్స్, స్పీట్ ట్రాన్స్​లేషన్, మెటా AI రెస్పాన్సెస్​ సహా చాలానే ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంటాయి. ఈ గ్లాసెస్‌ను వాట్సాప్, ఇన్​స్టాగ్రామ్ వంటి యాప్​లతో కూడా ఇంటిగ్రేట్ చేయొచ్చు.

అదనంగా మెటా తన వార్షిక కార్యక్రమంలో రే-బాన్ మెటా గ్లాసెస్ కొత్త వెర్షన్‌లను కూడా ప్రవేశపెట్టవచ్చు. ఇది యూజర్ చుట్టుపక్కల పరిసరాలను అర్థం చేసుకునే AI సామర్థ్యాన్ని పెంచుతుంది. అయితే కంపెనీ ఇంతవరకూ తన రే-బాన్ మెటా గ్లాసెస్ సేల్ రికార్డ్​లను పంచుకోలేదు. కానీ ఇవి ఊహించినదానికంటే ఎక్కువ ప్రజాదరణను సాధించినట్లు తెలుస్తోంది.

ఇకపోతే "సూపర్ ఇంటెలిజెన్స్"ని రోజువారీ జీవితంలోకి తీసుకురావడానికి AI గ్లాసెస్ ఒక వాహనంగా ఉంటుందని మార్క్ జుకర్‌బర్గ్ చెప్పారు. మెటా ఇప్పుడు వర్చువల్ రియాలిటీ వైపు మాత్రమే కాకుండా AI, AGI వైపు కూడా వేగంగా అడుగులేస్తోంది. సెప్టెంబర్ 17వ తేదీ రాత్రి 8 గంటలకు తూర్పు కాలమానం (ET) ప్రకారం, అంటే భారతకాలమానం ప్రకారం సెప్టెంబర్ 18వ తేదీ ఉదయం 5:30 గంటలకు జరగనున్న మెటా కనెక్ట్ 2025 ఈవెంట్‌లో జుకర్‌బర్గ్ తన కీలక ప్రసంగం చేయనున్నారు.