Meta AI Assistant App Launched: మెటా ఈరోజు కొత్త 'మెటా AI యాప్'ను ప్రారంభించింది. దీన్ని మెటా లార్జ్ లాంగ్వెజ్ మోడల్ Llama 4 మోడల్ ఆధారంగా రూపొందించారు. వాయిస్ ద్వారా కమ్యూనికేషన్ కోసం మెటా దీన్ని తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా మీరు AI సహాయంతో దానితో చాలా సహజంగా మాట్లాడొచ్చు. మనకు పరియచం ఉన్న వ్యక్తితోనే మాట్లాడుతున్నట్లుగా దీన్ని మనకు కావాల్సిన ప్రశ్నలు అడగొచ్చు. మెటా నుంచి వచ్చిన ఈ కొత్త AI యాప్ కంపెనీ ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు అయిన వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, మెసెంజర్లకు కూడా కనెక్ట్ అయి ఉంటుంది. ఈ కొత్త 'మెటా AI యాప్'ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్‌లలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మెటా AI యాప్ ఎలా పని చేస్తుంది?:
- ఈ AI యాప్ మొదట క్రమంగా దాని వినియోగదారులను అంటే మీ గురించి తెలుసుకుని మిమ్మల్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. తద్వారా ఇది మీ అవసరాలకు అనుగుణంగా మీకు మరింత వ్యక్తిగత, ఉపయోగకరమైన సమాధానాలను అందిస్తుంది.
- ఇది వినియోగదారులకు తమ వ్యావహారిక భాషలోనే సమాధానమిస్తుంది. దీంతో యూజర్లు ఏమైనా ప్రశ్నలు అడుగుతున్న సమయంలో తనకు తెలిసిన మనిషితో మాట్లాడుతున్నట్లుగానే అనుభూతి చెందుతారు. దీంతోపాటు వారికి AI యాప్‌తో మాట్లాడటం ఇంకా సులభం అవుతుంది.
- ఈ AI యాప్ దాని వినియోగదారుల ఇంట్రెస్టులు, ప్రొఫైల్‌ల నుంచి సమాచారాన్ని సేకరించి దానిని అర్థం చేసుకుని తదనుగుణంగా వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందిస్తుంది.
- మీరు మీ ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లను ఒకే ఖాతాకు లింక్ చేసి ఉంటే ఈ యాప్ రెండు ప్లాట్‌ఫారమ్‌ల ప్రొఫైల్‌ల నుంచి సమాచారాన్ని సేకరిస్తుంది. తద్వారా మీ ప్రశ్నలకు సమాధానాలను మరింత మెరుగ్గా అందించగలుగుతుంది.
- మెటా ఈ AI యాప్‌ను అమెరికా, కెనడాలో మొదట ప్రారంభించింది. ఇప్పుడు మరికొన్ని దేశాలకు క్రమంగా విస్తరిస్తోంది.
అక్షయ తృతీయ ఆఫర్: ఈ స్కూటర్లపై ఏకంగా రూ.40 వేల తగ్గింపు!- ఇవాళ ఒక్కరోజే ఛాన్స్!
50MP సెల్ఫీ కెమెరా, సూపర్ AI ఫీచర్లతో మోటరోలా 'స్మార్ట్'ఫోన్- ధర ఎంతంటే?
ట్రూ కాలర్‌లో 'స్కామ్‌ఫీడ్' ఫీచర్- సరికొత్త సైబర్ మోసాలకు చెక్ పెట్టండిలా!