Mercedes Maybach SL 680 Launched: లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ తన అల్ట్రా లగ్జరీ బ్రాండ్ మేబ్యాక్ పేరుతో భారత మార్కెట్లో కన్వర్టిబుల్ సెడాన్‌ను విడుదల చేసింది. కంపెనీ ఈ మెర్సిడెస్ మేబ్యాక్ SL 680 మోనోగ్రామ్ సిరీస్‌ను రూ. 4.2 కోట్ల (ఎక్స్-షోరూమ్) ధరతో విడుదల చేసింది. ఈ కారు మొదటిసారిగా 2024 సంవత్సరంలో ప్రదర్శించారు. ఈ లగ్జరీ రోడ్‌స్టర్ ఇప్పటివరకు అత్యంత స్పోర్టియెస్ట్ మేబ్యాక్‌గా నిలిచింది. కంపెనీ దీని బుకింగ్స్‌ను ఇప్పటికే ప్రారంభించింది. అయితే ఈ ఏడాది మూడు యూనిట్లను మాత్రమే సేల్ చేయాలని కంపెనీ నిర్ణయించింది.
మెర్సిడెస్-మేబాచ్ SL 680 ఎక్స్టీరియర్: ఈ కొత్త మోడల్‌ను AMG SL 63 కారు ఆధారంగా రూపొందించారు. దీని డిజైన్ గురించి మాట్లాడుకుంటే ప్రకాశవంతమైన వెర్టికల్ స్లాట్‌లతో కూడిన క్రోమ్ రేడియేటర్ గ్రిల్, కారు ముందు భాగంలో మేబ్యాక్ బ్యాడ్జింగ్ ఉంది. ఇది SL 680 కారుని AMG SL 63 నుంచి కాస్తంత భిన్నంగా చేస్తుంది. అయితే దీని బంపర్, పొడవైన బానెట్ అబ్సిడియన్.. బ్లాక్ కలర్ ఫినిషింగ్‌తో, మేబ్యాక్ లోగోలతో నిండి ఉన్నాయి. దీంతో ఈ కారు చాలా ప్రత్యేకంగా కన్పిస్తుంది.

కస్టమైజేషన్ ప్రోగ్రామ్‌లో భాగంగా కారు కస్టమర్‌లు ఈ లోగోలను సాఫ్ట్-టాప్ ఫాబ్రిక్ రూఫ్‌పై ఎంబోస్డ్ చేయవచ్చు. ఇక సైడ్ ప్రొఫైల్‌లో 21-అంగుళాల ఫోర్జ్డ్ వీల్స్ దీనికి గ్రేట్ రోడ్ ప్రెజెన్స్‌ను అందిస్తాయి. ఇవి 36 స్పోక్స్‌ను కలిగి ఉంటాయి. మధ్యలో త్రీ-పాయింటెడ్ స్టార్ చిహ్నంతో కనెక్ట్ అయి ఉంటాయి.
దీని వీల్ ఆర్చ్‌ల పొడవునా సొగసైన క్రోమ్ స్ట్రిప్ ఉంటుంది. ఇలా మొత్తం ఒక వీల్లో 5 క్రోమ్ స్ట్రిప్స్ ఉంటాయి. ఇక దీని డోర్ హ్యాండిల్స్, ఫ్రంట్ ఫెండర్లపై కూడా క్రోమ్ ఉంటుంది. దీని ఫ్రంట్ ప్రొఫైల్ మాదిరిగానే వెనక వైపు కూడా సొగసైన, క్రోమ్‌తో అలంకరించిన వెనక బంపర్ ఉంటుంది. అయితే ఇది రోడ్‌స్టర్‌తో పోలిస్తే తక్కువ ఆకర్షణీయంగా కన్పిస్తుంది.

మెర్సిడెస్-మేబాచ్ SL 680 ఇంటీరియర్: ఈ కొత్త SL 680 కారు దాని నాలుగు సీట్ల సిబ్లింగ్ AMG మాదిరిగా కాకుండా ఇద్దరు వ్యక్తులకు మాత్రమే సీటింగ్ సామర్థ్యాన్ని అందిస్తుంది. దీన్ని మెర్సిడెస్ పర్సనలైజేషన్ రేంజ్ కర్టసీతో వచ్చే తెల్లటి నప్పా లెదర్ అప్హోల్స్టరీతో క్యాబిన్‌ను అలంకరించారు. దీనితో పాటు కొత్త త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్‌పై 'MAYBACH' అని ముద్రించారు. అయితే సీట్ హెడ్‌రెస్ట్‌ల వెనక ఉన్న రోల్ హూప్‌లపై మాత్రం మేబ్యాక్ లోగోలు ఉన్నాయి.

కారు డాష్‌బోర్డ్‌లో 12.3-అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లే, అడ్జస్టబుల్ 11.9-అంగుళాల సెంట్రల్ టచ్‌స్క్రీన్ ఉన్నాయి. ఇది SL 63 మాదిరిగానే ఉంటుంది. ఇక మెర్సిడెస్ AI- బేస్డ్ MBUX మల్టీమీడియా సిస్టమ్ అనేది సెంట్రల్ టచ్‌స్క్రీన్‌లో కనిపిస్తుంది. కారు క్యాబిన్‌లో నాయిస్ స్థాయిని తగ్గించేందుకు ఎగ్జాస్ట్ సిస్టమ్‌ను కూడా సవరించారు. దీంతోపాటు సౌకర్యం కోసం సస్పెన్షన్‌ను కూడా ట్యూన్ చేశారు.

మెర్సిడెస్-మేబాచ్ SL 680 పవర్‌ట్రెయిన్: ఈ పవర్ఫుల్ రోడ్‌స్టర్‌కు మరింత శక్తిని అందించేందుకు కంపెనీకి సుపరిచితమైన 4.0-లీటర్, ట్విన్-టర్బో V8 ఇంజిన్‌ను హుడ్ కింద అమర్చారు. ఈ ఇంజిన్ 577bhp పవర్, 800Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌తో జత చేసిన 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ నాలుగు చక్రాలకు శక్తిని పంపుతుంది. ఈ 'మేబ్యాక్ SL 680' కేవలం 4.1 సెకన్లలోనే 100kph వేగాన్ని అందుకోగలదని, దీని టాప్ స్పీడ్ గంటకు 260కి.మీ అని కంపెనీ పేర్కొంది.
హోండా షైన్ 100 అప్డేటెడ్ మోడల్ లాంఛ్- ఇప్పుడు దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా?
ఐఫోన్లో RCS కోసం E2EE సపోర్ట్- ఇకపై మీ క్రాస్-ప్లాట్‌ఫామ్ కాన్వర్జేషన్ మరింత సెక్యూర్!
'పోర్ట్-ఫ్రీ'గా ఐఫోన్ 17 ఎయిర్ మోడల్!- యాపిల్ అత్యంత సన్నని ఫోన్ ఇదేనట!