Mercedes Benz EQS SUV: మెర్సిడెస్ తన సరికొత్త బెంజ్ EQS SUV కారును లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో దీని లాంచింగ్ తేదీని ప్రకటించింది. మెర్సిడెస్ తన ఆరో మోడల్ ఎలక్ట్రిక్ కారును సెప్టెంబర్ 16న దీన్ని రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా దీని ధర, ఫీచర్లు వంటి వివరాలు మీకోసం.
Mercedes-Benz EQS Exterior: మెర్సిడెస్ బెంజ్ EQS SUV కారు ఎక్స్టీరియర్లో షార్ప్ LED హెడ్‌ల్యాంప్స్, బ్లాక్-అవుట్ బ్లాక్ ప్యానెల్ గ్రిల్, ముందుభాగంలో హారిజంటల్ LED లైట్ స్ట్రిప్ ఉన్నాయి. ఇది అల్లాయ్ వీల్స్, LED లైట్ బార్‌తో కూడిన LED టైల్‌లైట్లు, ట్వీక్డ్ బంపర్‌ను కూడా కలిగి ఉంది.
Mercedes-Benz EQS Interior: ఈ కారు ఇంటీరియర్‌లో ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సెంటర్ టచ్‌స్క్రీన్, కో-డ్రైవర్ డిస్‌ప్లేకి కనెక్టయిన MBUX హైపర్‌స్క్రీన్ అనే పెద్ద సింగిల్-పీస్ ప్యానెల్ ఉంది. ఇందులో ఆగ్మెంటెడ్ రియాలిటీ నావిగేషన్‌తో ఆప్షనల్ హెడ్-అప్ డిస్‌ప్లే కూడా ఉండొచ్చని మార్కెట్ నిపుణుల అంచనా.
Mercedes-Benz EQS Design: మెర్సిడెస్ బెంజ్ EQS SUV డిజైన్ ఇటీవల విడుదలైన మేబ్యాక్‌ను పోలి ఉంటుంది. ఇందులో కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే మార్చనున్నట్లు సమాచారం. మేబ్యాక్ గ్రిల్‌కు విభిన్నమైన గ్రిల్‌ను దీనిలో అమర్చనున్నారు. అలాగే దీని బంపర్ స్టైలింగ్‌లో కూడా మార్పులు చేయనున్నారు. మెర్సిడెస్ బెంజ్ EQS SUV కారు 118 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు గరిష్ట వేగం గంటకు 210 కిలోమీటర్లు.
ఇది మార్కెట్లో 3 పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలో మార్కెట్లో అందుబాటులోకి రానుంది. వీటిలో వెనుక చక్రాల డ్రైవ్ 450+, ఆల్-వీల్ డ్రైవ్ 450 4మ్యాటిక్ అండ్ ఆల్-వీల్ డ్రైవ్ 580 4మ్యాటిక్ ఉన్నాయి. ఈ మూడింటిలో 580 4మ్యాటిక్ వేరియంట్ ధర అత్యధికంగా ఉండనున్నట్లు సమాచారం. ఇది 400kW, 858 Nm పీక్ టార్క్ కోసం డ్యూయల్ మోటార్ పవర్‌ట్రెయిన్‌ని కలిగి ఉండే అవకాశం ఉంది.
Mercedes-Benz EQS SUV Specifications:
- ఫ్యూయల్ టైప్: ఎలక్ట్రిక్
- ఎమిషన్ నార్మ్ కాంప్లియన్స్: ZEV
- పొడవు: 5125 mm
- వెడల్పు: 1959 mm
- హైట్: 1718 mm
- సీటింగ్ కెపాసిటీ: 7
- వీల్ బేస్: 3210 mm
- నంబర్ ఆఫ్ డోర్స్: 5
- ధర: రూ.2 కోట్లు
మార్కెట్లోకి రియల్మీ 5జీ నయా ఫోన్- ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ! - Realme P2 Pro 5G Launched