ETV Bharat / technology

ఆకాశంలో కనువిందు చేయనున్న ఉల్కాపాతం- నిప్పులు కక్కుతూ నేలకు జారనున్న ఉల్కలు! - LYRID METEOR SHOWER 2025

ఈ రాత్రి ఆకాశంలో ఉల్కాపాతం- ఎక్కడ, ఎలా చూడాలి?- వివరాలు మీకోసం!

2025 Lyrid Meteor Shower Tonight (Representational Image)
2025 Lyrid Meteor Shower Tonight (Representational Image) (Photo Credit- ETV Bharat)
author img

By ETV Bharat Tech Team

Published : April 22, 2025 at 9:08 PM IST

3 Min Read

Lyrid Meteor Shower 2025: అనంత విశ్వంలో ఎన్నో అద్భుతాలు. భూమి, గ్రహాలు, సౌర వ్యవస్థ అన్నీ విశ్వంలో భాగమే. అందులో భాగమైన ఆకాశాన్ని రాత్రి వేళల్లో చూస్తూ చుక్కలను లెక్కపెట్టడం మాటలకు అందని అనుభూతి. అలా చూస్తున్నప్పుడు కొన్నిసార్లు రయ్యున కాంతి పుంజాలు భూమిపైకి దూసుకువస్తున్నట్లు కన్పిస్తాయి. అవే ఉల్కలు. కొన్ని సెకండ్ల పాటు కనిపించే ఈ ఉల్కలు అంబరానికే అందాన్ని తెస్తాయి. అర్ధరాత్రి మెరుస్తూ అద్భుతాన్ని చూపిస్తాయి. అలాంటి సందర్భాల్లో వాటిని అలానే వీక్షిస్తూ మనల్ని మనం మైమరిచిపోతుంటాం.

అచ్చం అలాంటి అనుభూతిని అందించే ఒక ఆసక్తికరమైన దృశ్యం ఈ రాత్రి ఆకాశంలో కనువిందు చేయనుంది. అనేక తోకచుక్కలు ఒకేసారి ఆకాశం నుంచి జారుతూ కన్పించనున్నాయి. ఇంచుమించు 1 గంట పాటు ఆకాశంలో దాదాపు 10 నుంచి 20 ఉల్కలు కన్పించనున్నాయి. ఈ ఉల్కాపాతం ఈరోజు అంటే మంగళవారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమై ఏప్రిల్ 23 ఉదయం వరకు కొనసాగుతుంది. ఈ సందర్భంగా అసలేంటీ ఉల్కాపాతం? ఇది ఎందుకు సంభవిస్తుంది? దీన్ని ఎలా చూడాలి? వంటి వివరాలు తెలుసుకుందాం రండి.

దీని గురించి ఈటీవీ భారత్ ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లోని వీర్ బహదూర్ సింగ్ ప్లానిటోరియంకు చెందిన ఖగోళ శాస్త్రవేత్త అమర్ పాల్ సింగ్‌ను సంప్రదించింది. మన సౌర వ్యవస్థలోని గ్రహాల మధ్య ఖాళీలో లెక్కలేనన్ని చిన్న రాతి లేదా ఇనుప కణాలు ఉన్నాయని ఆయన అన్నారు. అటువంటి కణాలు భూమి గురుత్వాకర్షణ శక్తి ద్వారా వేగవంతమై వాతావరణ ఘర్షణ కారణంగా అవి రాత్రిపూట కొద్దిసేపు ప్రకాశవంతంగా కనిపిస్తాయని వివరించారు. దీన్నే ఉల్కాపాతంగా చెబుతుంటారని ఆయన తెలిపారు.

ఉల్కాపాతం అంటే ఏంటి?: ఉల్కాపాతాలు ఏదో ఒక రకమైన తోకచుక్కకు సంబంధించినవని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. తోకచుక్క అనేది రాతి, ధూళి, మంచు, వాయువులతో తయారైన సౌర వ్యవస్థ వస్తువు. ఇది గ్రహాల మాదిరిగానే సూర్యుని చుట్టూ తిరుగుతుంది. వాటి నుంచి వెలువడే కణాలు అంతరిక్షంలో తిరుగుతాయి. భూమి తన వార్షిక చలనం (Annual Motion)లో తోకచుక్క మార్గం గుండా వెళ్తున్నప్పుడు భూ వాతావరణంలో ఘర్షణ కారణంగా తోకచుక్క కణాలు కాలిపోతాయి. అందుకే ఆ సమయంలో అవి ప్రకాశవంతంగా కనిపిస్తాయి. ఈ దృగ్విషయాన్ని ఖగోళ శాస్త్ర పరంగా ఉల్కాపాతం అని పిలుస్తారు. అయితే ఈసారి వచ్చే ఉల్కాపాతం లైరిడ్ ఉల్కాపాతం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

లైరిడ్ ఉల్కాపాతం అంటే?: ఈ అరుదైన ఖగోళ సంఘటన ప్రతి సంవత్సరం ఏప్రిల్ చివరిలో జరుగుతుంది. ఈ ఉల్కాపాతం అనేది తోకచుక్క (C/1861G1) నుంచి కణాలు భూమి వాతావరణంలోకి ప్రవేశించడం వల్ల సంభవిస్తుంది. ఈ ఉల్కాపాతానికి కారణం థాచర్ అనే తోకచుక్క. ఇది ప్రతి 415 సంవత్సరాలకు ఒకసారి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇది 2276లో మళ్లీ భూమిపై కనిపిస్తుంది.

Lyrid Meteor Shower
Lyrid Meteor Shower (Photo Credit- ETV Bharat)

ఇది ఎప్పుడు కన్పిస్తుంది?: నిజానికి ఈ లైరిడ్ ఉల్కాపాతం ఏటా ఏప్రిల్ 16న ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 25 నుంచి 30 వరకు కన్పిస్తుంది. ఈసారి ఇది ఏప్రిల్ 22 అర్ధరాత్రి నుంచి ఏప్రిల్ 23 తెల్లవారుజాము వరకు కన్పిస్తుంది. ఈ సమయంలో దాదాపు గంటసేపు 10 నుంచి 20 ఉల్కలు కనిపిస్తాయి. ఈ ఉల్కాపాతం భూమికి దాదాపు 100 కి.మీ ఎత్తులో ఉంటుంది. సెకనుకు 47 కి.మీ వేగంతో కదులుతుంది. అయితే లైరిడ్ ఉల్కాపాతం అంత ప్రకాశవంతమైనది కాదు.

దీన్ని ఎలా చూడాలి?: ఈ ఉల్కాపాతాన్ని వీక్షించడానికి ప్రత్యేక ప్రిపరేషన్, పరికరాలు ఏమీ అవసరం లేదు. ఈ అరుదైన దృశ్యాన్ని స్పష్టంగా చూడటానికి తక్కువ వెలుతురు ఉన్న ప్రదేశానికి వెళ్తే సరిపోతుంది. టెలిస్కోప్ లేకుండానే సాధారణ ప్రజలు ఈ దృగ్విషయాన్ని కంటితో చూడగలరు.

ప్రకాశవంతమైన నక్షత్రం 'వేగా': ప్రతి ఏప్రిల్‌లో సంభవించే ఈ ఉల్కాపాతాన్ని లైరిడ్ ఉల్కాపాతం లేదా 'లైరా కాన్స్టెలేషన్' అని కూడా పిలుస్తారని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇది చిన్నది కానీ గుర్తించదగిన నక్షత్ర సముదాయం. ఆకాశం క్లియర్​గా ఉన్నప్పుడు అర్ధరాత్రి తూర్పు వైపున దీన్ని స్పష్టంగా చూడవచ్చు. ఈ ఉల్కాపాతంలో ప్రకాశవంతమైన నక్షత్రం 'వేగా'. ఇది ఆకాశంలోని ప్రకాశవంతమైన నక్షత్రాలలో 5వ స్థానంలో ఉంది. నేటి ఉల్కాపాతం లైరా నక్షత్ర సముదాయం నుంచి వస్తున్నట్లు కనిపిస్తుంది. కాబట్టి ఈ ఉల్కాపాతాన్ని లైరా ఉల్కాపాతం అని పిలుస్తారు.

ఇస్రో ఖాతాలో మరో ఘనత- రోదసిలో స్పేడెక్స్ రెండో డాకింగ్ ప్రక్రియ సక్సెస్

ఎయిర్​టెల్ యూజర్లకు గుడ్​న్యూస్- స్పామ్ డిటెక్షన్ టూల్​లో మరో రెండు ఫీచర్లు- ఇవి ఎలా ఉపయోగపడతాయంటే?

ఆకాశం నవ్వటాన్ని ఎప్పుడైనా చూశారా?- ఏప్రిల్ 25న చూస్తే 'స్మైలీ ఫేస్'తో పలకరిస్తుంది కూడా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.