ETV Bharat / technology

లావా 'స్టార్మ్' సిరీస్​లో రెండు కొత్త ​ఫోన్​లు- డైమెన్సిటీ 7060 చిప్​తో 'స్టార్మ్ ప్లే 5G'- భారత్​లో ఇదే ఫస్ట్! - LAVA STORM 5G SERIES TEASED

త్వరలో మార్కెట్​లోకి 'లావా స్టార్మ్ ప్లే 5G', 'స్టార్మ్ లైట్ 5G'- లాంఛ్​కు ముందే స్పెక్స్ రివీల్

Lava Storm 5G
Lava Storm 5G (Photo Credit- Lava Mobiles)
author img

By ETV Bharat Tech Team

Published : June 4, 2025 at 9:14 PM IST

2 Min Read

Lava Storm 5G Series: దేశీయ స్మార్ట్‌ఫోన్ కంపెనీ లావా మొబైల్స్ భారతదేశంలో తన స్మార్ట్‌ఫోన్ లైనప్‌ను విస్తరించే పనిలో పడింది. కంపెనీ త్వరలో తన స్టార్మ్ సిరీస్​లో రెండు కొత్త స్మార్ట్​ఫోన్​లను విడుదల చేయనుంది. వీటిని 'లావా స్టార్మ్ ప్లే 5G', 'లావా స్టార్మ్ లైట్ 5G' పేర్లతో తీసుకురానుంది. తాజాగా కంపెనీ వీటి ఈ రెండు ఫోన్‌లకు సంబంధించిన స్పెసిఫికేషన్‌ల వివరాలను కూడా వెల్లడించింది.

ముఖ్యంగా 'లావా స్టార్మ్ ప్లే 5G'లో ప్రాసెసర్ కోసం మీడియాటెక్ డైమెన్సిటీ 7060 చిప్‌సెట్ ఇవ్వనున్నట్లు తెలిపింది. భారతదేశంలో ఈ చిప్‌సెట్‌తో రిలీజ్ కాబోతున్న మొదటి స్మార్ట్‌ఫోన్ ఇదే. ఈ చిప్‌సెట్‌తో LPDDR5 RAM, UFS 3.1 స్టోరేజ్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఈ చిప్‌సెట్​తోపాటు ఇంత RAM అండ్ స్టోరేజ్​ను అందిస్తున్నారంటే కంపెనీ గేమింగ్ ప్రియులకు లక్ష్యంగా చేసుకునే ఈ ఫోన్​ను తీసుకొస్తుందని తెలుస్తోంది. దీంతో పాటు మల్టీ టాస్కింగ్ పనులు, యాప్ లోడింగ్ స్పీడ్ కూడా ఈ ఫోన్‌లో బాగుంటుంది. ఇది 5G కనెక్టివిటీతో వస్తుంది.

లావా స్టార్మ్ ప్లే 5G స్పెసిఫికేషన్లు:

డిస్​ప్లే: ఈ ఫోన్ 6.78-అంగుళాల HD ప్లస్ LCD స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది.

ర్యామ్ అండ్ స్టోరేజ్: ఈ ఫోన్‌తో వినియోగదారులకు 6GB RAM, 128GB ఇన్-బిల్ట్ స్టోరేజ్ లభిస్తుంది.

లాంఛ్ ఎప్పుడు?: కంపెనీ వీటి లాంఛ్ తేదీని ఇంకా ప్రకటించలేదు. అయితే మరికొన్ని రోజుల్లో వెల్లడించే అవకాశం ఉంది. రిలీజ్ అయిన తర్వాత కస్టమర్‌లు లావా ఇండియా ఇ-స్టోర్, అమెజాన్ ద్వారా ఈ రెండు ఫోన్​లను కొనుగోలు చేయొచ్చు.

ఈ లావా లైనప్ స్టాండర్డ్ వెర్షన్ 'లావా స్టార్మ్ 5G'. దీన్ని డిసెంబర్ 2023లో ప్రారంభించారు. ఈ ఫోన్ ధర రూ. 12,499. ఇది 8GB RAM, 128GB స్టోరేజ్​తో వస్తుంది. ఈ ఫోన్‌ను అమెజాన్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. కంపెనీ దీన్ని గేల్ గ్రీన్, థండర్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్​లలో విడుదల చేసింది.

లావా స్టార్మ్ 5G స్పెసిఫికేషన్లు:

డిస్​ప్లే: ఇందులో 6.78-అంగుళాల FHD + LCD స్క్రీన్‌ ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది.

ప్రాసెసర్: ఫోన్‌లోని ప్రాసెసర్ కోసం కంపెనీ 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్‌సెట్‌ను అందించింది. వినియోగదారులు ఈ ఫోన్ స్టోరేజ్​ను 1TB వరకు పెంచుకోవచ్చు.

కెమెరా సెటప్: ఈ ఫోన్ వెనక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. దీని మెయిన్ కెమెరా 50MP, రెండవ కెమెరా 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం కంపెనీ 16MP ఫ్రంట్ కెమెరాను ఇచ్చింది.

బ్యాటరీ: ఈ ఫోన్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్​కు సపోర్ట్‌ చేస్తుంది.

ఆపరేటింగ్ సిస్టమ్: ఈ ఫోన్​ను ఆండ్రాయిడ్ 13 ఆధారంగా OSతో ప్రారంభించారు.

భారీ డేటా లీక్- 'ప్రమాదంలో 18.4 కోట్ల పాస్‌వర్డ్‌లు'- జాగ్రత్త సుమీ!!

ప్రపంచ కంపెనీలను ఆకర్షించే ప్రయత్నాలు- టెస్లాకు నాట్ ఇంట్రెస్ట్, BYDకి నో ఎంట్రీ!

చంద్రునిపై జపాన్ గురి, -153°C 'సీ ఆఫ్ కోల్డ్' వద్ద సాఫ్ట్ ల్యాండింగ్​కు ప్లాన్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.