ETV Bharat / technology

మార్కెట్​లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన 'కవాసకి వెర్సిస్-X 300'- ఇందులో కొత్తగా ఏం ఉందంటే? - KAWASAKI VERSYS X 300 LAUNCHED

2025 'కవాసకి వెర్సిస్-X 300' లాంఛ్- ఈ ప్రీమియం మోటార్​సైకిల్ ధర, ఫీచర్ల వివరాలు ఇవే!

Kawasaki Versys-X 300 Launched
Kawasaki Versys-X 300 Launched (Photo Credit- Kawasaki India)
author img

By ETV Bharat Tech Team

Published : May 22, 2025 at 5:31 PM IST

2 Min Read

Kawasaki Versys-X 300 Launched: ప్రీమియం మోటార్‌సైకిల్ తయారీ సంస్థ కవాసకి ఇండియా తన 'కవాసకి వెర్సిస్-X 300' 2025 అప్డేట్ వెర్షన్​ను విడుదల చేసింది. కంపెనీ ఈ మోటార్‌సైకిల్‌ ధరను రూ. 3.80 లక్షల (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. ఇది మునుపటిలాగే అదే ఇంజిన్, ఫీచర్ సెట్​తో వస్తుంది. అయితే అప్డేట్​గా దీనిలో కొత్త కలర్ ఆప్షన్​లను అలాగే కొత్త గ్రాఫిక్స్​ను అందించారు.

కవాసకి 'వెర్సిస్-X 300' కొన్నేళ్ల కిందట భారతదేశంలో అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది. అయితే తర్వాత దీని సేల్స్ నిలిపివేశారు. ఇప్పుడు ఇది కొన్ని అప్డేట్స్​తో దేశీయ మార్కెట్​లోకి రీ-ఎంట్రీ ఇచ్చింది. ఇందులో కొంగొత్త గాఫిక్స్, కొత్తగా బ్లూ అండ్ వైట్ కలర్ ఆప్షన్​లు ఉన్నాయి. దీనితో పాటు కఠినమైన ఉద్గార నిబంధనలకు అనుగుణంగా దీని ఇంజిన్​ను అప్డేట్​ చేశారు. భారతదేశంలో లోకల్ అసెంబుల్​ (CKD)ని సూచిస్తున్న నివేదికలు, చిత్రాలు ఉన్నప్పటికీ 'కవాసకి వెర్సిస్-X 300' ప్రస్తుతం పూర్తిగా నిర్మించిన యూనిట్ (CBU)గా అమ్ముడవుతోంది.

Kawasaki Versys-X 300
Kawasaki Versys-X 300 (Photo Credit- Kawasaki India)

కవాసకి వెర్సిస్-X 300 పవర్‌ట్రెయిన్: కంపెనీ ఇందులో 'కవాసకి నింజా 300' మోడల్​లో ఉన్న అదే 296 cc, సమాంతర-ట్విన్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను ఉపయోగించింది. ఇది 39.4bhp పవర్, 25.7Nm పీక్ టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. OBD-2B ఉద్గార నిబంధనల ఆధారంగా దాని ఇంజిన్‌ను అప్డేట్​ చేసింది. ఇది స్లిప్, అసిస్ట్ క్లచ్‌తో కూడిన 6-స్పీడ్ గేర్‌బాక్స్​తో వస్తుంది.

కవాసకి వెర్సిస్-X 300 హార్డ్‌వేర్:

ఈ మోటార్ సైకిల్​లో ఇంజిన్​ను దాని బ్యాక్-బోన్ ఫ్రేమ్‌లో అమర్చారు. ఇది దానిలో అమర్చిన 17-లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ నుంచి ఇంధనాన్ని తీసుకుంటుంది. సస్పెన్షన్ కోసం ఈ బైక్ ముందు భాగంలో 41mm టెలిస్కోపిక్ ఫోర్క్ ఉంది. ఇది 130mm ప్రయాణాన్ని అందిస్తుంది. ఇక వెనక భాగంలో 148mm ప్రయాణాన్ని అందించే మోనోషాక్ ఉంది. ఈ బైక్ 180mm గ్రౌండ్ క్లియరెన్స్ కూడా కలిగి ఉంది. ఈ మోటార్ సైకిల్ 19-అంగుళాల ఫ్రంట్, 17-అంగుళాల రియర్ స్పోక్ వీల్ సెటప్‌తో వస్తుంది. ఇది ట్యూబ్ టైర్లతో వస్తుంది.

కవాసకి వెర్సిస్-X 300 ఇతర ఫీచర్లు:

కవాసకి వెర్సిస్-X 300 చాలా బేసిక్ ఫీచర్లను కలిగి ఉంది. ఇది గేర్ పొజిషన్ ఇండికేటర్, డ్యూయల్-ఛానల్ ABSతో కూడిన డిజి-అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంది. కంపెనీ ఈ మోటార్‌సైకిల్‌ను రూ. 3.80 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు విడుదల చేసింది. ఇది KTM 390 అడ్వెంచర్ కంటే రూ. 12,000 ఎక్కువ. KTM దీనితోపాటు మరిన్ని పవర్, అదనపు ఫీచర్లను కూడా అందిస్తుంది. అయితే ఇది దాని ఇంజిన్‌లో అదనపు సిలిండర్‌తో వస్తుంది.

ఇన్ఫినిక్స్​ నుంచి నయా గేమింగ్-ఫోకస్డ్ స్మార్ట్‌ఫోన్- ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

విద్యుత్​​ వాహనదారులకు గుడ్​న్యూస్- త్వరలో 72,000 ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు

రూ.85వేల తగ్గింపుతో విండ్సర్ కొత్త ఈవీ- బ్యాటరీ, రేంజ్ మాత్రం మారలేదుగా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.