MG Windsor Exclusive Pro Launched: ప్రముఖ కార్ల తయారీ సంస్థ JSW MG మోటార్ తన ఎలక్ట్రిక్ వాహన విభాగంలో మరో కొత్త మోడల్‌ను తీసుకొచ్చింది. కంపెనీ ఇటీవలే 'విండ్సర్ EV' ఫస్ట్ అప్డేట్ను అధికారికంగా ప్రారంభించింది. 'MG విండ్సర్ EV ప్రో' పేరుతో దీన్ని తీసుకొచ్చింది. తాజాగా మార్కెట్లో కొత్త 'MG విండ్సర్ ఎక్స్‌క్లూజివ్ ప్రో' ట్రిమ్‌ను విడుదల చేసింది. ఈ వేరియంట్ ఇటీవల ప్రారంభించిన టాప్-స్పెక్ 'విండ్సర్ ఎసెన్స్ ప్రో' మాదిరిగా పెద్ద 52.9kWh బ్యాటరీ ప్యాక్ (449km ARAI రేంజ్) తో వస్తుంది. కానీ కంపెనీ దీని ధరను ఏకంగా రూ. 85,000 తగ్గించి రూ. 17.25 లక్షల (ఎక్స్-షోరూమ్)తో తీసుకొచ్చింది.
స్టాండర్డ్ MG విండ్సర్, ప్రో లైనప్‌లోని ఇతర వేరియంట్‌ల మాదిరిగానే ఇది కూడా బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) ఆప్షన్‌తో లభిస్తుంది. BaaS ఎంపికతో దీని ప్రారంభ ధర రూ. 12.24 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ ప్లాన్ కింద కారును కొనుగోలు చేసిన కస్టమర్లు ప్రతి నెలా కిలోమీటరుకు రూ. 4.5 చొప్పున బ్యాటరీ అద్దె చెల్లించాల్సి ఉంటుంది.

సేల్ వివరాలు: దీని డెలివరీలు జూన్ మొదటి వారంలో ప్రారంభమవుతాయని కంపెనీ వెల్లడించింది. కంపెనీ ఈ కారు బుకింగ్స్‌ను ఇప్పటికే ప్రారంభించింది. దేశ వ్యాప్తంగా ఉన్న MG డీలర్‌షిప్‌లలో రూ. 11,000 అడ్వాన్స్ అమౌంట్‌ను చెల్లించి బుక్ చేసుకోవచ్చు.
MG విండ్సర్ ఎక్స్‌క్లూజివ్ ప్రో స్పెసిఫికేషన్స్ అండ్ రేంజ్: కంపెనీ దీనిలో 52.9 kWh బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించింది. ఇది 449 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్‌ను కలిగి ఉంది. దీని మోటార్ 134 bhp పవర్, 200 Nm టార్క్‌ను అందిస్తుంది. దీని బ్యాటరీని 7 kW ఛార్జర్‌తో 9.5 గంటల్లో 10 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ చేయొచ్చు. 60 KW ఫాస్ట్ ఛార్జర్‌తో అయితే కేవలం 50 నిమిషాల్లో 20 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయొచ్చని కంపెనీ చెబుతోంది.
MG విండ్సర్ ఎక్స్‌క్లూజివ్ ప్రో కలర్ ఆప్షన్స్: ఈ వేరియంట్ మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
పెర్ల్ వైట్
స్టార్రి బ్లాక్
టర్కోయిస్ గ్రీన్

ఈ కారులో 18-అంగుళాల డ్యూయల్-టోన్ మెషిన్డ్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఈ కారును కొనుగోలు చేసిన మొదటి కస్టమర్‌కు కంపెనీ లైఫ్‌టైమ్ బ్యాటరీ వారంటీ, 3-60 అష్యూర్డ్ బైబ్యాక్ ప్లాన్‌ను అందిస్తుంది. ఇది మూడు సంవత్సరాల తర్వాత 60 శాతం వాల్యూ రిటెన్షన్ హామీ ఇస్తుంది.
MG విండ్సర్ ఎక్స్‌క్లూజివ్ ప్రో ఫీచర్లు: విండ్సర్ 'ఎక్స్‌క్లూజివ్ ప్రో'లో డ్యూయల్-టోన్ ఐవరీ, బ్లాక్ ఇంటీరియర్, 135 డిగ్రీల వరకు వంచగల ఏరో లాంజ్ సీట్లు ఉన్నాయి. అత్యంత ప్రత్యేకమైన విషయం ఏంటంటే దీనిలో కనిపించే 15.6-అంగుళాల టచ్ డిస్ప్లే 9-స్పీకర్ల ఆడియో సిస్టమ్‌తో వస్తుంది. MG 'i-SMART' సిస్టమ్ 80కి పైగా కనెక్టెడ్ ఫీచర్లను, 100కి పైగా AI- పవర్డ్ వాయిస్ కమాండ్స్‌ను అందించగలదు. ఇది ప్రతి డ్రైవ్‌ను మరింత స్మార్ట్‌గా, సౌకర్యవంతంగా చేస్తుంది.

వేరియంట్ల వారీగా MG విండ్సర్ ధరలు:
వేరియంట్ | ధర | BaaS ధర |
Excite (38kWh) | రూ. 14 లక్షలు | రూ. 10 లక్షలు + రూ.3.9/km |
Exclusive (38kWh) | రూ. 15.5 లక్షలు | రూ. 10.99 లక్షలు + రూ.3.9/km |
Essence (38kWh) | రూ. 16.5 లక్షలు | రూ. 11.99 లక్షలు + రూ.3.9/km |
Exclusive Pro (52.9kWh) | రూ. 17.25 లక్షలు | రూ. 12.24 లక్షలు + రూ. 4.5/km |
Essence Pro (52.9kWh) | రూ. 18. 10 లక్షలు | రూ. 13.09 లక్షలు + రూ. 4.5/km |
MG విండ్సర్ ఎక్స్‌క్లూజివ్ ప్రో పొజిషన్‌ను 'ఎసెన్స్', 'ఎసెన్స్ ప్రో' వేరియంట్‌ల మధ్య ఉంచారు. మిడ్-లెవల్ 'విండ్సర్ EV ప్రో'లో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) లెవల్ 2 ఫీచర్లు ఉండవని గమనించాలి. ఎందుకంటే టాప్ వెర్షన్ 'అస్సెన్స్ ప్రో'లో మాత్రమే లెవల్ 2 సూట్ అమర్చారు. ఇది 12 ADAS ఫీచర్లతో వస్తుంది.
'ఆల్కాటెల్ V3 5G' సిరీస్‌లో మరో రెండు మోడల్స్- లాంఛ్‌కు ముందే కీలక స్పెక్స్ రివీల్!
గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్రం 'హై-రిస్క్' అలర్ట్- వెంటనే ఈ పని చేయకపోతే ఇక అంతే!
మీకు ఫొటోలు తీసే అలవాటుందా?- ఈ కారు జోలికి మాత్రం పోవద్దు- మీ ఫోన్ కెమెరా ఖతం!