iPhone 17 Air Dummy Leak: టెక్ దిగ్గజం యాపిల్ ప్రతి సంవత్సరం తన కొత్త ఐఫోన్ సిరీస్‌ను విడుదల చేస్తుంది. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా తన 'ఐఫోన్ 17 సిరీస్'ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. గత కొన్నేళ్లుగా రిలీజ్ చేస్తున్నట్లుగానే దీన్ని కూడా సెప్టెంబర్ నెలలో విడుదల చేయొచ్చు. ఈ సిరీస్‌లో 'ఐఫోన్ 17', 'ఐఫోన్ 17 ప్రో', 'ఐఫోన్ 17 ప్రో మాక్స్' మోడళ్లతో పాటు కొత్త మోడల్‌ను కూడా లాంఛ్ చేసే అవకాశం ఉంది. దీన్ని 'ఐఫోన్ 17 ఎయిర్' లేదా 'ఐఫోన్ 17 స్లిమ్' అనే పేరుతో తీసుకురావచ్చు.
ఈ కొత్త ఐఫోన్ మోడల్‌ను 'ఐఫోన్ 16 ప్లస్' స్థానంలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ అప్‌కమింగ్ ఐఫోన్ మోడల్ హ్యాండ్-ఆన్ వీడియో లీక్ అయింది. ఇది ఐఫోన్ 17 ఎయిర్ మోడల్‌దే కావచ్చు. దీనిలో ఫోన్ డమ్మీ యూనిట్ కన్పిస్తుంది. ఈ హ్యాండ్-ఆన్ వీడియో ఈ అప్‌కమింగ్ ఫోన్ డిజైన్‌ను రివీల్ చేసింది. ఇది యాపిల్ లైనప్‌లో అత్యంత సన్నని ఐఫోన్ అవుతుందని సమాచారం.
ఐఫోన్ 17 సిరీస్ పాసిబుల్ డమ్మీ యూనిట్ల వీడియో అన్‌బాక్స్ థెరపీ అనే యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ అయింది. ఈ ఛానెల్‌ను లూయిస్ హిల్సెంటెగర్ నిర్వహిస్తున్నారు. ఈ డమ్మీ యూనిట్ మూలం చైనాలో ఉందని, అది కొంతమంది కేస్ (ఫోన్ కవర్) తయారీదారుల ద్వారా లీక్ అయినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో లూయిస్ మొదట 'ఐఫోన్ 17 ప్రో మాక్స్'ను చెక్ చేసి చూపించారు. ఇది 163.0×77.59×8.75mm కొలతలతో ఉంది.
యాపిల్ నుంచి అత్యంత సన్నని ఐఫోన్: దీనితో పాటు 'ఐఫోన్ 17 ఎయిర్' గురించి మాట్లాడుకుంటే లీకైన వీడియో ప్రకారం.. ఇది యాపిల్ అత్యంత సన్నని ఐఫోన్ కావచ్చు. దీని మందం 5.65mm మాత్రమే ఉంటుంది. దీని కారణంగా ఇది అత్యంత సన్నని ఐఫోన్ కూడా కావచ్చు. ఇకపోతే 'ఐఫోన్ 17 ప్రో మాక్స్' డమ్మీ 8.75mm మందం కలిగి ఉంది. అంటే దీన్ని బట్టి చూస్తే 'ఐఫోన్ 17 ఎయిర్' అత్యంత సన్నగా అల్ట్రా-స్లిమ్ డిజైన్‌లో వస్తుంది. ఈ కారణంగా ఈ ఐఫోన్‌ను 'ఐఫోన్ 17 స్లిమ్' పేరుతో కూడా తీసుకురావచ్చు. ఈ వీడియోలో 'ఐఫోన్ 17' డమ్మీ కూడా కనిపించింది. ఇది 149.6×271.46×7.96mm కొలతలు కలిగి ఉంది.
ఐఫోన్ 17 ఎయిర్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు: యాపిల్ ఈ అప్‌కమింగ్ 'ఐఫోన్ 17 ఎయిర్'పై గత కొన్ని నెలలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ ఐఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లపై చాలా నివేదికలు కూడా వెలువడ్డాయి. లీకైన నివేదికల ప్రకారం కంపెనీ ఈ ఐఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేటుతో 6.6-అంగుళాల OLED స్క్రీన్‌ను అందించొచ్చు. ఈ ఫోన్ వెనక భాగంలో ఒకే ఒక కెమెరా ఉండొచ్చు. ఇది 48MP సెన్సార్‌తో రావచ్చు. వీటితోపాటు కంపెనీ దీనిలో సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 24MP ఫ్రంట్ కెమెరాను అందించొచ్చు.
యాపిల్ ఈ 'ఐఫోన్ 17 ఎయిర్' మోడల్‌కు టైటానియం ఫ్రేమ్ డిజైన్‌ను ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్‌లో ప్రాసెసర్ కోసం A18 లేదా A19 చిప్‌ను అమర్చొచ్చు. ఇది 8GB RAM సపోర్ట్‌తో రావచ్చు. ఇక ధర గురించి మాట్లాకుంటే ఈ ఫోన్ ధర $1,299 నుంచి $1,599 మధ్య ఉండవచ్చు. అంటే దాదాపు రూ.1,09,000 నుంచి రూ.1,26,000 వరకు ఉంటుందని అంచనా.
కిర్రాక్ AI ఫీచర్లతో ఇన్‌స్టాలో 'ఎడిట్స్' యాప్- హై క్వాలిటీ వీడియోలను ఈజీగా క్రియేట్ చేసుకోండిలా!
మంచి కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా?- రూ.10లక్షల లోపు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో బెస్ట్ ఇవే!
మార్స్‌పై జీవం ఉందా?- పుర్రె ఆకారంలో మిస్టీరియస్ నిర్మాణాన్ని గుర్తించిన నాసా రోవర్