ETV Bharat / technology

ఇన్​స్టా యూజర్లకు గుడ్​న్యూస్- ఇకపై మీ ప్రియమైన వారితో కలిసి ఒకే రకమైన రీల్స్ చూడొచ్చు! - INSTAGRAM BLEND FEATURE

ఇన్​స్టాగ్రామ్​లో 'బ్లెండ్' ఫీచర్- ఉపయోగించడం ఎలాగంటే..?

Instagram Launches Blend Feature
Instagram Launches Blend Feature (Photo Credit- Instagram)
author img

By ETV Bharat Tech Team

Published : April 19, 2025 at 12:06 PM IST

3 Min Read

Instagram Blend Feature: ఇన్​స్టాగ్రామ్ యూజర్లకు గుడ్​న్యూస్. వినూత్న ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకనే ఈ యాప్ తాజాగా 'ఇన్‌స్టాగ్రామ్ బ్లెండ్' అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు మనం ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను వ్యక్తిగతంగానే ఆస్వాదించేవాళ్లం. కానీ ఇప్పుడు మనకు ఇష్టమైన ఫ్రెండ్ లేదా గ్రూప్​తో కలిసి ఒకే రకమైన రీల్స్‌ను చూసే అవకాశం ఉంటుంది. అదే 'బ్లెండ్' మ్యాజిక్ మరి. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి.

సోషల్ మీడియా అంటే ఆలోచనలు, అభిరుచులు, ఆసక్తులు ఇవన్నీ ఒకే వేదికపై పంచుకోవడం. అయితే ఇన్‌స్టాగ్రామ్‌ ఈ మజాను ఇంకొంచెం కొత్తగా, గమ్మత్తుగా అందించేందుకు రెడీ అయింది. ఈ ఫీచర్​ ద్వారా మీరు మీ ఫ్రెండ్​ లేదా గ్రూప్​ చాట్​కు ప్రత్యేకంగా షేర్ చేసుకునే రీల్స్​ ఫీడ్​ను అందిస్తుంది. వినియోగదారులు ఇప్పుడు తమ ఫ్రెండ్స్​తో ప్రైవేట్, కస్టమైజ్డ్ రీల్స్​ ఫీడ్​ను షేర్ చేసుకోవచ్చు. ఇది కేవలం ఒక టెక్నికల్ అప్డేట్ మాత్రమే కాకుండా స్నేహితుల మధ్య సంబంధాలను మరింత బలపరచే సరికొత్త ప్రయోగం.

అసలేంటీ బ్లెండ్ ఫీచర్?: ఈ బ్లెండ్ ఫీచర్​ ఇన్​స్టాగ్రామ్ డైరెక్ట్ మెసెజ్​ల (DMs) మాదిరిగానే ప్రైవేట్ అని కంపెనీ చెబుతోంది. ఇది మీకు నచ్చిన స్నేహితుడు లేదా ఫ్రెండ్స్‌ గ్రూప్‌తో కలిసి ఉపయోగించుకోగల ఫీచర్. దీని ద్వారా మీరు చూస్తున్న రీల్స్, మీ ఫ్రెండ్‌లు చూస్తున్న రీల్స్ అన్నీ కలిసిపోయి ఒక 'షేర్డ్ కస్టమ్ రీల్స్ ఫీడ్'గా తయారవుతుంది. అంటే మీ ఫ్రెండ్ ఇన్‌స్టాగ్రామ్ యాక్టివిటీ ఆధారంగా రీల్స్ లిస్టు రెడీ అవుతుందన్నమాట.

ఈ ఫీచర్ ప్రత్యేకత ఏంటంటే.. ఇన్‌స్టాగ్రామ్ బ్లెండ్ గ్రూప్​లోని వారి అభిరుచుల ఆధారంగా రీల్స్‌ను అమర్చి చూపిస్తుంది. రోజు రోజుకు అది అప్డేట్ అవుతుంది. దీంతో మీరు బ్లెండ్‌ను ఓపెన్ చేసిన ప్రతిసారీ కొత్త కొత్త రీల్స్ చూడొచ్చు. ఇది ఒక రకంగా మీ స్నేహితుల ఇష్టాలను ప్రతిబింబించేలా ఉంటుంది. ఆ ఫీడ్‌ను మీరు అందరూ కలిసి ఆస్వాదించొచ్చు. అంతేకాకుండా మీరు చూడకుండా మిస్ అయిన ఆసక్తికర రీల్స్ కూడా ఇందులో కన్పిస్తాయి.

ఈ ఫీచర్​ను ఉపయోగించడం ఎలా?:

  • ఇందుకోసం ముందుగా మీ ఇన్‌స్టాగ్రామ్‌లోని ఒక DM చాట్‌ను ఓపెన్ చేయండి. ఇది వన్-ఆన్-వన్ లేదా గ్రూప్ చాట్ అయినా పర్లేదు.
  • ఇప్పుడు పైన ఉన్న 'బ్లెండ్' ఐకాన్​పై క్లిక్ చేయండి.
  • తర్వాత ఇన్వైట్ అనే ఆప్షన్ ద్వారా మీ ఫ్రెండ్స్​కు ఇన్విటేషన్​ పంపించండి.
  • ఒకసారి వారు మీ ఇన్విటేషన్​ను అంగీకరిస్తే బ్లెండ్ షేర్డ్ ఫీడ్ యాక్టివ్ అవుతుంది.
  • ఇద్దరు యూజర్లూ బ్లెండ్​లో జాయిన్ అయిన వెంటనే DM ద్వారా షేర్​ చేసిన ఏదైనా రీల్ బ్లెండ్​ ఫీడ్​లో ఆటోమేటిక్​గా అప్డేట్ అవుతుంది.
  • అంతే ఇక ఆ చాట్‌లో ఉన్నవారంతా ఆ బ్లెండ్ రీల్స్ ఫీడ్‌ను ఎప్పుడైనా తిరిగి చూసుకోవచ్చు.

బ్లెండ్‌లోని ప్రతి రీల్‌తో పాటు అది ఎవరికి కనిపించాలో వారి పేరు కూడా ఉంటుంది. వినియోగదారులు రీల్స్ చూస్తున్నప్పుడు దిగువన ఉన్న మెసేజ్ బార్ నుంచి చాట్ చేయొచ్చు లేదా ఎమోజీలతో నేరుగా రెస్పాండ్ అవ్వొచ్చు.

అందుబాటులోకి ఎప్పుడు?: మెటా ఇన్​స్టాగ్రామ్​లో ఈ ఫీచర్​ను గురువారం నుంచి విడుదల చేయడం ప్రారంభించింది. కంపెనీ దీన్ని గ్లోబల్‌గా అందుబాటులోకి తెచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు దీన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం వన్-ఆన్-వన్ లేదా గ్రూప్ DMsలో ఉపయోగించొచ్చు. ప్రతి బ్లెండ్ చాట్ ఒక్కొక్కటిగా ప్రత్యేకంగా క్రియేట్ అవుతుంది.

హైవేలపై టోల్​ ప్లాజాలు తొలగింపు- కొత్త విధానంతో మీ డబ్బు, సమయం రెండూ ఆదా!

సువాసనలు వెదజల్లే స్మార్ట్​ఫోన్ ఎప్పుడైనా చూశారా?- అయితే దీని గురించి తెలుసుకోవాల్సిందే!

కారు ఓనర్లూ జాగ్రత్త- E30 పెట్రోల్‌ దిశగా ప్రభుత్వం చర్యలు!- ఇక రిపేర్ బిల్లులతో మీ జేబులకు చిల్లులే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.