ETV Bharat / technology

సువాసనలు వెదజల్లే స్మార్ట్​ఫోన్ ఎప్పుడైనా చూశారా?- అయితే దీని గురించి తెలుసుకోవాల్సిందే! - INFINIX NOTE 50S 5G PLUS LAUNCHED

సరికొత్త టెక్నాలజీతో 'ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G+' ఫోన్- కేవలం రూ. 14,999!

Infinix Note 50s 5G+ Launched in India
Infinix Note 50s 5G+ Launched in India (Photo Credit- Infinix)
author img

By ETV Bharat Tech Team

Published : April 18, 2025 at 3:51 PM IST

3 Min Read

Infinix Note 50s 5G+ Launched in India: దేశీయ మార్కెట్​లోకి ఇన్ఫినిక్స్ నుంచి కొత్త స్మార్ట్​ఫోన్​ ఎంట్రీ ఇచ్చింది. 'ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G+' పేరుతో కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్​ను శుక్రవారం లాంఛ్ అయింది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 Ultimate చిప్‌సెట్, 64-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరాలు, 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,500mAh బ్యాటరీ ఉన్నాయి.

ఈ ఫోన్ దేశంలోనే అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్ అని కంపెనీ చెబుతోంది. ఇందులో 144Hz కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే ఉంది. దీనిలో మరో స్పెషాలిటీ ఏంటంటే కంపెనీ ఈ ఫోన్​లో 'ఎనర్జైజింగ్ సెంట్ టెక్నాలజీ'ని ఉపయోగించింది. దీంతో ఫోన్ మంచి సువాసనను వెదజల్లుతుందని ఇన్ఫినిక్స్ పేర్కొంది. మరెందుకు ఆలస్యం ఈ ఫోన్ ధర, ఫీచర్లపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.

'ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G+' ఫీచర్లు:

డిస్​ప్లే: ఇందులో 6.78-అంగుళాల పూర్తి-HD+ 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 2,304Hz PWM డిమ్మింగ్ రేట్, 10-బిట్ కలర్ డెప్త్, 100 శాతం DCI-P3 కలర్ గామట్ కవరేజ్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్​తో వస్తుంది.

ప్రాసెసర్: ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 Ultimate SoC ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 8GB RAM, 256GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్​ను అందిస్తుంది.

ఆపరేటింగ్ సిస్టమ్: ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 బేస్ట్ XOS 15పై నడుస్తుంది.గేమింగ్ సమయంలో ఇది 90fps వరకు ఫ్రేమ్ రేట్లకు సపోర్ట్ చేస్తుందని కంపెనీ చెబుతోంది.

కెమెరా సెటప్: ఈ ఫోన్ 64-మెగాపిక్సెల్ సోనీ IMX682 ప్రైమరీ రియర్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఇది 30fps వద్ద 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్​ చేస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ ముందుభాగంలో 13-మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. ఇది డ్యూయల్ వీడియో క్యాప్చర్, ఫోలాక్స్ AI అసిస్టెంట్, AI వాల్‌పేపర్ జనరేటర్, AIGC మోడ్, AI ఎరేజర్ వంటి AI ఫీచర్లను కలిగి ఉంది.

బ్యాటరీ: ఇందులో 5,500mAh బ్యాటరీ ఉంది. ఇది 45W వైర్డు ఆల్-రౌండ్ ఫాస్ట్‌చార్జ్ 3.0కి సపోర్ట్ చేస్తుంది. ఈ బ్యాటరీని గంటలో 1 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని ఇన్ఫినిక్స్ పేర్కొంది.

ప్రొటెక్షన్: ఈ ఫోన్ IP64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ రేటింగ్, MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం ఇందులో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.

వేరియంట్స్: కంపెనీ ఈ 'ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G+' ఫోన్​ను రెండు వేరియంట్లలో తీసుకొచ్చింది.

  • 8GB + 128GB
  • 8GB + 256GB

వేరియంట్ల వారీగా 'ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G+' ధరలు:

  • 8GB + 128GB వేరియంట్ ధర: రూ. 15,999
  • 8GB + 256GB వేరియంట్ ధర: రూ. 17,999

సేల్ వివరాలు: ఈ ఫోన్ ఏప్రిల్ 24 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. లాంఛ్ ఆఫర్స్​తో ఈ ఫోన్​ను రూ. 14,999 ధరకే పొందొచ్చు.

కలర్ ఆప్షన్స్:

  • మెరైన్ డ్రిఫ్ట్ బ్లూ
  • రూబీ రెడ్
  • టైటానియం గ్రే

స్మార్ట్​ఫోన్​ నుంచి ఫ్రాగ్రెన్స్​: దీని రూబీ రెడ్, టైటానియం గ్రే వేరియంట్లు మెటాలిక్ ఫినిషింగ్ కలిగి ఉన్నాయి. అయితే మెరైన్ డ్రిఫ్ట్ బ్లూ ఆప్షన్‌లో వీగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్ ఉంది. ఇందులో మైక్రోఎన్‌క్యాప్సులేషన్ టెక్నాలజీ ఉంటుంది. ఇది వీగన్ లెదర్ ప్యానెల్‌కు మెరైన్ అండ్ లెమన్, లిల్లీ ఆఫ్ ది వ్యాలీ నోట్స్, అంబర్ అండ్ వెటివర్ బేస్ నోట్స్‌తో కూడిన ఫ్రాగ్రెన్స్​ను ఇస్తుంది. దీన్ని కంపెనీ 'ఎనర్జైజింగ్ సెంట్ టెక్నాలజీ'గా పిలుస్తోంది. అంటే మెరైన్ డ్రిఫ్ట్ బ్లూ ఆప్షన్​లోని ఈ ఫోన్​ నుంచి సువాసనలు వెదజల్లుతాయిని ఇన్ఫినిక్స్ చెబుతోంది. అయితే స్మార్ట్​ఫోన్​ నుంచి ఈ సువాసన ఎంతకాలంపాటు వస్తుందో వెల్లడించలేదు.

కిర్రాక్ అప్డేట్​లతో 'TVS అపాచీ RR310'!- ఇప్పుడు దీని ధర ఎంతంటే?

కారు ఓనర్లూ జాగ్రత్త- E30 పెట్రోల్‌ దిశగా ప్రభుత్వం చర్యలు!- ఇక రిపేర్ బిల్లులతో మీ జేబులకు చిల్లులే!

లగ్జరీ ఫీచర్లు, అద్దిరిపోయే డిజైన్​లో స్కోడా కోడియాక్‌- కొత్తగా కారు కొనేవారు దీన్ని ట్రై చేయండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.