Hyundai i20 New Variant Launched: హ్యుందాయ్ మోటార్ తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ 'హ్యుందాయ్ i20'లో కొత్త మాగ్నా ఎగ్జిక్యూటివ్ వేరియంట్‌ను విడుదల చేసింది. కంపెనీ ఈ వేరియంట్‌ను రూ. 7.50 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో తీసుకొచ్చింది. సరసమైన ధరలోనే ఫీచర్-రిచ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించే ఈ మోడల్ కస్టమర్లను ఆకర్షించే దిశగా కంపెనీ వ్యూహంలో ఒక భాగం. దీంతోపాటు ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో ఎక్కువ మంది కొనుగోలుదారులను ఆకర్షించడమే కంపెనీ స్ట్రాటజీ లక్ష్యం.
హ్యుందాయ్ i20 మాగ్నా ఎగ్జిక్యూటివ్ సేఫ్టీ ఫీచర్లు: ఇందులో 6 ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ (VSM) వంటి కీలకమైన భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఇవి సాధారణంగా అధిక ట్రిమ్‌ల కోసం ప్రత్యేకించినవి. అయితే హ్యుందాయ్ ఈ అధునాతన భద్రతా సాంకేతికతలను ఈ సరసమైన మోడల్లో అందిస్తోంది.

హ్యుందాయ్ i20 మాగ్నా ఎగ్జిక్యూటివ్ ఫీచర్లు: మరో అప్డేట్గా హ్యుందాయ్ మోటార్ తన ఫేమస్ ఇంటెలిజెంట్ వేరియబుల్ ట్రాన్స్‌మిషన్ (iVT), ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌ను మాగ్నా ట్రిమ్‌లో ప్రవేశపెట్టింది. ఇది దాని ఫీచర్లతో పాటు ఓవరాల్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరుస్తుంది. ఇది ఇప్పుడు పుష్-బటన్ స్టార్ట్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ప్రీమియం 7-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇది గతంలో హైయర్ వేరియంట్లకు మాత్రమే పరిమితమై ఉండేది.

హ్యుందాయ్ i20 మాగ్నా ఎగ్జిక్యూటివ్ పవర్‌ట్రెయిన్: ఈ హ్యుందాయ్ i20 వేరియంట్లో ఒకే ఒక ఇంజిన్ ఆప్షన్ ఉంటుంది. ఇది 1.2-లీటర్, 4-సిలిండర్, నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్. ఈ ఇంజిన్ మాన్యువల్ గేర్‌బాక్స్‌పై 82bhp పవర్, iVT గేర్‌బాక్స్‌పై 87bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అయితే రెండింటిలోనూ టార్క్ అవుట్‌పుట్ 114.7Nm వద్ద అలాగే ఉంటుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్, iVT గేర్‌బాక్స్‌తో వస్తుంది.

హ్యుందాయ్ i20 మాగ్నా ఎగ్జిక్యూటివ్ ఇతర ఫీచర్లు: ధరలో స్వల్ప పెరుగుదలతో కంపెనీ ఇందులో 25.55 సెం.మీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కూడా అందిస్తోంది. అదనంగా రూ. 14,999 ధరతో ఈ సిస్టమ్ వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోలకు సపోర్ట్ చేస్తుంది. ఇది వెనక కెమెరాను కూడా కలిగి ఉంటుంది. ఈ వ్యవస్థ 3 సంవత్సరాల వారంటీతో వస్తుంది. ఈ లేటెస్ట్ అప్డేట్స్తో హ్యుందాయ్ వివిధ వేరియంట్లలో మెరుగైన ఫీచర్లతో పాటు మరింత సెక్యూరిటీని అందించడం ద్వారా i20 ఆకర్షణను విస్తృతం చేయాలని భావిస్తోంది.
వన్‌ప్లస్ నుంచి ఫ్లాగ్షిప్ రేంజ్ స్మార్ట్‌ఫోన్- లాంఛ్‌కు ముందే కీలక స్పెక్స్ రివీల్!
'ఓలా S1 ప్రో' vs 'ఏథర్ 450X'- ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటీలలో ఏది బెస్ట్?
సూపర్ ఫీచర్లతో 'ఇన్ఫినిక్స్ GT 30 ప్రో'- దీనిలో గేమ్ ఆడితే ఆ మజానే వేరు!