ETV Bharat / technology

మనిషిలా ఆలోచించే 'మివి AI'- మీ క్లోజ్ ఫ్రెండ్​లా ముచ్చట పెట్టుకోవచ్చు! - HUMAN LIKE MIVI AI

మనిషి ఆలోచనలు, సంభాషణలు కూడా- సరికొత్త ఏఐతో హైదరాబాద్ స్టార్టప్ సంచలనం!

Hyderabad Startup Develops First Human Like AI
Hyderabad Startup Develops First Human Like AI (Photo Credit- MIVI AI)
author img

By ETV Bharat Tech Team

Published : April 12, 2025 at 11:10 AM IST

3 Min Read

Human Like MIVI AI: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో విప్లవాత్మక మార్పులు సంభవిస్తున్నాయి. కృత్రిమ మేధ కొత్త పుంతలు తొక్కుతూ రోజువారీ జీవితాన్ని మరింత సులభతరం చేస్తోంది. ఇప్పటి వరకూ మనం ప్రశ్నలు టైప్ చేస్తే దానికి సమాధానాలు అక్షర రూపంలో వస్తోందే చూశాం. అయితే తాజాగా హైదరాబాద్​కు చెందిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ స్టార్టప్ కంపెనీ 'మివి' అభివృద్ధి చేసిన ఏఐ ఆధారిత వాయిస్ టూల్ సంచలనం సృష్టిస్తోంది.

ఈ ఏఐ టెక్నాలజీ మానవుల్లా ఆలోచించి, సంభాషించగల సామర్థ్యం ప్రదర్శిస్తోంది. సంక్లిష్ట ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంతో పాటు, సందర్భాన్ని అర్థం చేసుకుని సహజంగా స్పందిస్తోంది. దీన్ని 'మివి ఏఐ' పేరుతో అభివృద్ధి చేసినట్లు కంపెనీ కో-ఫౌండర్, CEO మిధులా దేవభక్తుని శుక్రవారం వెల్లడించారు.

గతంలో ఏఐ పరిమితమైన స్క్రిప్ట్‌లపై ఆధారపడగా, ఇప్పుడు విస్తృత డేటాతో శిక్షణ పొందిన ఈ వ్యవస్థ లాజికల్​గా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుంది. భాషలోని సూక్ష్మ భావాలను గుర్తించడం, మానవ సంభాషణలను అనుకరించడం ద్వారా ఈ టూల్ సాంకేతిక పరిమితులను అధిగమిస్తోంది. ఈ నేపథ్యంలో ఏఐ పరిశోధన, అభివృద్ధిలో ఇదొక కీలక అడుగని దేవభక్తుని వివరించారు. అధునాతన LLM (లాంగ్‌ లాంగ్వేజ్‌ మోడల్‌)తో దీన్ని ఆవిష్కరించినట్లు పేర్కొన్నారు.

"మివి ఏఐలో ఉపయోగించిన NLP (నాచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌) మానవుల భావోద్వేగాలను అర్థం చేసుకుంటుంది. సందర్భాన్ని బట్టి మన సంభాషణలను అనుకరిస్తుంది. వినియోగదారుల మాటలను అర్థం చేసుకుని, దానికి తగినట్లుగా సమాధానాలు ఇస్తుంది. ఎన్నో రకాల మాండలికాలతో దీన్ని తయారు చేశాం. ప్రత్యేకంగా 'హాయ్‌ మివి' అనే వేక్‌ వర్డ్‌ను రూపొందించాం. ప్రపంచంలో కొన్ని ప్రముఖ సంస్థలే వేక్‌ వర్డ్‌ను తీసుకొచ్చాయి." - మిధులా దేవభక్తుని, మివి సంస్థ కో-ఫౌండర్, CEO

'మివి ఏఐ' ద్వారా వినియోగదారులకు పర్సనలైజ్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పీరియన్స్​ను అందించే లక్ష్యంతో ఉన్నట్లు ఆమె తెలిపారు. భవిష్యత్తులో స్మార్ట్‌ హోమ్‌ డివైజ్​లు, కస్టమర్ సర్వీస్ సెంటర్​లు, ఇతర ఏఐ ఆధారిత ఉత్పత్తులలో దీన్ని వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. కంపెనీ ఇప్పటికే ఈ టూల్‌ ఆధారంగా ఏఐ ఇయర్‌ బడ్స్‌ను అభివృద్ధి చేసింది. ఈ ఏడాది జూన్‌లో ఈ బడ్స్‌ మార్కెట్లోకి విడుదల కానున్నాయి. వీటి ధర కూడా అందరికీ అందుబాటులో ఉండేలా రూ.10,000 కంటే తక్కువగానే నిర్ణయించనున్నట్లు ఆమె వెల్లడించారు.

మివి ఏఐ బడ్స్ ప్రత్యేకతలు: ఈ మివి ఏఐ బడ్స్‌ను చెవిలో పెట్టుకుని తోటి మనిషితో మాట్లాడినట్లే మాట్లాడి మన ప్రశ్నలు, సందేహాలు అన్నిటికీ సమాధానాలు రాబట్టుకోవచ్చు. అంతేకాకుండా ఇది మనకు బాగా సన్నిహితులైన వ్యక్తులతో మాట్లాడుతున్న అనుభూతిని కలిగిస్తుంది. ఏ డిష్ ప్రిపేర్ చేయాలనే విషయం నుంచి తాజా వార్తల వరకు చక్కటి స్వరంతో అప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయడం ఈ మిని ఏఐ టూల్‌ ప్రత్యేకత.

తొలుత ఇంగ్లీషులో మాత్రమే ఈ ఏఐ బడ్స్‌ లభిస్తాయి. త్వరలో దీన్ని అన్ని భారతీయ భాషలకు విస్తరించనున్నారు. ముందు మివి వెబ్‌సైట్‌ ద్వారా, తర్వాత మిగతా ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా ఈ బడ్స్‌ విక్రయించేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచంలో ఇదే తొలి వాయిస్‌ ఆధారిత ఏఐ ప్రొడక్ట్ అని 'మివి' చెబుతోంది. భవిష్యత్తులో మరిన్ని ఏఐ ఆధారిత ఉత్పత్తులలో దీన్ని వినియోగించనున్నట్లు పేర్కొంది.

యువతకు పిచ్చెక్కించే హయబుసా ఇప్పుడు సరికొత్తగా!- దీనిలో ఏం ఫీచర్లు ఉన్నాయంటే?

70km మైలేజ్, OBD-2B అప్డేట్​తో హీరో పాషన్ ప్లస్ బైక్- ఇప్పుడు దీని రేటెంతో తెలుసా?

సిట్రోయెన్ డార్క్ ఎడిషన్ సిరీస్ వచ్చేశాయోచ్​​- సూపర్​ స్టైలిష్​ లుక్​లో అదుర్స్!- మీరూ ఓ లుక్కేయండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.