ETV Bharat / technology

ఈ నాలుగేళ్లలో మీరు బైక్ కొన్నారా?- అయితే ఆ మోడల్స్​ పార్టులు ఉచితంగా మార్పు! - Free Bikes Replacement Parts - FREE BIKES REPLACEMENT PARTS

Free Bikes Replacement Parts: ఈ నాలుగేళ్లలో మీరు బైక్స్ కొన్నారా? అయితే ఆ ప్రత్యేక మోడల్స్ బైకులకు ఉచితంగా పార్టులు మార్చేందుకు ఓ ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ రీకాల్ చేపట్టింది. అయితే ఈ జాబితాలో ఏ మోడల్స్ ఉన్నాయి? ఇంతకీ రీప్లేస్‌మెంట్‌ ప్రక్రియ ఎందుకు? వంటి వివరాలు మీకోసం.

Free_Bikes_Replacement_Parts
Free_Bikes_Replacement_Parts (honda)
author img

By ETV Bharat Tech Team

Published : Sep 19, 2024, 10:47 AM IST

Updated : Sep 19, 2024, 11:06 AM IST

Free Bikes Replacement Parts: ప్రస్తుతం బైక్స్​కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బైక్​పై రయ్​ రయ్​ మంటూ దూసుకుపోవడమంటే యువతకు భలే సరదా. బైకుల సేల్స్ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అన్ని బైక్స్ కంపెనీలు ఎప్పటికప్పుడు మార్కెట్లో కొత్త మోడల్స్​ను లాంచ్ చేస్తున్నాయి. అయితే ఈ నాలుగేళ్లలో కొన్న ఆ ప్రత్యేక మోడల్స్ బైకులకు ఉచితంగా పార్టులు మార్చేందుకు ఓ ప్రముఖ మోటార్‌ సైకిళ్ల తయారీ సంస్థ రీకాల్‌ చేపట్టింది. ఈ సందర్భంగా ఈ రీకాల్ ప్రక్రియ ఎందుకు? ఈ జాబితాలో ఉన్న మోడల్స్ ఏంటి? వంటి వివరాలు తెలుసుకుందాం రండి.

Honda Recall: హోండా మోటార్​సైకిల్‌ అండ్ స్కూటర్‌ ఇండియా (HMSI) ఈ రీకాల్​ చేపట్టింది. వీల్ స్పీడ్‌ సెన్సర్‌, క్యామ్‌షాఫ్ట్‌లో లోపాల కారణంగా ఈ రీకాల్‌ చేపడుతున్నట్లు కంపెనీ తెలిపింది.

ఈ జాబితాలో ఉన్న మోడల్స్ ఇవే!:

  • కంపెనీ రీకాల్ చేపట్టిన జాబితాలో సీబీ300ఎఫ్‌, సీబీ 300ఆర్‌, సీబీ 359, హెచ్‌నెస్‌ 350, సీబీ 350ఆర్‌ఎస్‌ మోడల్స్ ఉన్నాయి.
  • 2020 అక్టోబర్‌ నుంచి 2024 ఏప్రిల్‌ మధ్య తయారైన ఈ మోడల్ బైక్స్ ఇందులో ఉన్నాయి.

ఈ రీప్లేస్‌మెంట్‌ ప్రక్రియ ఎందుకు?

  • మోల్డింగ్‌ విధానంలో మిస్టేక్స్ వల్ల స్పీడ్ సెన్సర్‌లోకి నీరు చొరబడే అవకాశం ఉందని, దీనివల్ల స్పీడ్ సెన్సర్‌తో పాటు ట్రాక్షన్‌ కంట్రోల్‌ లేదా ఏబీఎస్‌ కూడా పనిచేయకపోవచ్చని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
  • కొన్ని సందర్భాల్లో బ్రేకింగ్‌లోనూ లోపాలు తలత్తొచ్చని తెలిపింది.
  • 2020 అక్టోబర్‌ నుంచి 2024 ఏప్రిల్‌ మధ్య తయారైన యూనిట్లలో ఈ సమస్య ఉత్పత్తన్నమయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
  • వీటితోపాటు 2024 జూన్‌, జులై మధ్య తయారైన సీబీ350, హెచ్‌నెస్‌ సీబీ 350, సీబీ 350ఆర్‌ఎస్‌ మోడళ్లలో క్యామ్‌షాఫ్ట్‌లో పనితీరులోనూ లోపం ఉన్నట్లు గుర్తించామని కంపెనీ తెలిపింది.
  • ముందు జాగ్రత్త చర్యగా సంబంధిత పార్టులను ఉచితంగా రీప్లేస్‌ చేస్తున్నామని పేర్కొంది.
  • వారెంటీతో సంబంధం లేకుండా కంపెనీకి చెందిన అన్ని బిగ్‌వీల్‌ డీలర్‌షిప్‌ కేంద్రాల్లో ఈ రీప్లేస్‌మెంట్‌ ప్రక్రియ చేపట్టనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

స్టన్నింగ్ లుక్స్​తో మార్కెట్లోకి రెండు కొత్త బైకులు- ధర ఎంతో తెలుసా? - Bajaj Auto Launches Two New Bikes

స్పోర్టీ లుక్​తో 'జావా 42 ఎఫ్‌జె' లాంచ్- ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే? - Jawa Yezdi 42 FJ350 Launched

Last Updated : Sep 19, 2024, 11:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.