ETV Bharat / technology

హీరో 'సూపర్ స్ప్లెండర్ Xtec', 'గ్లామర్' బైక్స్ అప్డేట్- ఇప్పుడు వీటి రేటెంతో తెలుసా? - HERO MOTORCYCLES UPDATED FOR 2025

OBD-2B ఉద్గార నిబంధనలకు అనుగుణంగా హీరో మోటార్​సైకిల్స్- కొత్త ఫీచర్ల వివరాలివే!

Hero Super Splendor Xtec
Hero Super Splendor Xtec (Photo Credit- Hero Motocorp)
author img

By ETV Bharat Tech Team

Published : April 15, 2025 at 3:11 PM IST

2 Min Read

Hero Motorcycles Updated for 2025: దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన హీరో సూపర్ స్ప్లెండర్ Xtec, గ్లామర్ అనే రెండు మోటార్ సైకిళ్లను అప్డేట్ చేసింది. వీటిని OBD-2B ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా అప్డేట్ చేసి తీసుకొచ్చింది. కంపెనీ సూపర్ స్ప్లెండర్‌ను రూ. 88,128 ధరకు, హీరో గ్లామర్‌ను రూ. 86,698 (ఎక్స్-షోరూమ్) ధరకు విడుదల చేసింది.

హీరో సూపర్ స్ప్లెండర్ Xtec ఫీచర్లు: హీరో మోటోకార్ప్ తన పోర్ట్‌ఫోలియోలోని వాహనాలను OBD-2B నిబంధనలకు అనుగుణంగా నవీకరిస్తోంది. కంపెనీ ఇటీవలే తన ప్యాషన్ ప్లస్, స్ప్లెండర్ ప్లస్‌ మోడల్ బైక్స్​ను అప్డేట్ చేసిన తర్వాత ఇప్పుడు సూపర్ స్ప్లెండర్ Xtec మోటార్​సైకిల్​ను అప్డేట్ చేసింది. ఇతర బైక్‌ల మాదిరిగానే ఈ అప్డేట్ ఉద్గార నిబంధనలకే పరిమితం అయి ఉంటుంది. అంటే దీనిలో కూడా మార్పులు చాలా తక్కువగా ఉంటాయి.

హీరో సూపర్ స్ప్లెండర్ Xtec పవర్‌ట్రెయిన్: దీని ఇంజిన్ ఇప్పుడు OBD2B-కంప్లైంట్. ఇది 124.7cc ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది. ఈ ఇంజిన్ 10.7bhp పవర్​, 10.6Nm పీక్ టార్క్‌ను అందిస్తుంది. ఈ ఇంజిన్ 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

హీరో సూపర్ స్ప్లెండర్ Xtec ఫీచర్లు: సూపర్ స్ప్లెండర్ Xtec స్టాండర్డ్ సూపర్ స్ప్లెండర్ ఆధారంగా డిజైన్ చేశఆరు. అయితే ఇది మరిన్ని ఫీచర్లతో వస్తుంది. ఈ మోటార్ సైకిల్​ను LED హెడ్‌లైట్, బ్లూటూత్ కనెక్టివిటీతో పూర్తిగా డిజిటల్ స్పీడోమీటర్‌తో అందించారు. కంపెనీ దీన్ని డ్రమ్, డిస్క్ అనే రెండు వేరియంట్లలో విక్రయిస్తుంది. వీటి ధర వరుసగా రూ. 88,128, రూ. 90,028 (ఎక్స్-షోరూమ్). అంటే పాత మోడల్​తో పోలిస్తే ప్రస్తుతం దీని ధర రూ.2,000 పెరిగింది.

Hero Super Splendor Xtec
Hero Super Splendor Xtec (Photo Credit- Hero Motocorp)

హీరో గ్లామర్​కు OBD-2B అప్‌డేట్: దీని పవర్‌ట్రెయిన్ గురించి చెప్పాలంటే హీరో గ్లానర్‌లోని 124.7cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్ OBD-2B ఆధారంగా దీన్ని అప్డేట్ చేశారు. ఈ ఇంజిన్ 10.4bhp పవర్​, 10.4Nm గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ఈ ఇంజిన్ 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

హీరో గ్లామర్ వేరియంట్లు, ధర: కంపెనీ ఈ మోటార్‌సైకిల్‌నూ డ్రమ్, డిస్క్ అనే రెండు వేరియంట్లలో విక్రయిస్తోంది. దీని డ్రమ్ వేరియంట్ ధర రూ. 86,698. డిస్క్ వేరియంట్ ధర రూ. 90,698 (ఎక్స్-షోరూమ్). ఎమిషన్ రిలేటెడ్ అప్డేట్​తో పాటు కంపెనీ దీని వేరియంట్ల ధరలను కూడా రూ. 2,000 పెంచింది.

Hero Glamour
Hero Glamour (Photo Credit- Hero Motocorp)

కలర్ ఆప్షన్స్: కంపెనీ హీరో గ్లామర్‌ను మొత్తం నాలుగు కలర్ ఆప్షన్స్​లో ప్రవేశపెట్టింది.

  • బ్లాక్ విత్ సిల్వర్
  • బ్లాక్ విత్ రెడ్
  • బ్లాక్ విత్ బ్లూ
  • రెడ్ విత్ బ్లాక్

అయితే రెడ్​ విత్ బ్లాక్ పెయింట్ స్కీమ్​ అనేది డ్రమ్ వేరియంట్​లో మాత్రమే అందుబాటులో ఉంది.

7,000mAh బ్యాటరీ, SD6 Gen 4 చిప్‌తో ఒప్పో కొత్త ఫోన్- లాంఛ్ ఎప్పుడంటే?

మంచి ఫ్యామిలీ కారు కొనాలా?- ఏడు సీట్లతో తోపు ఇవే!- కొనే ఆలోచన ఉంటే ఓ లుక్కేయండి!

స్టన్నింగ్ లుక్​లో టాటా కర్వ్ 'బ్లాక్ బ్యూటీ'- రేటెంతో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.