Google Removed Chinese App: పొరుగున ఉన్న చైనా నుంచి వచ్చిన ఒక యాప్ భారతీయుల ఆగ్రహానికి గురైంది. భారతదేశ పటాన్ని తప్పుగా ప్రదర్శించడం వల్ల దీనిపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఈ యాప్‌ను వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించాలని గూగుల్‌ను కోరింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గూగుల్ ఈ చైనీస్ యాప్‌ను క్షణాల్లో తొలగించింది.
భారతదేశానికి హాని కలిగించాలనే తన దుష్ట ఉద్దేశాలను నెరవేర్చుకోవడానికి చైనా ఇప్పుడు సాంకేతికతను ఉపయోగిస్తోంది. ఈ నేపథ్యంలో చైనాకు చెందిన 'అబ్లో' యాప్‌ను ప్లే స్టోర్ నుంచి తొలగించాలని భారత ప్రభుత్వం గూగుల్‌ను కోరింది. ఈ యాప్‌ను యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఇప్పటికే తొలగించారు. ప్రస్తుతం ఇది గూగుల్ ప్లే స్టోర్‌లో కూడా అందుబాటులో లేదు. ఇకపోతే భద్రతా కారణాల దృష్ట్యా భారత ప్రభుత్వం ఇప్పటికే అనేక చైనీస్ యాప్‌లను నిషేధించింది.
అసలేం జరిగిందంటే?: జమ్మూ కశ్మీర్, లడఖ్‌లను చైనా 'అబ్లో' యాప్‌లో తప్పుగా ప్రదర్శించింది. అలాగే లక్షద్వీప్ భారతదేశ మ్యాప్ నుంచి పూర్తిగా అదృశ్యమైంది. భారతదేశ పటాన్ని వక్రీకరించినందుకు యాప్‌ను తొలగించే దిశగా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది.
ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY), సర్వే ఆఫ్ ఇండియా ఈ యాప్‌పై చర్యలు తీసుకున్నాయి. ఈ అప్లికేషన్ మూలం చైనాకు సంబంధించినదని తెలుస్తోంది. ఇది ఇప్పటి వరకూ 10 వేలసార్లకు పైగా డౌన్లోడ్ అయింది.
ఏంటీ అబ్లో యాప్?: ఈ అబ్లో యాప్‌ను కల్చరల్ ఎక్ఛేంజ్, లాంగ్వేజ్ లెర్నింగ్, ట్రావెల్ గైడ్, బిజినెస్ డెవలప్మెంట్ వంటి వాటికి ఉపయోగించొచ్చని ప్లే స్టోర్‌లో దీనిపై సమాచారం ఉండేది.
చట్టం ఏం చెబుతోంది?: క్రిమినల్ లా (సవరణ) యాక్ట్, 1990లో దీని గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ చట్టం ప్రకారం భారతదేశ పటాన్ని తప్పుగా ప్రదర్శించడం శిక్షార్హమైన నేరం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000లోని సెక్షన్ 79(3)(b) కూడా దీనికి వర్తింపజేశారు. దీని కింద భారత చట్టాలను ఉల్లంఘించే ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి అలాంటి కంటెంట్‌ను మన ప్రభుత్వం తొలగించొచ్చు.
చైనా యాప్‌లపై భారత్ చర్యలు: ఫిబ్రవరి 2025లో భారత ప్రభుత్వం 119 చైనీస్ యాప్‌లను తొలగించాలని సూచనలు జారీ చేసింది. అంతకుముందు కూడా జూన్ 20, 2020న భద్రతా కారణాల దృష్ట్యా భారత ప్రభుత్వం దాదాపు 100 చైనీస్ యాప్‌లను నిషేధించడం గమనార్హం.
సూపర్ ఫీచర్లతో 'వివో T4 5G' స్మార్ట్‌ఫోన్- బడ్జెట్ ధరలోనే లాంఛ్!
ఆకాశం నవ్వటాన్ని ఎప్పుడైనా చూశారా?- ఏప్రిల్ 25న చూస్తే 'స్మైలీ ఫేస్'తో పలకరిస్తుంది కూడా!
10Gbps స్పీడ్ ఇంటర్నెట్ను ప్రారంభించిన చైనా- ఇకపై సెకన్లలో సినిమాలు డౌన్లోడ్!