Google Gemini Scheduled Actions Feature: ప్రస్తుతం నడుస్తున్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే AI టెక్నాలజీ యుగం. ఇది ప్రజల జీవితాలను చాలా ఈజీ చేసింది. ఏఐ చాలావరకు పనులను నిర్వహించడంలో సహాయం చేస్తూ వినియోగదారులకు పర్సనల్ అసిస్టెంట్‌గా మారిందనే చెప్పొచ్చు. ఇది వినియోగదారుల పనులను కూడా షెడ్యూల్ చేయగలదు. తాజాగా ఇలాంటి 'షెడ్యూల్డ్ యాక్షన్స్' అనే ఫీచర్‌ను గూగుల్ తన జెమిని ఏఐ యాప్‌కు జోడించింది.
ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ రోజువారీ పనులను ఆటోమేట్ చేసుకునే సౌకర్యం లభిస్తుంది. అంటే జెమిని AI యాప్ సహాయంతో మీరు భవిష్యత్తు కోసం ఏదైనా షెడ్యూల్ చేసిన పనిని అదే సమయంలో ఆటోమేటిక్‌గా పూర్తి చేసుకోవచ్చు. ఈ సదుపాయం ఓపెన్ఏఐ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ చాట్‌జీపీటీలో ఇప్పటికే అందుబాటు ఉంది. చాట్‌జీపీటీలో ఈ 'షెడ్యూల్ టాస్క్' మాదిరిగానే ఇప్పుడు గూగుల్ కూడా తన జెమిని ఏఐలో 'షెడ్యూల్డ్ యాక్షన్స్' అనే ఫీచర్‌ను చేర్చింది.
షెడ్యూల్ యాక్షన్స్ ఫీచర్ స్పెషాలిటీ?: ఈ కొత్త ఫీచర్ సహాయంతో మీరు గూగుల్ జెమినికి స్పెసిఫిక్ టైమ్, ఫిక్స్డ్ డేట్లో లేదా ఏదైనా ఈవెంట్ తర్వాత అయినా స్పెసిఫిక్ పనిని ఆటోమేటిక్‌గా చేయమని చెప్పొచ్చు. ఉదాహరణకు మీరు ప్రతి ఉదయం మీకు తాజా వార్తలను చెప్పమని, మీ రోజువారీ ప్లాన్స్ గురించి, మీరు చదవని ఇమెయిల్‌ల సమ్మరీని మీకు చెప్పడం వంటి విషయాలపై దీన్ని అడగొచ్చు.
దీంతోపాటు మీకు ఇష్టమైన గేమ్స్ గురించి లేటెస్ట్ వార్తలను చెప్పమని కమాండ్ చేయొచ్చు. అంతేకాకుండా ప్రతి శుక్రవారం విడుదలయ్యే సినిమాల గురించి అప్‌డేట్‌లు ఇవ్వడం వంటి విషయాలపై కూడా మీరు కమాండ్ ఇవ్వవచ్చు. ఇలా ఇది వినియోగదారుల రోజువారీ పనిని చాలా సులభతరం చేయడం మాత్రమే కాకుండా చాలా వరకు మీ సమయాన్ని ఆదా చేయడంలో సహాయపడుతుంది. వీటితోపాటు ఏదైనా ముఖ్యమైన పనిని మరచిపోవడం వల్ల కలిగే నష్టాన్ని కూడా దీని సహాయంతో నివారించవచ్చు.
అందుబాటులోకి ఎప్పుడు?: జెమిని ఈ కొత్త ఫీచర్‌ను ఉపయోగించడానికి గూగుల్ యాప్ లోపల సెట్టింగ్స్‌లో కొత్త 'షెడ్యూల్డ్ యాక్షన్స్' పేజీని అందించింది. దీని ద్వారా వినియోగదారులు తమ భవిష్యత్ పనులను షెడ్యూల్ చేసుకోవచ్చు. తద్వారా టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు. ఇందుకోసం యూజర్లు జెమినిలో ఇప్పటికే ఉపయోగించిన ప్రాంప్ట్‌లను కూడా వినియోగించుకోచ్చు.
అయితే ఈ ఫీచర్ ఇంకా యూజర్లందరికీ అందుబాటులోకి రాలేదు. గూగుల్ ఈ ఫీచర్‌ను గూగుల్ AI ప్రో లేదా అల్ట్రా సబ్‌స్క్రిప్షన్ ఉన్న వినియోగదారులకు, ప్రత్యేక గూగుల్ వర్క్‌స్పేస్ బిజినెస్, ఎడ్యుకేషన్ ప్లాన్స్ ఉన్న వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి తెచ్చింది. ఇది ఫ్రీ యూజర్లకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో ఇంకా వెల్లడించలేదు.
'నథింగ్ ఫోన్ 3' కొత్త టీజర్ రిలీజ్- బ్యాక్ డిజైన్ ఎలా ఉందో తెలుసా?
జపాన్‌కు మళ్లీ నిరాశే- ఐస్పేస్ మూన్ ల్యాండింగ్ ఫెయిల్- కారణం ఇదే!
ఫ్రాగ్షిప్ ప్రాసెసర్‌తో 'వన్‌ప్లస్ ప్యాడ్ 3'!- భారత్‌లో దీని రేటెంత ఉంటుందంటే?