ETV Bharat / technology

అదిరే ఫీచర్లతో 'CMF బడ్స్ 2' సిరీస్ లాంఛ్- 50dB నాయిస్ క్యాన్సిలేషన్, 61.5 గంటల బ్యాటరీ లైఫ్‌తో! - CMF BUDS 2 SERIES LAUNCHED

మార్కెట్​లో CMF 'బడ్స్ 2', 'బడ్స్ 2a', 'బడ్స్ 2 ప్లస్' TWS ఇయర్‌ఫోన్స్ లాంఛ్- ధర, ఫీచర్లపై పూర్తి వివరాలివే!

The CMF Buds 2 series TWS earbuds are compatible with Nothing X app.
The CMF Buds 2 series TWS earbuds are compatible with Nothing X app. (Photo Credit: Nothing)
author img

By ETV Bharat Tech Team

Published : April 29, 2025 at 5:36 PM IST

4 Min Read

CMF Buds 2 Series Launched: CMF బై నథింగ్ భారతదేశంలో తన 'CMF ఫోన్ 2 ప్రో' TWS ఇయర్‌ఫోన్‌లను విడుదల చేసింది. భారత్​లో నిర్వహించిన లాంఛ్ ఈవెంట్​లో కంపెనీ వీటిని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసింది. ఈ సిరీస్​లో కంపెనీ 'CMF బడ్స్ 2a','CMF బడ్స్ 2', 'CMF బడ్స్ 2 ప్లస్' అనే మూడు మోడల్స్​ను తీసుకొచ్చింది. CMF తీసుకొచ్చిన ఈ కొత్త బడ్స్ సిరీస్ ధర రూ. 2199 నుంచి ప్రారంభమవుతుంది. మరెందుకు ఆలస్యం ఈ కొత్త బడ్స్ ధర, ఫీచర్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.

CMF కొత్త ఇయర్‌ఫోన్‌లు 50dB వరకు నాయిస్ క్యాన్సిలేషన్ (ANC)కు సపోర్ట్​ చేస్తాయి. ఇవి వాటి సంబంధిత ఛార్జింగ్ కేసులతో మొత్తం 61.5 గంటల వరకు బ్యాటరీ లైఫ్​ను అందిస్తాయి. ఈ కొత్త TWS ఇయర్​ఫోన్​లు నథింగ్ X యాప్‌తో అనుకూలంగా ఉంటాయి. డ్యూయల్-డివైస్ కనెక్టివిటీకి మద్దతు ఇస్తాయి. ముఖ్యంగా ఈ ఇయర్‌బడ్‌లు 'CMF బడ్స్ ప్రో 2' మాదిరిగానే డిజైన్‌ను కలిగి ఉన్నాయి. ఇవి గతేడాది జులైలో భారత్​లో లాంఛ్ అయ్యాయి.

CMF 'బడ్స్ 2a', 'బడ్స్ 2', 'బడ్స్ 2 ప్లస్' ధరలు:

CMF బడ్స్ 2a ధర: రూ. 2,199

CMF బడ్స్ 2 ధర: రూ. 2,699

CMF బడ్స్ 2 ప్లస్ ధర: రూ. 3,299

CMF 'బడ్స్ 2a', 'బడ్స్ 2', 'బడ్స్ 2 ప్లస్' కలర్ ఆప్షన్స్:

CMF బడ్స్ 2a కలర్ ఆప్షన్స్​: ఇవి మూడు రంగులలో అందుబాటులో ఉన్నాయి.

  • ఆరెంజ్
  • లైట్ గ్రే
  • డార్క్ గ్రే

CMF బడ్స్ 2 కలర్ ఆప్షన్స్​: ఇవి కూడా మార్కెట్​లో మూడు కలర్ ఆప్షన్స్​లో అందుబాటులో ఉన్నాయి.

  • లైట్ గ్రీన్
  • డార్క్ గ్రే
  • ఆరెంజ్

CMF బడ్స్ 2 ప్లస్: ఇవి రెండు రంగులలో వస్తాయి.

  • లైట్ గ్రే
  • బ్లూ
మోడల్ధరకలర్ ఆప్షన్స్
CMF Buds 2aరూ.2,199
  • ఆరెంజ్
  • లైట్ గ్రే
  • డార్క్ గ్రే
CMF Buds 2రూ.2,699
  • లైట్ గ్రీన్
  • డార్క్ గ్రే
  • ఆరెంజ్
CMF Buds 2 Plusరూ.3,299
  • లైట్ గ్రే
  • బ్లూ

సేల్ వివరాలు: ఈ TWS ఇయర్‌బడ్‌లు భారతదేశంలో ఫ్లిప్‌కార్ట్ ద్వారా రిటైల్ కోసం అందుబాటులో ఉంటాయి.

CMF బడ్స్ 2a: ఈ మోడల్ ఇయర్​బడ్స్ 42dB ANCతో ట్రాన్సపరెన్సీ మోడ్, 12.4mm బయో-ఫైబర్ డ్రైవర్ విత్ డిరాగ్ ట్యూనింగ్, అల్ట్రా బాస్ టెక్నాలజీ 2.0, క్లియర్ వాయిస్ టెక్నాలజీతో 4 HD mics, నథింగ్ X యాప్ ద్వారా 110ms లో- లేటెన్సీ మోడ్‌ను యాక్సెస్ చేయగలవు. అంతేకాకుండా ఈ TWS ఇయర్‌బడ్‌లు డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్సీ కోసం IP54 రేటింగ్‌ను కలిగి ఉన్నాయి.

CMF Buds 2a
CMF Buds 2a (Photo Credit: Nothing)

వీటి ANCని ఆఫ్ చేసిన తర్వాత కూడా ఈ TWS ఇయర్‌బడ్‌లను 8 గంటల పాటు ఉపయోగించవచ్చని కంపెనీ చెబుతోంది. ఛార్జింగ్ కేస్‌తో ఈ 'బడ్స్ 2a' మోడల్ 35.5 గంటల వరకు బ్యాటరీ లైఫ్​ను అందిస్తుంది. ఈ ఇయర్‌బడ్‌లు 43mAh బ్యాటరీని కలిగి ఉంటాయి. అయితే ఛార్జింగ్ కేస్ 460mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో వీటిని 5.5 గంటలు ఉపయోగించుకోవచ్చు.

CMF బడ్స్ 2: ఈ 'CMF బడ్స్ 2'లో 48dB హైబ్రిడ్ ANC సపోర్ట్, డైరాక్ ఆప్టియో టెక్నాలజీతో 11mm PMI డ్రైవర్లు, అల్ట్రా బాస్ టెక్నాలజీ 2.0, స్పేషియల్ ఆడియో ఎఫెక్ట్ టెక్నాలజీ, క్లియర్ వాయిస్ టెక్నాలజీ 3.0 తో 6 HD mics, విండ్ నాయిస్ రిడక్షన్ 3.0, నథింగ్ X యాప్‌తో 110ms వరకు లో- లేటెన్సీ మోడ్ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఇది డస్ట్ అండ్ స్ప్లాష్ ఇన్‌గ్రెస్ కోసం IP55 రేటింగ్‌ను కలిగి ఉంది.

CMF Buds 2
CMF Buds 2 (Photo Credit: Nothing)

ఈ TWS ఇయర్‌ఫోన్‌లను ANCని ఆఫ్ చేసిన తర్వాత కూడా 8 గంటల పాటు ఉపయోగించొచ్చని కంపెనీ పేర్కొంది. ఛార్జింగ్ కేస్‌తో ఈ మోడల్ 55 గంటల వరకు బ్యాటరీ లైఫ్​ను అందిస్తుంది. ఈ ఇయర్‌ఫోన్‌లు 53mAh బ్యాటరీతో వస్తాయి. ఛార్జింగ్ కేస్ 460mAh బ్యాటరీతో వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉపయోగించి వీటిని 10 నిమిషాల ఛార్జింగ్ తర్వాత 5.5 గంటల పాటు ఉపయోగించొచ్చు.

CMF Buds 2 Series Features/Specifications
CMF Buds 2 Series Features/Specifications (ETV Bharat)

CMF బడ్స్ 2 ప్లస్: ఇవి స్మార్ట్ అడాప్టివ్ మోడ్‌తో 50dB హైబ్రిడ్ ANC సపోర్ట్, హై-రెస్ LDAC, హియరింగ్ కాంపెన్సేషన్‌తో 12mm LCP డ్రైవర్లు, అల్ట్రా బాస్ టెక్నాలజీ 2.0, స్పేషియల్ ఆడియో ఎఫెక్ట్ టెక్నాలజీ, 6 HD mics, క్లియర్ వాయిస్ టెక్నాలజీ 3.0, విండ్ నాయిస్ రిడక్షన్ 3.0, నథింగ్ X యాప్ ద్వారా 110ms వరకు లో-లేటెన్సీ మోడ్‌ను కలిగి ఉంది. ఈ మోడల్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్సీ కోసం IP55 రేటింగ్‌ను కలిగి ఉంది.

CMF Buds 2 Plus
CMF Buds 2 Plus (Photo Credit: Nothing)

ANC ఆఫ్ చేయబడినప్పుడు ఈ TWS ఇయర్‌బడ్‌లు 14 గంటల వరకు పనిచేస్తాయని, ఛార్జింగ్ కేస్‌తో 61.5 గంటల వరకు బ్యాటరీ లైఫ్​ను అందిస్తాయని కంపెనీ అంటోంది. ఈ 'CMF బడ్స్ 2 ప్లస్' ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్​ చేస్తుంది. 10 నిమిషాల ఛార్జింగ్‌తో వీటిని 7.5 గంటల పాటు ఉపయోగించుకోవచ్చు.

దేశంలో జోరుగా విస్తరిస్తున్న వీఐ 5G సేవలు!- ఇప్పుడు మరో రెండు నగరాల్లో- ఎక్కడెక్కడంటే?

నాన్​స్టాప్ గేమింగ్ పెర్ఫార్మెన్స్​తో 'రియల్​మీ GT 7'- గేమర్లకు ఇక పండగే!

D2M టెక్నాలజీతో చౌకైన స్మార్ట్​ఫోన్- ఇకపై ఇంటర్నెట్ లేకుండానే OTT, లైవ్ టీవీ కంటెంట్!

నింగిలోకి దూసుకెళ్లిన ప్రాజెక్ట్ 'కైపర్'​ ఉపగ్రహాలు- ఇవి స్టార్​లింక్​కు గట్టి పోటీని ఇస్తాయా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.