Classic Legends Plans For New Bikes: క్లాసిక్ లెజెండ్స్ FY 2026లో మార్కెట్లోకి నాలుగు కొత్త మోటార్ సైకిల్స్‌ను తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. వీటిని 7 కొత్త మార్కెట్లోకి ఎక్స్పోర్ట్ చేయాలని ప్లాన్ చేస్తోంది. తద్వారా కంపెనీ తన సేల్స్‌ను రెట్టింపు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు క్లాసిక్ లెజెండ్స్ సహ వ్యవస్థాపకుడు అనుపమ్ తరీజ కంపెనీ ఫ్యూచర్ ప్లాన్లపై సమాచారం అందించారు. క్లాసిక్ లెజెండ్స్ అనేది ప్రముఖ టూ-వీలర్ తయారీ సంస్థలు జావా మోటార్‌సైకిల్స్, యెజ్డి మోటార్‌సైకిల్స్, BSA మోటార్‌సైకిల్స్‌కు మాతృ సంస్థ.
కంపెనీ తన ప్రస్తుత లైనప్‌ను విస్తరిస్తోంది. ఈ క్రమంలో తన అడ్వెంచర్ మోటార్‌సైకిల్ 'యెజ్డి అడ్వెంచర్' అప్డేటెడ్ 2025 మోడల్‌ను లాంఛ్ చేసింది. ఈ మోటార్‌సైకిల్‌ను రూ.2.15 లక్షల నుంచి రూ.2.27 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరలో తీసుకొచ్చింది. మరోవైపు క్లాసిక్ లెజెండ్స్ మిడిల్-వెయిట్ మోటార్‌సైకిల్ విభాగంలో కొత్త ఇంజిన్ పరిచయం చేసే యోచనలో ఉంది. ఇందులో భాగంగా కంపెనీ 450cc ఇంజిన్ ప్లాట్‌ఫామ్‌పై పనిచేస్తోందని, అయితే దీన్ని ఈ ఏడాది ప్రారంభించబోమని అనుపమ్ తరీజా వెల్లడించారు. బదులుగా ప్రస్తుతం దాని ప్రస్తుత ఇంజిన్ ప్లాట్‌ఫామ్‌ను మెరుగుపరచడంపై దృష్టి సారించిందని పేర్కొన్నారు.

"నిజానికి మాకు CC గేమ్ అంటే బోర్ కొట్టింది. బైక్ ఎలా నడుస్తుంది, వాస్తవ పరిస్థితుల్లో అది ఎలా పనిచేస్తుంది అనేది అతి ముఖ్యమైన విషయం. మా ఇంజన్లు బుల్లెట్ ప్రూఫ్. ఇప్పుడు మేం స్ప్రాకెట్లు, గేర్ రేషియోలు, హ్యాండ్లింగ్, సస్పెన్షన్ వంటి రైడింగ్‌ను ఎక్సైటింగ్‌గా మార్చే ఎలిమెంట్స్‌పై పనిచేస్తున్నాం. " - అనుపమ్ తరీజ, క్లాసిక్ లెజెండ్స్ కో-ఫౌండర్
ఈ క్రమంలో మాట్లాడిన ఆయన "మన దగ్గర ఇప్పటికే ఉన్నదానికి మనం న్యాయం చేయాలి. మన పొజిషనింగ్, ధర నిర్ణయం, ఉత్పత్తి శ్రేణులపై ఎక్కువ దృష్టి పెడుతున్నాం" అని అన్నారు. ఈ నేపథ్యంలో మరింత వాల్యూ, వెర్సటిలిటీని అందించేందుకు తమ ప్రస్తుత ఉత్పత్తులను మెరుగుపరుస్తున్నట్లు పేర్కొన్నారు. అంటే క్లాసిక్ లెజెండ్స్ పూర్తిగా కొత్త విభాగంలోకి ప్రవేశించడం కంటే రోడ్‌స్టర్స్, అడ్వెంచర్ టూరర్స్, క్లాసిక్ మోటార్‌సైకిళ్లను కలిగి ఉన్న దాని ప్రస్తుత లైనప్‌ను బలోపేతం చేయడంపై ఫోకస్ చేస్తోంది.

క్లాసిక్ లెజెండ్స్ ప్రస్తుతం యెజ్డి బ్రాండ్ క్రింద మార్కెట్లో మూడు మోటార్ సైకిళ్లను విక్రయిస్తోంది. వాటిలో యెజ్డి రోడ్‌స్టర్, స్క్రాంబ్లర్, అడ్వెంచర్ ఉన్నాయి. మరోవైపు కంపెనీ జావా బ్రాండ్ కింద ఐదు మోడళ్లను, BSA బ్రాండ్ కింద రెండు మోటార్ సైకిళ్లను విక్రయిస్తోంది.

కంపెనీకి స్ట్రాంగ్ లెగసీ ఉంది. అయితే ఉత్పత్తి నాణ్యత సమస్యలు, అమ్మకాల తర్వాత సేవా సమస్యలు, ప్రపంచ మహమ్మారి వల్ల కలిగే సమస్యల కారణంగా మిడిల్ వెయిట్ మోటార్‌సైకిల్ విభాగంలో పట్టు సాధించడంలో కంపెనీ సవాళ్లను ఎదుర్కొంటోంది. కానీ BSA ఇప్పుడు కొత్త స్క్రాంబ్లర్ బైక్‌ను విడుదల చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇది దాని గోల్డ్‌స్టార్ బైక్‌కు శక్తినిచ్చే ప్రస్తుత సింగిల్-సిలిండర్, 650cc ఇంజిన్‌ను కలిగి ఉంటుంది.
కిర్రాక్ ఫీచర్లతో వన్‌ప్లస్ ఫస్ట్ కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ లాంఛ్- దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా?
భారీ డేటా లీక్- 'ప్రమాదంలో 18.4 కోట్ల పాస్‌వర్డ్‌లు'- జాగ్రత్త సుమీ!!
ప్రపంచ కంపెనీలను ఆకర్షించే ప్రయత్నాలు- టెస్లాకు నాట్ ఇంట్రెస్ట్, BYDకి నో ఎంట్రీ!