Citroen Dark Edition India: ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ భారతీయ విభాగం అయిన సిట్రోయెన్ ఇండియా తన 'బసాల్ట్', 'ఎయిర్‌క్రాస్', 'C3 SUV' మోడల్స్ డార్క్ ఎడిషన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ ఈ సిట్రోయెన్ డార్క్ ఎడిషన్ సిరీస్‌ను బ్లాక్-అవుట్ ఎక్స్టీరియర్, ఇంటీరియర్‌తో ప్రవేశపెట్టింది. వీటిలోని బసాల్ట్, ఎయిర్‌క్రాస్ డార్క్ ఎడిషన్స్ టాప్-స్పెక్ మాక్స్ ట్రిమ్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే 'C3 SUV' డార్క్ ఎడిషన్‌ను మాత్రం షైన్ ట్రిమ్‌లో లభిస్తుంది. అంతేకానీ కంపెనీ వీటి డార్క్ ఎడిషన్‌లో ఎటువంటి యాంత్రిక మార్పులు చేయలేదు.
సిట్రోయెన్ 'బసాల్ట్', 'ఎయిర్‌క్రాస్' డార్క్ ఎడిషన్‌లో కొత్తగా ఏం ఉంది?:

వీటి ఎక్స్టీరియర్ విషయానికి వస్తే ముందు భాగంలో డార్క్ నోస్, సిట్రోయెన్ లోగోతో సహా బయటి భాగంలో చాలా ముఖ్యమైన మార్పులు కన్పిస్తాయి. వీటిని స్టాండర్డ్ మోడల్ కంటే కాస్త డిఫరెంట్‌గా ఉంచేందుకు కంపెనీ వీటి ఫ్రంట్ డోర్స్, బూట్‌పై 'డార్క్' బ్యాడ్జ్‌లను అమర్చింది.

ఇక ఇంటీరియర్ గురించి మాట్లాడుకుంటే.. ఈ SUVల డార్క్ ఎడిషన్‌లో క్యాబిన్ గ్లోసీ బ్లాక్ ఫినిష్‌తో వస్తుంది. గేర్ లివర్‌పై కాంట్రాస్ట్ రెడ్ స్టిచింగ్, లెథరెట్ సీట్లు, డోర్ ఆర్మ్‌రెస్ట్‌లు, యాంబియంట్ అండ్ ఫుట్‌వెల్ లైట్లు, సీట్‌బెల్ట్‌ల కోసం బ్రాండ్-బ్యాడ్జ్డ్ కుషన్లతో పాటు షైనింగ్ సిల్ ప్లేట్లు ఉన్నాయి. అలాగే డాష్‌బోర్డ్ లెథరెట్ ఫినిషింగ్‌తో వస్తుంది. ఇదే దీనిలో గుర్తించదగిన అప్‌గ్రేడ్.

'బసాల్ట్', 'ఎయిర్‌క్రాస్' పవర్‌ట్రెయిన్: ఈ రెండు SUVల డార్క్ ఎడిషన్ వాటి మాక్స్ ట్రిమ్ ఆధారంగా రూపొందించారు. అయితే వీటిలో ఎటువంటి యాంత్రిక మార్పులు చేయలేదు. ఈ రెండు SUV మోడళ్లు 1.2-లీటర్, మూడు సిలిండర్ల, టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగిస్తాయి. ఇవి 108bhp శక్తిని, 190Nm టార్క్ (6MTతో) అండ్ 205Nm (6ATతో) ఉత్పత్తి చేస్తాయి. అదే టర్బోచార్జ్డ్ ఇంజిన్ బసాల్ట్‌తో గరిష్ఠంగా 19.5kpl మైలేజీని, ఎయిర్‌క్రాస్‌తో 18.5kpl మైలేజీని అందిస్తుంది.

సిట్రోయెన్ 'బసాల్ట్', 'ఎయిర్‌క్రాస్' ధర:
వేరియంట్ అండ్ గేర్‌బాక్స్ | ధర | స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే ధరలో వ్యత్యాసం |
Basalt Turbo Max MT | రూ.12,80,000 | రూ. 23,000 |
Basalt Turbo Max AT | రూ.14,10,000 | రూ. 23,000 |
Aircross Turbo Max MT | రూ.13,13,300 | రూ. 22,500 |
Aircross Turbo Max AT | రూ.14,27,300 | రూ. 22,500 |
సిట్రోయెన్ C3 డార్క్ ఎడిషన్ ఎక్స్టీరియర్: కంపెనీ ఈ చిన్న SUV సిట్రోయెన్ C3 డార్క్ ఎడిషన్ బయటి భాగాన్ని పూర్తిగా బ్లాక్ కలర్లో డిజైన్ చేశారు. ఇందులో కొత్త పెర్లా నెరా బ్లాక్ పెయింట్ ఫినిషింగ్, లెటరింగ్ కోసం డార్క్ క్రోమ్ ట్రిమ్, గ్రిల్ అండ్ సైడ్ మోల్డింగ్ ఉన్నాయి. వీటితోపాటు 15-అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఇందులో ఏర్పాటు చేశారు. ఇవి స్టాండర్డ్ C3 వేరియంట్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే డార్క్ ఎడిషన్ రియర్ వ్యూ మిర్రర్ కింద ప్రత్యేకమైన బ్యాడ్జింగ్ ఉంటుంది.

సిట్రోయెన్ C3 డార్క్ ఎడిషన్ ఇంటీరియర్ అండ్ ఫీచర్లు: సిట్రోయెన్ C3 డార్క్ ఎడిషన్ క్యాబిన్, డ్యాష్‌బోర్డ్, స్టీరింగ్ వీల్, సీట్లు, సెంటర్ కన్సోల్ వంటి ఎక్స్టీరియర్ భాగాలను కార్బన్ బ్లాక్ ఫినిషింగ్‌తో తీసుకొచ్చారు. ఈ కారులో లావా రెడ్ స్టిచింగ్, కొంత స్పోర్టి ఫ్లెయిర్ కోసం బ్లాక్-అవుట్ ట్రీట్‌మెంట్ ఉంది. దీనితో పాటు AC వెంట్స్, గేర్ లివర్‌లకు గ్లోసీ బ్లాక్ యాక్సెంట్స్ అందించారు.
సిట్రోయెన్ C3 డార్క్ ఎడిషన్ ఇంటీరియర్: పూర్తిగా బ్లాక్ కలర్ స్కీమ్‌తో పాటు ఈ సిట్రోయెన్ C3 డార్క్ ఎడిషన్ లెథరెట్ సీట్లు, యాంబియంట్ అండ్ ఫుట్‌వెల్ లైటింగ్, ఇల్యూమినేటెడ్ సిల్ ప్లేట్లు, లెథరెట్-చుట్టిన ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ అండ్ సీట్‌బెల్ట్ కుషన్లు వంటి అనేక లక్షణాలతో వస్తుంది.

సిట్రోయెన్ c3 డార్క్ ఎడిషన్ ధర:
వేరియంట్ అండ్ గేర్‌బాక్స్ | ధర |
1.2P Shine Dark Edition | రూ. 8.38 లక్షలు |
1.2P Shine Turbo Dark Edition | రూ. 9.58 లక్షలు |
1.2P Shine Turbo AT Dark Edition | రూ. 10.19 లక్షలు |
సిట్రోయెన్ C3 డార్క్ ఎడిషన్ పవర్‌ట్రెయిన్: ఈ మోడల్లో గమనించాల్సిన విషయం ఏంటంటే.. సిట్రోయెన్ C3 డార్క్ ఎడిషన్‌లో కేవలం కాస్మెటిక్ మార్పులు మాత్రమే చేశారు. కాబట్టి స్టాండర్డ్ వేరియంట్‌తో పోలిస్తే ఇందులో ఎటువంటి యాంత్రిక మార్పులు లేవు. దీని షైన్ వేరియంట్ 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 81bhp పవర్, 115Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌తో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే వస్తుంది.
అయితే దీనిలో కస్టమర్లు 1.2-లీటర్, టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను కూడా ఎంచుకోవచ్చు. ఇది 108bhp శక్తిని, 205Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.
మార్కెట్‌లో దుమ్ము రేపుతున్న ఎస్‌యూవీలు- రూ.7లక్షల లోపు టాప్ మోడల్స్ ఇవే!
యూపీఐ పేమెంట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం- లావాదేవీల పరిమితి పెంపు!
New Aadhaar App: ఇకపై ఆధార్‌తో పనిలేదు!- కొత్త యాప్ వచ్చేసిందిగా