ETV Bharat / technology

1600 కోట్ల పాస్​వర్డ్స్ లీక్- రిస్క్​లో యూజర్స్ సోషల్ మీడియా అకౌంట్లు! - BILLIONS OF LOGIN CREDENTIALSLEAKED

యాపిల్‌, ఫేస్‌బుక్‌, గూగుల్ యూజర్స్​కు చెందిన 16 బిలియన్ల పాస్​వర్డ్​లు లీక్‌- హ్యాకర్ల చేతిలో డిజిటల్ లాగిన్ వివరాలు!

Billions Of Login Credentials Leaked
Billions Of Login Credentials Leaked (ETV Bharat (Representative Image))
author img

By ETV Bharat Telugu Team

Published : June 21, 2025 at 11:06 AM IST

2 Min Read

Billions Of Login Credentials Leaked : ప్రస్తుతం డిజిటల్‌ యుగంలో టెక్నాలజీ వల్ల లాభాలే కాకుండా నష్టాలు కూడా ఉన్నాయి. టెక్నాలజీను ఉపయోగించుకొని సైబర్‌ నేరగాళ్లు కొత్త కొత్త పంథాల్లో ప్రజలను దోచుకుంటున్నారు. దీంతో ఆన్​లైన్‌ మోసాలు ప్రపంచవ్యాప్తంగా ఒక తీవ్రమైన సమస్యగా మారిపోయాయి. పలు ప్రముఖ సంస్థల డేటాలను కూడా సైబర్‌ నేరగాళ్లు కొల్లగొట్టేస్తున్నారు. తాజాగా గూగుల్, ఫేస్​బుక్​, యాపిల్ యూజర్లకు చెందిన బిలియన్ల కొద్దీ లాగిన్ పాస్​వర్డ్​లు లీక్ అయ్యాయని సైబర్‌ న్యూస్ పరిశోధకులు తేల్చారు. అందువల్ల సైబర్ నేరగాళ్లు ప్రతిరోజూ యూజర్స్ ఉపయోగించే ఖాతాలను యాక్సెస్​ చేయగలరని వాళ్లు చెబుతున్నారు.

సైబర్‌ న్యూస్‌ నివేదిక ప్రకారం
సైబర్ న్యూస్ పరిశోధకులు మొత్తం 30 డేటా సెట్​లను కనుగొన్నారు. వీటిలో ప్రతి ఒక్కటి అపారమైన లాగిన్ సమాచారాన్ని కలిగి ఉంది. ఇందులో గూగుల్, ఫేస్​బుక్, యాపిల్‌ సహా అనేక ప్రసిద్ధ ప్లాట్‌ ఫారమ్​లు ఉపయోగిస్తున్న 16 బిలియన్ల (1600 కోట్లు) యూజర్స్ పాస్​వర్డ్​లు ఉన్నాయని పరిశోధకులు చెప్పారు. సోషల్‌ మీడియా, వీపీఎన్‌ లాగిన్​లతో పాటు వివిధ కార్పొరేట్‌ డెవలపర్‌ ప్లాట్‌ ఫారమ్​లను కలిగి ఉన్న సంస్థలకు చెందిన ఖాతాలలో లాగిన్‌ అయిన అన్ని ఖాతాల వివరాలు వీటిలో రికార్డ్‌ అవుతున్నట్లు పేర్కొన్నారు.

జనాభా కంటే డబుల్ పాస్​వర్డ్స్ లీక్
16 బిలియన్​ ఖాతాల పాస్​వర్డ్​లు లీక్ - అంటే నేడు భూమిపై ఉన్న ప్రజల సంఖ్యకు ఇది రెట్టింపు. వినియోగదారులకు చెందిన ఒకటి కంటే ఎక్కువ ఖాతాల పాస్​వర్డ్​లు లీక్ అయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇందులో కొన్ని నకిలీ ఖాతాలు కూడా ఉండొచ్చని, అందుకే ఎంత మంది వ్యక్తుల ఖాతాల పాస్​వర్డ్​లు బహిర్గతమయ్యాయో చెప్పడం సాధ్యం కాదని సైబర్‌ న్యూస్ పరిశోధకులు పేర్కొన్నారు.

ఇన్ఫోస్టీలర్ల సాయంతో
ఇన్ఫోస్టీలర్లు ద్వారా యూజర్స్ పాస్​వర్డ్​లను సైబర్ మోసగాళ్లు కొల్లగొట్టారని సైబర్ న్యూస్ పేర్కొంది. ఇన్ఫోస్టీలర్​ అనేది ఒక రకమైన హానికరమైన సాఫ్ట్​వేర్. ఇది సున్నితమైన సమాచారాన్ని కొల్లగొట్టేందుకు బాధితుడి డివైజ్ లేదా సిస్టమ్​లోకి ప్రవేశిస్తుంది. అయితే ఈ లీకైన పాస్​వర్డ్స్ గురించి చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ లాగిన్ డీటైల్స్ ఎవరి చేతుల్లో ఉన్నాయో అని యూజర్స్ ఆందోళన చెందుతున్నారు.

మీ అకౌంట్ సేఫ్​గా ఉండాలా?
ఇటీవలి డేటా ఉల్లంఘనలో మీ ఖాతా డేటా బహిర్గతమయ్యే అవకాశం ఉందని మీరు ఆందోళన చెందుతున్నారా? అయితే జర జాగ్రత్త. తొలుత మీ సోషల్ మీడియా అకౌంట్ల పాస్​వర్డ్​లను మార్చేయండి. మీ ఖాతాలు అన్నింటికి ఒకే పాస్​వర్డ్​ను పెట్టొద్దు. ఎక్కువ పాస్​వర్డ్‌లను గుర్తుంచుకోవడం మీకు చాలా కష్టంగా అనిపిస్తే పాస్​వర్డ్ మేనేజర్​ని ఉపయోగించండి. మల్టీఫ్యాక్టర్ అథంటికేషన్​ను ఎనేబుల్ చేసుకోండి. ఇది మీ ఫోన్, ఈ-మెయిల్, యూఎస్​బీ ప్రామాణీకరణకు రెండో పొరగా ఉపయోగపడుతుంది. మీ ఖాతా సురక్షితంగా ఉంటుంది!

సైబర్​ నేరాల ఫిర్యాదుకు కొత్త పోర్టల్​ - ఇకనుంచి ఏ నిమిషంలోనైనా కంప్లైంట్ చేయొచ్చు

సైబర్‌ సెక్యూరిటీ నిపుణులకు ఫుల్​ గిరాకీ- ఈ స్కిల్స్​ నేర్చుకుంటే జాబ్ పక్కా..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.