Best SUVs Under 7 Lakh Rupees: భారత మార్కెట్లో SUVల డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. మన దేశంలో కార్ల తయారీ కంపెనీలు ప్రతి ప్రైస్ సెగ్మెంట్లోనూ SUVలను విక్రయిస్తున్నాయి. ఈ సందర్భంగా సరసమైన ధరలో బెస్ట్ SUVల గురించి తెలుసుకుందాం రండి. అది కూడా రూ. 7 లక్షల ధర లోపు లభించే టాప్-SUVల లిస్ట్ మీకోసం.
1. Tata Punch: టాటా మోటార్స్ అతి చిన్న SUV అయిన టాటా పంచ్‌ను కంపెనీ రూ. 6.20 లక్షల నుంచి రూ. 10.32 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య విక్రయిస్తోంది. దీని ప్యూర్, అడ్వెంచర్ వేరియంట్‌లను రూ. 7 లక్షల కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. కానీ ఈ బడ్జెట్లో కంపెనీ వీటిని 1.2-లీటర్, 3-సిలిండర్, నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే విక్రయిస్తోంది. అయితే వీటిలో CNG ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

ఈ ఇంజిన్ పెట్రోల్ ఇంధనంపై 87bhp శక్తిని, 115Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే ఇంజిన్ CNGలో 72bhp శక్తిని, 103Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. వీటితోపాటు అనేక గొప్ప ఫీచర్లతో టాటా పంచ్ మార్కెట్లో అమ్ముడవుతోంది. మార్కెట్లో దీని నెలవారీ సేల్స్ కూడా చాలా బాగున్నాయి.
2. Hyundai Exter: జాబితాలో సెకండ్ వెహికల్ ఈ హ్యుందాయ్ ఎక్స్‌టర్ చిన్న SUV. ఇది కొరియన్ తయారీ సంస్థ భారతీయ విభాగం అయిన హ్యుందాయ్ మోటార్ ఇండియా నుంచి వచ్చింది. కంపెనీ ఈ కారును రూ.6.21 లక్షల నుంచి రూ.10.51 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య విక్రయిస్తోంది. ఈ కారు EX ట్రిమ్‌ను రూ. 7 లక్షల లోపు కొనుగోలు చేయొచ్చు. అయితే ఇందులో 1.2-లీటర్, 4-సిలిండర్, నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ మాత్రమే లభిస్తుంది. ఈ ఇంజిన్ 82bhp శక్తిని, 113Nm టార్క్‌ను అందిస్తుంది.

కస్టమర్లు ఈ హ్యుందాయ్ ఎక్స్‌టర్ CNG ఫ్యూయెల్‌తో కూడా అందుబాటులో ఉందని గమనించాలి. ఈ కారులో కంపెనీ అనేక గొప్ప ఫీచర్లను అందిస్తుంది.
3. Renault Kiger: ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ భారతీయ విభాగం అయిన రెనాల్ట్ ఇండియా నుంచి వచ్చిన కాంపాక్ట్ SUV అయిన రెనాల్ట్ కిగర్‌ను రూ. 7 లక్షల లోపు కొనుగోలు చేయొచ్చు. ఈ బడ్జెట్లో మీరు ఈ కారు RXE, RXL ట్రిమ్‌లను సేల్ చేయొచ్చు. కంపెనీ ఈ కారును 1.0-లీటర్, నేచురల్లీ ఆస్పిరేటెడ్, 1.0-లీటర్, టర్బో పెట్రోల్ అనే రెండు ఇంజిన్ ఆప్షన్లతో మార్కెట్లో విక్రయిస్తోంది.

దీని మొదటి ఇంజిన్ 71bhp పవర్, 91Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే సమయంలో దీని రెండవ టర్బో ఇంజిన్ 99bhp పవర్, 160Nm పీక్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ రెండు ఇంజిన్లతో మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ ఉంది. అయితే ఆటోమేటిక్ గేర్‌బాక్స్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్‌తో, CVT టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో జతయి వస్తుంది.
4. Nissan Magnite: ఈ నిస్సాన్ మోటార్ కాంపాక్ట్ SUV ఈ జాబితాలో నాల్గవ కారు. ఈ SUVలోని Visia B4D, Visia Plus B4D ట్రిమ్‌లను రూ. 7 లక్షల లోపు కొనుగోలు చేయొచ్చు. కంపెనీ ఈ కారును మార్కెట్లో 1.0-లీటర్, నేచురల్లీ ఆస్పిరేటెడ్, 1.0-లీటర్, టర్బో పెట్రోల్ అనే రెండు ఇంజిన్ ఆప్షన్స్‌తో విక్రయిస్తోంది.

కిగర్ మాదిరిగానే ఈ కారులో కూడా నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ 71bhp పవర్ అండ్ 91Nm గరిష్ఠ టార్క్‌ను, టర్బో పెట్రోల్ ఇంజిన్ 99bhp పవర్ అండ్ 160Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజిన్లతో మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ ఉంది. అయితే ఆటోమేటిక్ గేర్‌బాక్స్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్‌తో, CVT టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో జతయి వస్తుంది.
KTM నుంచి మొదటి ఎండ్యూరెన్స్ మోటార్‌సైకిల్- లాంఛ్‌కు ముందే కీలక స్పెక్స్ రివీల్!
యూపీఐ పేమెంట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం- లావాదేవీల పరిమితి పెంపు!
New Aadhaar App: ఇకపై ఆధార్‌తో పనిలేదు!- కొత్త యాప్ వచ్చేసిందిగా