Best Android Phones Under 10000 : ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరూ స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. అయితే స్మార్ట్‌ఫోన్ కొనేటప్పుడు పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు మొబైల్ యూజర్స్. అందుకే ప్రస్తుతం మార్కెట్లో రూ.10 వేల బడ్జెట్లో సూపర్ ఫీచర్స్ అండ్ స్పెక్స్ కలిగి ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ గురించి తెలుసుకుందాం.
1. Motorola G24 Power Specifications :
మంచి బ్యాటరీ సామర్థ్యం ఉన్న మొబైల్ కొనాలనుకునేవారికి మోటారోలా జీ24 పవర్ ఫోన్ మంచి ఆప్షన్ అవుతుంది. అలాగే ఈ ఫోన్ మంచి కెమెరా క్వాలిటీ ఇస్తుంది.
- డిస్ప్లే : 6.56 అంగుళాలు
- ప్రాసెసర్ : మీడియాటెక్ హీలియో జీ85
- ర్యామ్ : 4 జీబీ/8జీబీ
- స్టోరేజీ కెపాసిటీ : 128 జీబీ
- బ్యాటరీ : 6000 ఎంఏహెచ్
- రియర్ కెమెరా : 50 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 16 ఎంపీ
- ఓఎస్ : ఆండ్రాయిడ్ 14
- ధర : రూ.7,999- రూ.8,999
2. Redmi 12 Specifications : రెడ్మీ ఫోన్లో యాక్సిలరోమీటర్, ఫింగర్ ప్రింట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఉంది.
- డిస్ప్లే : 6.79 అంగుళాలు
- ప్రాసెసర్ : మీడియాటెక్ హీలియో జీ88
- ర్యామ్ : 4/ 6 జీబీ
- స్టోరేజీ కెపాసిటీ : 128 జీబీ
- బ్యాటరీ : 5000 ఎంఏహెచ్
- రియర్ కెమెరా : 50 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 8 ఎంపీ
- ఓఎస్ : ఆండ్రాయిడ్ 13
- ధర : రూ. 7,871- రూ.9,499
3. Itel Color Pro 5G Specifications : ఈ మోడల్ మొబైల్ మంచి లుక్‌గా ఉంటుంది. సెల్ఫీల కోసం మంచి ఫోన్ కొనాలనుకుంటే మంచి ఆప్షన్ అవుతుంది.
- డిస్ప్లే : 6.60 అంగుళాలు
- ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్షిటీ 6080
- ర్యామ్ : 6 జీబీ
- స్టోరేజీ కెపాసిటీ : 128 జీబీ
- బ్యాటరీ : 5000 ఎంఏహెచ్
- రియర్ కెమెరా : 50 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 8 ఎంపీ
- ఓఎస్ : ఆండ్రాయిడ్ 13
- ధర : రూ. 9,999
4. Realme C63 Specifications : రియల్మీ సీ63 ఫోన్ మంచి కెమెరా క్వాలిటీని కావాలనుకునేవారు ఆప్షన్‌గా ఎంచుకోవచ్చు. అలాగే మంచి బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
- డిస్ ప్లే : 6.74 అంగుళాలు
- ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్షిటీ 6300
- ర్యామ్ : 4 జీబీ
- స్టోరేజీ కెపాసిటీ : 128 జీబీ
- బ్యాటరీ : 5000 ఎంఏహెచ్
- రియర్ కెమెరా : 50 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 8 ఎంపీ
- ఓఎస్ : ఆండ్రాయిడ్ 14
- ధర : రూ. 8,664- రూ. 8,999
5. Poco M6 Pro 5G Specifications : పోకో ఎమ్16 ప్రో 5జీ ఫోన్ 6.79 అంగుళాల గొరిల్లా గ్లాస్ తో విశాలమైన డిస్ప్లేను కలిగి ఉంటుంది. యాక్సిలరోమీటర్, కంపాస్/మాగ్నెటోమీటర్, ఫింగర్ ప్రింట్ వంటి ఫీచర్లు ఫోన్లో ఉన్నాయి.
- డిస్ప్లే : 6.79 అంగుళాలు
- ప్రాసెసర్ : క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2
- ర్యామ్ : 4/6 జీబీ
- స్టోరేజీ కెపాసిటీ : 64/128 జీబీ
- బ్యాటరీ : 5000 ఎంఏహెచ్
- రియర్ కెమెరా : 50 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 8 ఎంపీ
- ఓఎస్ : ఆండ్రాయిడ్ 14
- ధర : రూ. 9,749- రూ. 9,999
6. Samsung Galaxy M14 4G Specifications : బ్రాండెంట్ కంపెనీ ఫోన్లలో శాంగంగ్ గెలాక్సీ ఎమ్14 4జీ ఫోన్ ఒకటి. ఈ ఫోన్లో ఫ్రంట్ కెమెరా క్వాలిటీ బాగుంటుంది.
- డిస్ప్లే : 6.70 అంగుళాలు
- ప్రాసెసర్ : స్నాప్ డ్రాగన్ 680
- ర్యామ్ : 4/6 జీబీ
- స్టోరేజీ కెపాసిటీ : 64/128 జీబీ
- బ్యాటరీ : 5000 ఎంఏహెచ్
- రియర్ కెమెరా : 50 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 13 ఎంపీ
- ఓఎస్ : ఆండ్రాయిడ్ 13
- ధర : రూ. 8,369- రూ. 8,767
7. Tecno Pop 8 Specifications : టెక్నో పాప్ 8 ఫోన్ డిజైన్ బాగుంటుంది. కొత్త కంపెనీ ఫోన్లు ప్రయత్నిద్దామనుకునేవారికి దీన్ని కొనుగోలు చేయొచ్చు.
- డిస్ప్లే : 6.60 అంగుళాలు
- ప్రాసెసర్ : యూనిసోక్ టీ606
- ర్యామ్ : 4/8 జీబీ
- స్టోరేజీ కెపాసిటీ : 64 జీబీ
- బ్యాటరీ : 5000 ఎంఏహెచ్
- రియర్ కెమెరా : 13 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 8 ఎంపీ
- ఓఎస్ : ఆండ్రాయిడ్ టీ-గో
- ధర : రూ. 6,899- రూ. 7,790
8. Oppo A17 Specifications : ఒప్పొ ఏ17 ఫోన్ బ్యాక్ కెమెరా సెటప్‌లో ఆటో ఫోకస్ ఉంటుంది. అలాగే బ్యాటరీ సామర్థ్యం బాగుంటుంది.
- డిస్ప్లే : 6.56 అంగుళాలు
- ప్రాసెసర్ : మీడియాటెక్ హీలియో పీ35
- ర్యామ్ : 4 జీబీ
- స్టోరేజీ కెపాసిటీ : 64 జీబీ
- బ్యాటరీ : 5000 ఎంఏహెచ్
- రియర్ కెమెరా : 50 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 5 ఎంపీ
- ఓఎస్ : ఆండ్రాయిడ్ 12
- ధర : రూ. 9,999
9. Poco M6 5G Specifications : పోకో ఎమ్6 5జీ ఫోన్ 6.74 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది. అలాగే రూ.10 వేలలోపు బడ్జెట్లో ఫోన్ కొనాలకునువారికి బెస్ట్ ఛాయిస్ అవుతుంది.
- డిస్ప్లే : 6.74 అంగుళాలు
- ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్షిటీ 6100+
- ర్యామ్ : 4 జీబీ/ 6 జీబీ
- స్టోరేజీ కెపాసిటీ : 128 జీబీ
- బ్యాటరీ : 5000 ఎంఏహెచ్
- రియర్ కెమెరా : 50 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 5 ఎంపీ
- ఓఎస్ : ఆండ్రాయిడ్ 13
- ధర : రూ.7,999 - రూ. 9,999
10. Nokia G42 5G Specifications : ఈ నోకియా ఫోన్ మంచి కెమెరా క్వాలిటీతో వస్తుంది. ఈ ఫోన్లో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, బేరోమీటర్, కంపాస్/మాగ్నెటోమీటర్, గైరోస్కోప్, ఫింగర్ ప్రింట్ సెన్సార్లు ఉన్నాయి.
- డిస్ప్లే : 6.56 అంగుళాలు
- ప్రాసెసర్ : క్వాల్ కమ్ స్నాప్డ్ డ్రాగన్ 480+
- ర్యామ్ : 6 జీబీ
- స్టోరేజీ కెపాసిటీ : 128 జీబీ
- బ్యాటరీ : 5000 ఎంఏహెచ్
- రియర్ కెమెరా : 50 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 8 ఎంపీ
- ఓఎస్ : ఆండ్రాయిడ్ 13
- ధర : రూ. 9,999
రూ.25వేల బడ్జెట్లో మంచి కెమెరా ఫోన్ కొనాలా? టాప్-5 ఆప్షన్స్ ఇవే! - Best Mobile phones under 25000