Audi A4 Signature Edition Launched: ఆడి ఇండియా తన ఎంట్రీ లెవల్ లగ్జరీ సెడాన్ 'A4 సిగ్నేచర్ ఎడిషన్'ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కారు ధర రూ. 57.11 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ లిమిటెడ్ ఎడిషన్ను టాప్-స్పెక్ టెక్నాలజీ వేరియంట్ ఆధారంగా రూపొందించారు. ఈ కారుకు స్టైలిష్ అప్‌డేట్‌లు, అదనపు ఫీచర్లు అందించారు. ఇవి సాధారణ యాక్సెసరీలుగా లభిస్తాయి. పరిమిత సంఖ్యలో లభించే ఈ కారు స్టైలిష్ డిజైన్, ప్రీమియం ఫీచర్లతో వస్తుంది. ఈ సందర్భంగా ఈ కొత్త ఆడి కారుపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.
ఆడి A4 సిగ్నేచర్ ఎడిషన్‌లో కొత్తగా రూపొందించిన అల్లాయ్ వీల్స్ డైనమిక్ హబ్ క్యాప్‌లతో ఉంటాయి. ఇవి కారు మోషన్లో ఉన్నప్పుడు ఆడి లోగోను నిటారుగా ఉంచుతాయి. దీనికి వెనక స్పాయిలర్, నేచురల్ గ్రే, ఉడ్ ఓక్‌లో ప్రత్యేకమైన ఇంటీరియర్ ట్రిమ్‌లు, స్టెయిన్‌లెస్ స్టీల్ పెడల్ కవర్లు, ఆడి రింగులను ప్రొజెక్ట్ చేసే LED పుడిల్ లాంప్స్తో పాటు ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ ఫ్రాగ్రాన్స్ డిస్పెన్సర్ కూడా లభిస్తుంది.
ఇక టెక్నాలజీ పరంగా దీనికి 360-డిగ్రీల కెమెరా, పార్క్ అసిస్ట్, 19-స్పీకర్ బ్యాంగ్ & ఓలుఫ్సెన్ సౌండ్ సిస్టమ్ లభిస్తాయి. దీని ఇతర ముఖ్య ఫీచర్లలో 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్ప్లే, వైర్‌లెస్ ఛార్జింగ్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ ఉన్నాయి.
సిగ్నేచర్ ఎడిషన్ కలర్ ఆప్షన్స్: ఈ సిగ్నేచర్ ఎడిషన్ మార్కెట్లో ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
- గ్లేసియర్ వైట్
- మైథోస్ బ్లాక్
- నవారా బ్లూ
- ప్రోగ్రెసివ్ రెడ్
- మాన్‌హట్టన్ గ్రే
ఆడి A4 సిగ్నేచర్ ఎడిషన్ ఫీచర్లు: యాంత్రికంగా కారులో ఎటువంటి మార్పులు లేవు. ఇది 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 201 bhp, 320 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఇంజిన్ 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో వస్తుంది. 12V మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్ సహాయంతో ఈ కారు 7.1 సెకన్లలో 0 నుంచి 100 km/h వేగాన్ని అందుకుంటుంది. ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 214km.
6000mAh బ్యాటరీతో చౌకైన 5G ఫోన్!- త్వరలోనే లాంఛ్- వివరాలు ఇవే!
'హీరో జూమ్ 160' బుకింగ్స్ మళ్లీ స్టార్ట్- డెలివరీలు ఎప్పుడంటే?