Apple iphone 16 Series Mobiles Launched: ఐఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు రానే వచ్చాయి. ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ 16 సిరీస్‌ను ఇటీవల కాలిఫోర్నియాలో జరిగిన గ్లోటైమ్ ఈవెంట్లో లాంచ్ చేసింది. ఈ నేపథ్యంలో దీని ధర, ఫీచర్లు వంటి వివరాలు మీకోసం.
ఐఫోన్ 16 సిరీస్: ఐఫోన్ 16 సిరీస్‌లో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రొ, ఐఫోన్ 16 ప్రొ మ్యాక్స్ అనే నాలుగు మోడల్స్‌ను యాపిల్ తీసుకొచ్చింది. గూగుల్ పిక్సెల్ 9, శాంసంగ్ గెలాక్సీ ఎస్24లో అందుబాటులోకి వచ్చిన ఏఐ తరహాలో యాపిల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో ఈ మొబైల్స్‌ను తీసుకొచ్చింది. చాలావరకు ఏఐ టాస్క్‌లు రిమోట్ డేటా సెంటర్లకు బదులుగా ఈ కొత్త ఐఫోన్స్లోనే పూర్తవుతాయి. ఈ ఫోన్లు ఐఓఎస్18తో పనిచేస్తాయి.
iPhone 16 Specifications:
- కెపాసిటీ: 128, 256, 512 GB
- డిస్‌ప్లే: 6.1 అంగుళాలు
- మెయిన్ కెమెరా: 48 మెగా పిక్సెల్
- ఫ్రంట్ కెమెరా: 12 మెగా పిక్సెల్
- ఛార్జర్: సీటైప్
కలర్ ఆప్షన్స్:
- బ్లాక్
- వైట్
- పింక్
- టీయల్
- అల్ట్రా మెరైన్
- ధర: రూ.79,990 నుంచి ప్రారంభం
iPhone 16 Plus Specifications:
- కెపాసిటీ: 128, 256, 512 GB
- డిస్‌ప్లే: 6.7 అంగుళాలు
- మెయిన్ కెమెరా: 48 మెగా పిక్సెల్
- ఫ్రంట్ కెమెరా: 12 మెగా పిక్సెల్
- ఛార్జర్: సీటైప్
కలర్ ఆప్షన్స్:
- బ్లాక్
- వైట్
- పింక్
- టీయల్
- అల్ట్రా మెరైన్
- ధర: రూ.89,990 నుంచి ప్రారంభం
iPhone 16 Pro Specifications:
- కెపాసిటీ: 128, 256, 512 GB, 1 TB
- డిస్‌ప్లే: 6.3 అంగుళాలు
- మెయిన్ కెమెరా: 48 మెగా పిక్సెల్
- ఫ్రంట్ కెమెరా: 12 మెగా పిక్సెల్
- ఛార్జర్: సీటైప్
కలర్ ఆప్షన్స్:
- బ్లాక్ టైటానియం
- వైట్ టైటానియం
- నేచురల్ టైటానియం
- డిజర్ట్ టైటానియం
- ధర: రూ.1,19,900 నుంచి ప్రారంభం
iPhone 16 Pro Max Specifications:
- కెపాసిటీ: 128, 256, 512 GB, 1 TB
- డిస్‌ప్లే: 6.9 అంగుళాలు
- మెయిన్ కెమెరా: 48 మెగా పిక్సెల్
- ఫ్రంట్ కెమెరా: 12 మెగా పిక్సెల్
- ఛార్జర్: సీటైప్
కలర్ ఆప్షన్స్:
- బ్లాక్ టైటానియం
- వైట్ టైటానియం
- నేచురల్ టైటానియం
- డిజర్ట్ టైటానియం
ధర: రూ.1,44,900 నుంచి ప్రారంభం
వీటితో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 10, వాచ్ అల్ట్రా, ఎయిర్‌పాడ్స్ 4, ఎయిర్‌పాడ్స్ మ్యాక్స్, ఎయిర్‌పాడ్స్ ప్రొ 2ను కూడా విడుదల చేసింది.
రేపే మార్కెట్లోకి మెర్సిడెస్ లగ్జరీ కారు- ఫస్ట్ లుక్ చూశారా? - Mercedes Benz EQS SUV