Budget Friendly EV Scooter: మీరు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 కి.మీ వరకు ఆగకుండా ప్రయాణించవచ్చు. ఈ ఈవీకి లైసెన్స్ కూడా అవసరం లేదు. అంతేకాకుండా దీని ధర కూడా రూ.60వేల లోపే. అలాగని ఫీచర్ల విషయంలో ఎటువంటి ఢోకా లేదు. ఇందులో రోజువారీ అవసరాలకు తగినన్ని ఫీచర్లు పుష్కలంగా ఉన్నాయి. ఇన్ని ప్రత్యేకమైన లక్షణాలతో అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటీని గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ ప్రవేశపెట్టింది. మరెందుకు ఆలస్యం దీనిపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.
ఆంపియర్ రియో 80: గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ 'ఆంపియర్ రియో 80' అనే లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. దేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీని పెంచే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఈ మోడల్ దాని ధరతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మొదటిసారి ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులు, విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, లైసెన్స్ లేకుండా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ మోడల్ ఓలా, ఏథర్ వంటి స్టార్టప్‌లతో పోటీ పడుతోంది.
ఎంట్రీ లెవల్ ఇ-స్కూటర్ విభాగంలో ఖచ్చితంగా పరిగణించవలసిన మోడళ్లలో 'రియో 80' ఒకటి అనడంలో ఎటువంటి సందేహం లేదు. నెక్సస్ వంటి ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్లతో సంచలనం సృష్టించిన ఆంపియర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ కొత్త ఈ కొత్త 'ఆంపియర్ రియో 80' ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలను ఈ నెలలోనే ప్రారంభించనున్నట్లు సమాచారం.
ఫుల్ బెనిఫిట్స్!: మొదటగా 'ఆంపియర్ రియో 80' ఎలక్ట్రిక్ స్కూటర్‌ను దేశంలో ఉపయోగించడానికి రిజిస్ట్రేషన్ లేదా లైసెన్సింగ్ అవసరం లేదు. భారత్‌లోని చట్టం గంటకు 25 కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతో ఏ వాహనాన్నైనా ఉపయోగించడానికి అనుమతిస్తుంది. ఈ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా రూపొందించారు.
కాబట్టి మీరు డ్రైవింగ్ లైసెన్స్ లేదా RTO రిజిస్ట్రేషన్ లేకుండానే రియోను ఎంచక్కా ఉపయోగించుకోవచ్చు. ఈ ఫీచర్ ఓనర్షిప్ ప్రాసెస్‌ను సులభతరం చేస్తుంది. 16 ఏళ్లు పైబడిన టీనేజర్లు, వృద్ధులు, లైసెన్సింగ్ డాక్యుమెంట్స్ ఇబ్బంది లేని వారితో సహా విస్తృత కస్టమర్లకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అందుబాటులో ఉంచుతుంది.
లో స్పీడ్ హై సెక్యూరిటీ!: అంతేకాకుండా దాని తక్కువ వేగం కారణంగా ఇది చాలా సురక్షితం. 'ఆంపియర్ రియో 80' ఎలక్ట్రిక్ స్కూటర్ కొనడానికి మరో ముఖ్యమైన కారణం దాని ధర. కేవలం రూ. 59,900 ఎక్స్-షోరూమ్ ధరకే లభించే ఈ EV దేశంలోని అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి. పెద్దగా డబ్బు ఖర్చు చేయకుండా ఎలక్ట్రిక్ వాహనం కొనాలనుకునే వారికి రియో నిజంగా ఒక వరం లాంటిది!
ఇది తక్కువ నిర్వహణ ఖర్చులతో దీర్ఘకాలంలో లాభదాయకంగా ఉంటుంది. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ 'ఆంపియర్ రియో 80' ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుందని పేర్కొంది. అంటే ఇది రోజువారీ అవసరాలకు తగినంత కవరేజీని కలిగి ఉంది.
రాత్రిపూట ఛార్జ్ చేసినా సమస్య లేదు!: దీని అధునాతన బ్యాటరీ వ్యవస్థతో మీరు రాత్రిపూట ఛార్జ్ చేసినా మీకు ఎటువంటి సమస్యలు ఉండవు. 'ఆంపియర్ రియో 80' EV ఛార్జింగ్ టైమ్‌ను కంపెనీ అధికారికంగా వెల్లడించనప్పటికీ, ఈ విభాగంలోని చాలా స్కూటర్లు పూర్తిగా ఛార్జ్ కావడానికి సాధారణంగా 6 నుంచి 8 గంటలు పడుతుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఫుల్ ఛార్జ్‌కు అదే సమయం తీసుకునే అవకాశం ఉంది. ఇది కాకుండా రియో స్టాండర్డ్ హోమ్ ఛార్జింగ్ సెటప్‌తో వస్తుంది.
ఫీచర్లు కూడా మోర్!: ఈ కొత్త ఆంపియర్ రియో 80 EV ఫీచర్ల పరంగా చాలా బాగుంది. తక్కువ ధరకే అందుబాటులో ఉన్నప్పటికీ ఇది కలర్ LCD ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, కీ స్టార్ట్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌లు, అల్లాయ్ వీల్స్ వంటి ఆధునిక ఫీచర్లను కలిగి ఉంది.
కలర్ ఆప్షన్స్: మార్కెట్లో ఇది బ్లాక్, రెడ్, బ్లూ, వైట్ కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. కాబట్టి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
స్టన్నింగ్ లుక్‌లో టాటా కర్వ్ 'బ్లాక్ బ్యూటీ'- రేటెంతో తెలుసా?
నేడు ప్రపంచ క్వాంటం దినోత్సవం- ఇవాళే ఎందుకో తెలుసా? దీని హిస్టరీ ఏంటంటే?
కియా సైరోస్‌కు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్- కళ్లు మూసుకుని కొనేయొచ్చు ఇక!