ETV Bharat / technology

'ఆల్కాటెల్ V3 5G' సిరీస్​లో మరో రెండు మోడల్స్- లాంఛ్​కు ముందే కీలక స్పెక్స్ రివీల్! - ALCATEL V3 5G SERIES LAUNCH

ఆల్కాటెల్ 'V3 ప్రో 5G', 'V3 క్లాసిక్ 5G' స్మార్ట్​ఫోన్ల టీజర్ రిలీజ్- లాంఛ్ ఎప్పుడంటే?

Alcatel V3 Pro 5G and V3 Classic 5G Teased Ahead of May 27 India Launch
Alcatel V3 Pro 5G and V3 Classic 5G Teased Ahead of May 27 India Launch (Photo Credit- Alcatel)
author img

By ETV Bharat Tech Team

Published : May 22, 2025 at 10:40 AM IST

3 Min Read

Alcatel V3 5G Series Launch: దేశీయ మార్కెట్​లోకి 'ఆల్కాటెల్ V3 5G' సిరీస్ మరికొన్ని రోజుల్లో ఎంట్రీ ఇవ్వనుంది. ఇది ఫ్రెంచ్ కంపెనీ స్మార్ట్‌ఫోన్ సిరీస్. ఈ సిరీస్‌లో మూడు మోడల్స్​ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్​ మే 27న లాంఛ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. వీటిలో 'ఆల్కాటెల్ V3 అల్ట్రా 5G' మోడల్​ను ఇప్పటికే కన్ఫార్మ్ చేసింది. తాజాగా ఇప్పుడు ఇందులో మిగిలిన రెండు స్మార్ట్‌ఫోన్‌ల అధికారిక టీజర్‌ను విడుదల చేసింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ల పేర్లు ఆల్కాటెల్ 'V3 ప్రో 5G', 'V3 క్లాసిక్ 5G'. ఆల్కాటెల్ అనేది TCL కమ్యూనికేషన్ నిర్వహిస్తున్న ఒక ఫ్రెంచ్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ.

ఆల్కాటెల్ V3 ప్రో 5G: కంపెనీ ఈ మోడల్​ను మూడు వేరియంట్లలో తీసుకురానున్నట్లు తెలుస్తోంది. లాంఛ్ అనంతరం వీటిని ఫ్లిప్​కార్ట్ ద్వారా విక్రయించనుంది. కంపెనీ ఈ ఆల్కాటెల్ V3 ప్రో 5G మైక్రోసైట్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో లైవ్ చేస్తోంది. ఇది ఈ ఫోన్​ బ్లాక్, గ్రీన్ కలర్ ఆప్షన్​లలో తీసుకురానున్నట్లు చూపిస్తుంది. ఇకపోతే ఇది 120Hz రిఫ్రెష్ రేట్​తో 6.7-అంగుళాల NXTPAPER డిస్​ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో-బ్లూ లైట్, యాంటీ-గ్లేర్ వంటి ఐ-ప్రొటెక్షన్​ ఫీచర్లకు కూడా సపోర్ట్ చేస్తుందని కంపెనీ ధృవీకరించింది. ఈ ఫోన్ అడాప్టివ్ కలర్ టెంపరేచర్, బ్రైట్‌నెస్‌తో పాటు నైట్ లైట్ మోడ్ ఫీచర్‌తో కూడా రాబోతోంది.

ఆల్కాటెల్ V3 క్లాసిక్ 5G: కంపెనీ 'ఆల్కాటెల్ V3 క్లాసిక్ 5G' మోడల్​ను వైట్ కలర్ ఆప్షన్​లో టీజ్ చేసింది. ఈ ఫోన్‌లో NXTPAPER డిస్‌ప్లే ఉంటుంది. ఈ డిస్​ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఇది స్పష్టమైన రంగులతో షార్ప్ కాంట్రాస్ట్‌ను అందిస్తుంది. ప్రాసెసర్​ కోసం కంపెనీ ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 SoC చిప్‌సెట్​ను అందించనుంది. దీనిలో 5200mAh బ్యాటరీని అమర్చనున్నారు. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ ఫోన్ వెనక భాగంలో కంపెనీ 50MP బ్యాక్ కెమెరాను అందిస్తుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో కంపెనీ 8MP ఫ్రంట్ కెమెరాను అందిస్తుంది.

ఈ రెండు ఫోన్‌ల బాక్స్‌లో వినియోగదారులకు ఛార్జర్, ప్రొటెక్టివ్ కవర్‌ కూడా లభిస్తుంది.

ఆల్కాటెల్ V3 అల్ట్రా 5G: పైన పేర్కొన్న రెండు ఫోన్‌లు కాకుండా ఈ ఫోన్ సిరీస్‌లోని మూడవ ఫోన్ పేరు 'ఆల్కాటెల్ V3 అల్ట్రా 5G'. దీనిలోని అనేక స్పెసిఫికేషన్ల గురించి సమాచారం ఇప్పటికే అందుబాటులో ఉంది. కంపెనీ ఈ ఫోన్‌ను క్యాంపెయిన్ గోల్డ్, హైపర్ బ్లూ, ఓషన్ గ్రే కలర్ ఆప్షన్‌లలో లాంఛ్ చేయొచ్చు. ఈ సిరీస్‌లోని ప్రో, క్లాసిక్ వేరియంట్‌ల మాదిరిగానే అల్ట్రా వేరియంట్ కూడా NXTPAPER డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీని పరిమాణం 6.8 అంగుళాలు ఉంటుంది. ఇది ఫుల్​ HD ప్లస్ స్క్రీన్.

ఈ ఫోన్ వెనక భాగంలో 108MP మెయిన్ కెమెరా సెన్సార్ ఉంటుంది. ఇది 8MP సెకండ్, 2MP మూడవ కెమెరా సెన్సార్‌తో వస్తుంది. ఈ ఫోన్ 8GB RAM, 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ సపోర్ట్‌తో వస్తుంది. ఇది కాకుండా ఫోన్​లో 5,010mAh బ్యాటరీని అమర్చనున్నారు. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్​కు సపోర్ట్‌ చేస్తుంది. ఇందులో DTS X సౌండ్ సపోర్ట్‌తో డ్యూయల్ స్పీకర్లు అందించనున్నారు. ఈ ఫోన్ ఒక e-SIM, ఒక ఫిజికల్ SIMకు సపోర్ట్​తో వస్తుంది.

గూగుల్​ క్రోమ్​ యూజర్లకు కేంద్రం 'హై-రిస్క్'​ అలర్ట్‌- వెంటనే ఈ పని చేయకపోతే ఇక అంతే!

మీకు ఫొటోలు తీసే అలవాటుందా?- ఈ కారు జోలికి మాత్రం పోవద్దు- మీ ఫోన్ కెమెరా ఖతం!

సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీని ఆవిష్కరించిన భారత్- 6 నిమిషాల్లో 80% ఛార్జ్- ధర కూడా తక్కువే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.