Airtel Spam Alert: భారతదేశపు అతిపెద్ద, ప్రసిద్ధ టెలికాం కంపెనీలలో ఒకటైన భారతీ ఎయిర్‌టెల్ కొన్ని రోజుల క్రితం AI ఆధారిత స్పామ్ డిటెక్షన్ టూల్‌ను ప్రారంభించింది. ఎయిర్‌టెల్ తీసుకొచ్చిన ఈ సిస్టమ్ ఇప్పటివరకు 27.5 బిలియన్లకు పైగా కాల్స్‌ను స్పామ్‌గా గుర్తించి వినియోగదారులను అప్రమత్తం చేసింది. ఈ క్రమంలో ఎయిర్‌టెల్ ఇప్పుడు తన స్పామ్ డిటెక్షన్ అండ్ అలర్ట్ సిస్టమ్‌లో మరో రెండు ప్రత్యేక ఫీచర్లను జోడించినట్లు ప్రకటించింది. ఇవి యూజర్లు స్పామ్ కాల్స్‌కు దూరంగా ఉంచడంలో సహాయపడతాయి.
ఎయిర్‌టెల్ కొత్తగా తీసుకొచ్చిన ఈ రెండింటిలో ఒక ఫీచర్ సహాయంతో యూజర్లకు ఇకపై విదేశీ నెట్‌వర్క్‌ల స్పామ్ కాల్స్, మెసెజ్‌ల నుంచి దూరంగా ఉంచేందుకు అలర్ట్స్ వస్తాయని సోమవారం ప్రకటించింది. మరో ఫీచర్ ద్వారా ఈ అలెర్ట్స్ భారతదేశంలోని 10 ప్రాంతీయ భాషల్లో యూజర్‌కు రియల్‌టైమ్‌లో డివైజ్ డిస్ప్లే పై కన్పించనున్నాయి. వీటిలో హిందీ, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ, తమిళం, కన్నడ, మలయాళం, తెలుగు, పంజాబీ, ఉర్దూ వంటి పది భారతీయ భాషలు ఉన్నాయి. రాబోయే కాలంలో మరిన్ని భారతీయ భాషలను దీనికి జోడించనున్నట్లు కంపెనీ తెలిపింది.
కాగా ఇంతకుముందు కూడా ఎయిర్‌టెల్ AI ఆధారిత స్పామ్ కాల్ డిటెక్షన్ టూల్ సహాయంతో యూజర్లకు స్పామ్ కాల్స్ అలెర్ట్స్ వచ్చేవి. అయితే అది కేవలం డొమెస్టిక్ స్పామ్ కాల్స్ నుంచి మాత్రమే అప్రమత్తం చేసేంది. అది కూడా కేవలం ఒక భారతీయ భాష హిందీతో పాటు ఇంగ్లీషులో అలెర్ట్స్‌ను ఈ టూల్ పంపించేది.
విదేశీ నెట్‌వర్క్‌ల నుంచి వచ్చే ఫేక్ కాల్స్ గుర్తింపు: ఎయిర్‌టెల్ ఈ AI ఆధారిత స్పామ్ కాల్ డిటెక్షన్ టూల్ ఇప్పుడు విదేశీ నెట్‌వర్క్‌ల నుంచి వచ్చే నకిలీ కాల్స్, మెసెజ్‌లను గుర్తించి రియల్ టైమ్‌లో మిమ్మల్ని అప్రమత్తం చేస్తుంది. భారతదేశంలో ఎయిర్‌టెల్ స్పామ్ కాల్స్‌ను బ్లాక్ చేయడం ప్రారంభించినప్పటి నుంచి స్పామర్లు విదేశీ నెట్‌వర్క్‌లను ఆశ్రయించారని కంపెనీ తన పత్రికా ప్రకటన ద్వారా తెలియజేసింది. గత 6 నెలల్లో ఇటువంటి స్పామ్ కాల్స్‌లో 12% పెరుగుదల ఉంది. ఈ కారణంగా కంపెనీ ఇప్పుడు తన AI సిస్టమ్ ద్వారా విదేశీ నెట్‌వర్క్‌ల నుంచి వచ్చే నకిలీ కాల్స్‌ను గుర్తించేందుకు కొత్త ఫీచర్‌ను ప్రారంభించింది.

ఇది ఎలా పనిచేస్తుంది?: ఎయిర్‌టెల్ తీసుకొచ్చిన ఈ AI టూల్ కాల్స్, మెసెజ్‌లను స్కాన్ చేస్తుంది. అవి గనక స్పామ్‌గా అనిపిస్తే ఈ టూల్ వెంటనే వినియోగదారులకు అలెర్ట్లను పంపిస్తుంది. అది కూడా రియల్ టైమ్‌లోనే అప్రమత్తం చేస్తుంది. అంటే ఒకవేళ మీకు నకిలీ కాల్ వస్తున్నట్లయితే అది లిఫ్ట్ చేయొద్దు అంటూ స్పామ్ అలెర్ట్‌ను రియల్ టైమ్‌లోనే మీకు డిస్ప్లేలో ప్రదర్శిస్తుంది. ఈ ప్రత్యేక ఫీచర్ ఎయిర్‌టెల్ వినియోగదారులందరికీ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది. ఇందుకోసం యూజర్లు ఎలాంటి యాక్టివేషన్ ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు.
కంపెనీ ప్రస్తుతం ఈ ప్రత్యేక ఫీచర్‌ను ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల యూజర్ల కోసం మాత్రమే ప్రారంభించింది. అయితే రాబోయే రోజుల్లో కంపెనీ ఈ ఫీచర్‌ను ఐఫోన్ ఉన్న ఎయిర్‌టెల్ వినియోగదారులకు కూడా ప్రారంభించే అవకాశం ఉంది. ఇందులో మరో ముఖ్యవిషయం ఏంటంటే.. ఎయిర్‌టెల్ ఈ AI- ఆధారిత స్పామ్ డిటెక్షన్ టూల్ సౌకర్యాన్ని తన యూజర్లకు పూర్తిగా ఉచితంగా అందిస్తోంది.
SMSలకు కూడా: ఎయిర్‌టెల్ ఈ AI ఆధారిత స్పామ్ డిటెక్షన్ టూల్లో తీసుకొచ్చిన కొత్త ఫీచర్.. విదేశీ నెట్‌వర్క్‌ల SMS ద్వారా వచ్చిన హానికరమైన లింక్‌ల విషయంలో కూడా వినియోగదారులను అప్రమత్తం చేస్తుంది. ఇందుకోసం బ్లాక్ లిస్ట్‌లో చేర్చిన URLలు, ప్రతి SMSను సెంట్రలైజ్డ్ డేటాబేస్ రియల్ టైమ్ ప్రాతిపదికన స్కాన్ చేస్తుంది. తద్వారా అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయకుండా ఉండేలా వినియోగదారులను ఇది అప్రమత్తం చేస్తుంది.
'అబ్లో' యాప్ తొలగింపుపై కేంద్రం ఆదేశాలు- క్షణాల్లోనే ప్లే స్టోర్ నుంచి అవుట్!
సూపర్ ఫీచర్లతో 'వివో T4 5G' స్మార్ట్‌ఫోన్- బడ్జెట్ ధరలోనే లాంఛ్!
ఆకాశం నవ్వటాన్ని ఎప్పుడైనా చూశారా?- ఏప్రిల్ 25న చూస్తే 'స్మైలీ ఫేస్'తో పలకరిస్తుంది కూడా!