AI+ Pulse, AI+ Nova 5G: రియల్‌మీ మాజీ సీఈవో మాధేవ్ సేథ్ నేతృత్వంలోని కన్స్యూమర్ టెక్ కంపెనీ అయిన 'NxtQuantum Shift Technologies' భారతదేశంలో తన అప్‌కమింగ్ 'Ai+' స్మార్ట్ఫోన్ల డిజైన్‌ను అధికారికంగా ప్రదర్శించింది. 'AI+' బ్రాండ్‌తో భారతదేశంలో కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. వీటి పేర్లు 'AI+ పల్స్', 'AI+ నోవా 5G'. కంపెనీ ఈ అప్‌కమింగ్ స్మార్ట్ఫోన్ల డిజైన్, కలర్ ఆప్షన్లను వెల్లడించింది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లు 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తో వస్తాయి. ఇవి హై-స్పీడ్ పెర్ఫార్మెన్స్, తదుపరి తరం కనెక్టివిటీతో పాటు మృదువైన, రోజువారీ కార్యాచరణను అందిస్తాయని పేర్కొన్నారు. వీటిలో ఒకటి పైభాగంలో వాటర్‌డ్రాప్ నాచ్‌తో ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది.
What do you prioritize on your smartphone—convenience or security?
— Madhav Sheth (@MadhavSheth1) June 23, 2025
Every year, over 150 million Indians buy smartphones. But 75% of them come from Chinese brands. Less than 5% are Indian.
It’s time for an Indian brand to go global.
Ai+ smartphones.
Launching soon.
Designed in…
మాధేవ్ సేథ్ ఇటీవలే మే 16 2025న 'Ai+' లోగోను ప్రారంభించారు. తాజాగా 'Ai+' అప్‌కమింగ్ స్మార్ట్ఫోన్లపై ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. దీని ద్వారా 'మీ స్మార్ట్‌ఫోన్‌లో మీరు దేనికి ప్రాధాన్యత ఇస్తారు? సౌలభ్యమా లేదా భద్రతనా?' అని ప్రశ్నించారు. దీంతోపాటు ప్రతి ఏడాది అమ్ముడవుతున్న 150 మిలియన్ల స్మార్ట్‌ఫోన్‌లలో మొత్తం అమ్ముడైన వాటిలో 5శాతం కంటే తక్కువ భారతీయ బ్రాండ్‌ల నుంచి వచ్చాయని, జనాభాలో ఎక్కువ మంది చైనీస్-బ్రాండెడ్ హ్యాండ్‌సెట్‌లను కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు.
దీనికి దిగువ భాగంలో భారతీయ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. అంటే దీనికి పరిష్కారంగా వినియోగదారులకు మంచి సౌలభ్యం, భద్రతను అందించే దిశగా మేడ్ ఇన్ ఇండియా 'AI+' బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌లను ప్రారంభిస్తున్నట్లు ఈ పోస్ట్ ద్వారా మాధేవ్ సేథ్ వివరించారు.
Bold on the outside. Brilliant within.
— Ai+ (@aiplus_official) June 22, 2025
The all-new Ai+Smartphone pairs a striking design, powered by #NxtQuantumOS. Built for speed. Made for India.
Launching, July 2025 on @Flipkart. #AiPlus #BuiltForYou #BuiltForIndia #SmartphoneReimagined #NxtQuantumOS@NxtQuantumOS pic.twitter.com/J10MolmMlc
లాంఛ్ ఎప్పుడు?: 'AI+' కంపెనీ ఈ రెండు ఫోన్ల లాంఛ్‌పై తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'ఎక్స్' వేదికగా ఓ పోస్ట్ చేసింది. దీని ద్వారా వీటిని ఈ ఏడాది జులైలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అయితే కచ్చితమైన లాంఛ్ డేట్‌ను మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఈ ఫోన్ల కోసం ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఇవి దేశంలో ప్రత్యేకంగా ఈ-కామర్స్ సైట్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి.
కలర్ ఆప్షన్లు: ఈ అప్‌కమింగ్ 'AI+ పల్స్', 'AI+ నోవా 5G' ఫోన్లు బ్లాక్, బ్లూ, గ్రీన్, పింక్, పర్పుల్ కలర్ ఆప్షన్లలో వస్తాయని కంపెనీ ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించింది.
కెమెరా సెటప్: రెండు ఫోన్‌లూ 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌లతో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌లతో వస్తాయి. అవి సింగిల్-టోన్ ఫ్లాష్ యూనిట్‌తో సహా దీర్ఘచతురస్రాకార వెనక కెమెరా మాడ్యూల్‌లతో కనిపిస్తాయి. వెనక కెమెరా ఐలాండ్ దగ్గర ఉన్న టెక్స్ట్ 'AI+ నోవా 5G' ఫోన్ AI-బ్యాక్డ్ ఫొటోగ్రఫీ, ఎడిటింగ్ ఫీచర్‌లతో వస్తుందని సూచిస్తుంది.
'AI+ నోవా 5G' ఫ్రంట్ ప్యానెల్ డిజైన్.. ఈ ఫోన్ ఫ్రంట్ కెమెరా పైభాగంలో వాటర్‌డ్రాప్ నాచ్‌తో ఫ్లాట్ డిస్‌ప్లేతో వస్తుందని వెల్లడిస్తుంది. AI+ పల్స్, AI+ నోవా 5G రెడ్-యాక్సెంటెడ్ పవర్ బటన్లతో వస్తాయి. ఈ రెండు ఫోన్లు డేటా ప్రైవసీ, రెస్పాన్సివ్ మల్టీ టాస్కింగ్‌పై కూడా దృష్టి సారిస్తాయని కంపెనీ చెబుతోంది.
మీరు ఫోన్‌ను ఇష్టం వచ్చినట్లు వాడతారా?- రఫ్ & టఫ్ యూసేజ్ ఫీచర్లతో ఒప్పో కొత్త ఫోన్!!
గేరు మార్చే పనిలేదు- భారత్‌లో అదిరే ఆటోమేటిక్ కార్లు!- రూ.8 లక్షల లోపే!!
వర్షాకాలంలో డ్రైవింగ్ చేస్తున్నారా?- ఈ టిప్స్ పాటిస్తే మీతో పాటు మీ కారు కూడా సేఫ్!