ETV Bharat / technology

కిర్రాక్ అప్డేట్​లతో 'TVS అపాచీ RR310'!- ఇప్పుడు దీని ధర ఎంతంటే? - 2025 TVS APACHE RR310 LAUNCHED

2025 TVS అపాచీ RR310 లాంఛ్- కొత్త ఫీచర్ల వివరాలు ఇవే!

2025 TVS Apache RR310 Launched
2025 TVS Apache RR310 Launched (Photo Credit- TVS Motor Company)
author img

By ETV Bharat Tech Team

Published : April 18, 2025 at 1:59 PM IST

2 Min Read

2025 TVS Apache RR310 Launched: టూ-వీలర్ దిగ్గజం TVS మోటార్ కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ బైక్ 'TVS అపాచీ RR310' 2025 వెర్షన్‌ను లాంఛ్ చేసింది. కంపెనీ ఈ బైక్‌ను లేటెస్ట్ OBD-2B ఉద్గార నిబంధనలకు అనుగుణంగా అప్డేట్ చేసింది. అంతేకాక కొత్త కలర్ ఆప్షన్స్​తో పాటు అనేక ఇతర ఫీచర్లను జోడించింది.

ధర: కంపెనీ ఈ కొత్త '2025 TVS అపాచీ RR310' బేస్ వేరియంట్‌ను రూ. 2.78 లక్షల ధరకు విడుదల చేసింది. అయితే దీని టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 2.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇది TVS బిల్ట్ టు ఆర్డర్ (BTO) కస్టమైజేషన్ కిట్‌తో వస్తుంది. ఇకపోతే ఈ కొత్త 'అపాచీ RR310' పాత మోడల్ కంటే రూ.3,000 ఖరీదైనది.

2025 TVS Apache RR310
2025 TVS Apache RR310 (Photo Credit- TVS Motor Company)

టీవీఎస్ ఈ సూపర్ స్పోర్ట్ బైక్‌ను 2017లో విడుదల చేసింది. అప్పటి నుంచి దీన్ని వేగంగా, సున్నితంగా ప్రయాణించడానికి వీలుగా మెరుగైన పరికరాలు, ఫీచర్లు, రైడర్ అసిస్ట్లతో కాలానుగుణంగా అప్డేట్ చేసింది.

'2025 TVS Apache RR310' ఫీచర్లు: ఈ కొత్త 'అపాచీ RR310' ఇప్పుడు లాంచ్ కంట్రోల్, కార్నరింగ్ డ్రాగ్ టార్క్ కంట్రోల్, ఇన్స్ట్రుమెంటేషన్ కోసం జనరేషన్-2 రేస్ కంప్యూటర్, సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్లు, కొత్త 8-స్పోక్ అల్లాయ్స్​తో వస్తుంది. ఇవన్నీ దీని నేకెడ్ సిబ్లింగ్ 'RTR 310'లో ఉంటాయి.

కలర్ ఆప్షన్స్: పాత మోడల్​లో రెడ్, బాంబర్ గ్రే, రేస్ రెప్లికా కలర్ ఆప్షన్స్ ఉండేవి. ఇప్పుడు కొత్తగా కంపెనీ దీనిలో సెపాంగ్ బ్లూ రేస్ రెప్లికా కలర్ ఆప్షన్​ను కూడా ప్రవేశపెట్టింది.

పవర్‌ట్రెయిన్: దీనిలో అదే 312.2 cc రివర్స్-ఇంక్లైన్డ్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ ఉంది. ఇది 38 bhp పవర్, 29 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటార్ సైకిల్ నాలుగు రైడింగ్ మోడ్‌లు, క్రూయిజ్ కంట్రోల్, కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్, డై-డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్, డ్యూయల్-ఛానల్ ABS అండ్ ఫీచర్-లోడెడ్ 5-అంగుళాల TFT కన్సోల్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.

కస్టమైజేషన్ ఆప్షన్స్: స్టాండర్డ్ వేరియంట్ కాకుండా 'అపాచీ RR310'ను మూడు ప్యాక్‌లతో అప్‌గ్రేడ్ చేయొచ్చు.

  • కస్టమర్లు అదనంగా రూ. 18,000 చెల్లించడం ద్వారా 'డైనమిక్ కిట్'​ లభిస్తుంది. ఇందులో పూర్తిగా అడ్జస్టబుల్ చేయగల సస్పెన్షన్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, బ్రాస్ కోటెడ్ చైన్ ఉంటాయి.
  • అంతేకాకుండా రూ. 16,000 ధర అదనంగా చెల్లిస్తే 'డైనమిక్ ప్రో కిట్‌' వస్తుంది. దీనిలో కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ ABS, వీలీ కంట్రోల్, కార్నరింగ్ క్రూయిజ్ కంట్రోల్​తో పాటు మరిన్ని కార్నరింగ్-ఓరియంటెడ్ ఫంక్షన్స్ ఉంటాయి.
  • చివరగా రూ. 10,000 అదనపు నగదు చెల్లించడం ద్వారా 'రేస్ రెప్లికా కలర్ కిట్‌' లభిస్తుంది. ఇది కంపెనీ తన రేసింగ్ మోటార్‌సైకిళ్ల కోసం ఉపయోగించే రేసింగ్ రంగులతో ప్రేరణ పొందిన లివరీతో వస్తుంది.

కారు ఓనర్లూ జాగ్రత్త- E30 పెట్రోల్‌ దిశగా ప్రభుత్వం చర్యలు!- ఇక రిపేర్ బిల్లులతో మీ జేబులకు చిల్లులే!

వాట్సాప్​లో కొత్త ఫీచర్- ఇకపై స్టేటస్​లో 90సెకన్ల వీడియోలు అప్లోడ్ చేయొచ్చు!

లగ్జరీ ఫీచర్లు, అద్దిరిపోయే డిజైన్​లో స్కోడా కోడియాక్‌- కొత్తగా కారు కొనేవారు దీన్ని ట్రై చేయండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.