2025 Suzuki Hayabusa Launched: సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా తన అప్డేటెడ్ '2025 సుజుకి హయాబుసా' బైక్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ మోటార్ సైకిల్ ఇటీవలే ప్రపంచ మార్కెట్లో లాంఛ్ అయింది. ఇప్పుడు కంపెనీ దీన్ని భారత్‌కు కూడా తీసుకొచ్చింది. ఈ అప్డేటెడ్ మోడల్లో మెరుగైన ఫీచర్లు, కొత్త కలర్ ఆప్షన్లను ప్రవేశపెట్టింది. దీంతోపాటు దీని ఇంజిన్ ఇప్పుడు OBD2 కంప్లైంట్‌గా ఉంది.
2025 సుజుకి హయాబుసా కొత్త కలర్ ఆప్షన్స్: కంపెనీ ఈ '2025 సుజుకి హయాబుసా'ను మూడు కొత్త కలర్ ఆప్షన్లలో ప్రవేశపెట్టింది.
- మెటాలిక్ మ్యాట్ స్టీల్ గ్రీన్/గ్లాస్ స్పార్కిల్ బ్లాక్
- గ్లాస్ స్పార్కిల్ బ్లాక్/మెటాలిక్ మ్యాట్ టైటానియం సిల్వర్
- మెటాలిక్ మిస్టిక్ సిల్వర్/పెర్ల్ వైగర్ బ్లూ
కలర్ ఆప్షన్స్‌తో పాటు కంపెనీ దీని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా అప్డేట్ చేసింది. దీని మధ్యలో TFT స్క్రీన్ ఉన్న అనలాగ్ డయల్స్ ఉన్నాయి.

2025 సుజుకి హయాబుసా కొత్త ఫీచర్లు: ఈ బైక్ కొత్త ఫీచర్ల విషయానికి వస్తే.. కంపెనీ దీనిలోని లాంచ్ కంట్రోల్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్‌ను అప్‌డేట్ చేసింది. వీటితో పాటు బెటర్ ఎఫెక్టివ్‌నెస్ కోసం లాంచ్ కంట్రోల్ మోడ్ ఇంజిన్ స్పీడ్ కూడా అప్డేట్ అయింది. ఇప్పుడు దీని బై-డైరెక్షనల్ క్విక్ షిఫ్ట్ సిస్టమ్‌ని ఉపయోగించి రైడర్ గేర్లు మార్చుకుంటే గానీ ఈ బైక్ కొత్త స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్ యాక్టివేట్ కాదు.
2025 సుజుకి హయాబుసా పవర్‌ట్రెయిన్: ఈ అప్డేటెడ్ మోడల్లో అదే 1,340cc, ఇన్-లైన్ 4-సిలిండర్ ఫ్యూయల్-ఇంజెక్టెడ్, లిక్విడ్-కూల్డ్ DOHC ఇంజిన్‌ను ఇందులో ఉపయోగించారు. ఈ ఇంజిన్ గరిష్ఠంగా 190bhp పవర్, 150Nmల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌తో 6-స్పీడ్ యూనిట్ గేర్‌బాక్స్‌కి జతయి వస్తుంది.

2025 సుజుకి హయాబుసా ఫీచర్లు: అప్డేటెడ్ లాంచ్ కంట్రోల్, స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్‌తో పాటు ఈ బైక్.. హిల్ హోల్డ్ కంట్రోల్, స్లోప్ డిపెండెంట్ కంట్రోల్ సిస్టమ్, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్, లో-RPM అసిస్ట్, సుజుకి ఈజీ స్టార్ట్ సిస్టమ్ అండ్ స్పీడ్ లిమిటర్ వంటి ఫీచర్లతో వస్తుంది. వీటితోపాటు ఇది యాంటీ-లిఫ్ట్ కంట్రోల్ సిస్టమ్, ట్రాక్షన్ కంట్రోల్, రైడింగ్ మోడ్ అండ్ పవర్ మోడ్ అనే మూడు సెట్టింగ్‌లతో ఇంజిన్ బ్రేక్ కంట్రోల్‌ను కూడా కలిగి ఉంది. అంతేకాక దీనిలో TFT స్క్రీన్, ఫుల్ LED లైటింగ్‌తో కూడిన అనలాగ్ క్లస్టర్ కూడా ఉంది.

ధర: కంపెనీ ఈ అప్డేటెడ్ మోడల్‌ను రూ. 16.90 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో లాంఛ్ చేసింది.
7300mAh బ్యాటరీ, కిర్రాక్ ఫీచర్లతో ఐకూ కొత్త ఫోన్ సిరీస్- బడ్జెట్ ధరలోనే లాంఛ్!
70km మైలేజ్, OBD-2B అప్డేట్తో హీరో పాషన్ ప్లస్ బైక్- ఇప్పుడు దీని రేటెంతో తెలుసా?
ఓపెన్'ఏఐ' నానో వెర్షన్- GPT-4O మల్టీమోడల్కు మించిన వేగంతో!