2025 Skoda Kodiaq Launched: స్కోడా ఆటో ఇండియా తన రెండవ తరం స్కోడా కోడియాక్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ దీని టాప్-స్పెక్ స్పోర్ట్‌లైన్ ట్రిమ్‌ను రూ. 46.89 లక్షల (ఎక్స్-షోరూమ్), స్పెషల్ ఎడిషన్ లౌరిన్ & క్లెమెంట్ (L&K) ట్రిమ్‌ను రూ. 48.69 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు విడుదల చేసింది.
స్కోడా ఇండియా ఈ కొత్త స్కోడా కోడియాక్‌నూ భారతదేశంలో మునుపటిలాగే స్థానికంగా అసెంబుల్ చేస్తుంది. కంపెనీ దీనిలో కూడా ప్రస్తుతం ఉన్న 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను అందిస్తుంది. అయితే ఈ రెండవ తరం SUVలో ఎవల్యూషనరీ స్టైలింగ్, మునుపటి కంటే ఎక్కువ ఫీచర్లతో కొత్త ఇంటీరియర్, పవర్లో స్వల్ప పెరుగుదల ఉన్నాయి.
2025 స్కోడా కొడియాక్ ఎక్స్టీరియర్ డిజైన్: ఈ కొత్త స్కోడా కోడియాక్ మునుపటి తరం SUV కంటే కొంచెం గుండ్రంగా కన్పిస్తుంది. ఇది షార్ప్ డిజైన్ లాంగ్వెజ్‌ను కలిగి ఉంది. ఇందులో స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్ ఉంది. కానీ గ్రిల్ వరకు విస్తరించి కంపెనీ కొత్త సిగ్నేచర్ LED డేటైమ్ రన్నింగ్ లాంప్ ఉంది. ఇక బంపర్ రెండు వైపులా ఫంక్షనల్ ఎయిర్ వెంట్స్ ఉన్నాయి. బోనెట్‌పై కూడా మంచి పవర్ బల్బులు ఏర్పాటు చేశారు.

ఈ కారు ప్రొఫైల్ గురించి చెప్పాలంటే.. దీని స్పెషల్ ఎడిషన్ L&K ట్రిమ్ 18-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో కొత్త ఏరో-ఆప్టిమైజ్డ్ లుక్, D-పిల్లర్ వద్ద కాంట్రాస్టింగ్ ఫినిషింగ్‌తో వస్తుంది. రియల్ ప్రొఫైల్ విషయానికి వస్తే.. ఈ కొత్త కోడియాక్‌లో లైట్ బ్యాండ్ ద్వారా అనుసంధానించిన కొత్త C-ఆకారపు టెయిల్-ల్యాంప్‌లు అమర్చారు.

వీల్‌బేస్‌లో నో ఛేంజ్: కంపెనీ దీని వీల్‌బేస్‌లో ఎలాంటి మార్పులు చేయకుండా 2,791mm అలాగే ఉంచింది. కానీ దీని ఓవరాల్ పొడవు మాత్రం 59mm పెరిగింది. ఈ స్కోడా కోడియాక్ స్పోర్ట్‌లైన్ ట్రిమ్.. గ్రిల్, వింగ్ మిర్రర్స్, D-పిల్లర్ గార్నిష్, వెనక బంపర్‌పై బ్లాక్-అవుట్ ఫినిషింగ్‌ను అందించింది. దీని 18-అంగుళాల అలాయ్‌వీల్స్ స్పోర్టియర్ డిజైన్‌ను కలిగి ఉన్నాయి.
2025 స్కోడా కొడియాక్ ఇంటీరియర్: దీని ఎక్స్టీరియర్ ఇప్పటికీ పాత స్కోడా కోడియాక్‌తో చాలా సిమిలర్‌గా ఉన్నప్పటికీ, కంపెనీ దీని ఇంటీరియర్‌కు పూర్తిగా కొత్త డిజైన్‌ను ఇచ్చింది. దీని డాష్‌బోర్డ్ వింగ్డ్ డిజైన్‌లో ఉంటుంది. దీనిలో కొత్త 13-అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఇదే ఈ కారులో అతిపెద్ద అప్డేట్.

ఇది HVAC కంట్రోల్స్ కోసం మూడు ఫిజికల్ డయల్స్ కూడా కలిగి ఉంది. ఇందులో నావిగేషన్ ఫీడ్‌తో 10-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 'స్కోడా' బ్యాడ్జింగ్‌తో టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ (స్పోర్ట్‌లైన్‌లో త్రీ-స్పోక్) ఉంది. దీని రెండవ వరుస సీట్లను ముందుకు, వెనకకు జరిపి స్థలాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు. అవి రిక్లైన్ ఫంక్షన్‌తో వస్తాయి.

2025 స్కోడా కోడియాక్ ఫీచర్లు: ఈ కొత్త స్కోడా కోడియాక్ ఇతర ఫీచర్లలో కాన్ఫిగరబుల్ యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 13-స్పీకర్ కాంటన్ సౌండ్ సిస్టమ్, 3-జోన్ క్లైమేట్ కంట్రోల్, మెమరీ ఫంక్షన్‌తో పవర్-అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, మసాజ్ ఫంక్షన్‌తో హీటెడ్/వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు (L&K), హీటింగ్‌తో స్పోర్ట్స్ సీట్లు (స్పోర్ట్‌లైన్), గెస్టర్ కంట్రోల్‌తో ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్, 360-డిగ్రీ కెమెరా, పార్క్ అసిస్ట్ ఉన్నాయి.

2025 స్కోడా కొడియాక్ సేఫ్టీ ఫీచర్లు: ఇందులో 9 ఎయిర్‌బ్యాగులు, ESC, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్, మల్టీ-కొలిషన్ బ్రేక్, డ్రైవర్ అటెన్షన్, స్లోపీనెస్ మానిటర్, హిల్ స్టార్ట్ అసిస్ట్ విత్ డీసెంట్ కంట్రోల్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.
2025 స్కోడా కొడియాక్ పవర్‌ట్రెయిన్: ఈ కొత్త స్కోడా కోడియాక్‌లో 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది ఇప్పుడు 203bhp పవర్, 320Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ మునుపటి కోడియాక్ కంటే 13bhp ఎక్కువ పవర్ ఉత్పత్తి చేస్తుంది. కానీ దీని టార్క్‌లో ఎటువంటి మార్పు లేదు. ఈ ఇంజిన్ 7-స్పీడ్ DCT గేర్‌బాక్స్‌తో వస్తుంది. కోడియాక్ రెండు ట్రిమ్‌లలో ఆల్-వీల్ డ్రైవ్ స్టాండర్డ్‌గా లభిస్తుంది. స్కోడా దీని ARAI-రేటెడ్ ఇంధన సామర్థ్యాన్ని 14.86kplగా పేర్కొంది.
సేల్ వివరాలు: కంపెనీ ఈ కొత్త స్కోడా కోడియాక్ బుకింగ్‌లను ప్రారంభించింది. అయితే వీటి డెలివరీలు మే 2 నుంచి ప్రారంభం కానున్నాయి.
బిగ్ బ్యాటరీ, అద్భుతమైన డిస్ప్లేతో 'రియల్మీ 14T 5G'- లాంఛ్ ఎప్పుడంటే?
వాట్సాప్‌లో కొత్త ఫీచర్- ఇకపై స్టేటస్‌లో 90సెకన్ల వీడియోలు అప్లోడ్ చేయొచ్చు!
మోటరోలా నుంచి కొత్త ప్రొడక్ట్‌లు- కిర్రాక్ ఫీచర్లతో 'ప్యాడ్ 60 ప్రో', 'బుక్ 60'!