2025 Honda Dio 125 Launched: జపనీస్ టూ-వీలర్ తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) తన కొత్త '2025 హోండా డియో 125' స్కూటర్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీన్ని అధికారికంగా ఏప్రిల్ 16, 2025న ప్రారంభించారు. ఈ అప్డేటెడ్ స్కూటర్‌లో అనేక కొత్త ఫీచర్లు, OBD2B కంప్లైంట్ ఇంజిన్, ఆకర్షణీయమైన గ్రాఫిక్స్ ఉన్నాయి. మరెందుకు ఆలస్యం దీని ధర, ఫీచర్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.
ఇందులో కొత్తగా ఏం ఉంది?: హోండా అందించిన సమాచారం ప్రకారం.. '2025 హోండా డియో 125' OBD2B కంప్లైంట్ ఇంజిన్‌ను కలిగి ఉంది. దీనితో పాటు ఈ స్కూటర్‌ను కొత్త గ్రాఫిక్స్, కొన్ని అప్డేటెడ్ ఫీచర్లతో ప్రవేశపెట్టారు.
'2025 హోండా డియో 125' ఇంజిన్ పవర్: ఈ స్కూటర్‌లో PGM-FI టెక్నాలజీతో కూడిన 123.92 cc సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ OBD2B కంప్లైంట్. ఇది 6.11 kW పవర్, 10.5 న్యూటన్ మీటర్ల టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో స్టార్ట్/స్టాప్ టెక్నాలజీ ఉంటుంది. ఇది మైలేజీని మెరుగుపరుస్తుంది.
'2025 హోండా డియో 125' ఫీచర్లు: ఈ '2025 హోండా డియో 125' స్కూటీ 4.2-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది ట్రిప్ మీటర్, డిస్టాన్స్ టు ఎంప్టీ వరకు మొదలైన సమాచారాన్ని అందిస్తుంది. దీనితో పాటు ఇందులో హోండా రోడ్ సింక్ యాప్, స్మార్ట్ కీ, టైప్-C ఛార్జింగ్ పోర్ట్ వంటి ఆధునిక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
'2025 హోండా డియో 125' వేరియంట్స్: ఈ కొత్త స్కూటర్ రెండు వేరియంట్లలో లభిస్తుంది.
- DLX
- H-స్మార్ట్
వేరియంట్ల వారీగా ధరలు: పుణేలో దీని బేస్ వేరియంట్ DLX ఎక్స్-షోరూమ్ ధర రూ. 96,749 కాగా, టాప్ వేరియంట్ H-స్మార్ట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.02 లక్షలు.
మార్కెట్లో ప్రత్యర్థులు: 125 cc విభాగంలో ఈ కొత్త 'హోండా డియో 125' నేరుగా 'హోండా యాక్టివా 125', 'సుజుకి యాక్సెస్ 125', 'యమహా ఫాసినో 125', 'టీవీఎస్ జూపిటర్ 125'తో పోటీపడుతుంది.
బ్లాక్ కలర్ వావ్.. స్టన్నింగ్ లుక్‌లో డార్క్ ఎడిషన్ కార్లు- వీటిని చూస్తే కొనకుండా ఉండగలరా..??
32MP కెమెరా, 120Hz డిస్ప్లేతో 'రెడ్మీ A5'- కేవలం రూ. 6,499లకే!
హీరో 'సూపర్ స్ప్లెండర్ Xtec', 'గ్లామర్' బైక్స్ అప్డేట్- ఇప్పుడు వీటి రేటెంతో తెలుసా?