2025 Hero Passion Plus: హీరో బైక్‌లు తక్కువ ధరతో మంచి మైలేజీని అందించడంలో ప్రసిద్ధి చెందాయి. ఈ బ్రాండ్ నుంచి చాలా మోటార్ సైకిళ్లు రూ. 1 లక్ష రేంజ్లో ఉన్నాయి. ఇవి 50 కి.మీ కంటే ఎక్కువ మైలేజీని అందిస్తాయి. ఈ బైక్‌ల జాబితాలో హీరో ప్యాషన్ ప్లస్ కూడా ఉంది. అయితే ఇప్పుడు హీరో ఈ శక్తివంతమైన మైలేజ్ బైక్ ధరను పెంచింది. దీంతో పాటు ఈ బైక్‌లో కొత్త కలర్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. మరెందుకు ఆలస్యం దీని కొత్త ధర, కలర్ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం రండి.
హీరో ప్యాషన్ ప్లస్ ధర పెరగడానికి కారణం ఈ మోటార్ సైకిల్ అందుకున్న అప్‌గ్రేడ్. దీన్ని లేటెస్ట్ OBD-2B ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా అప్డేట్ చేశారు. ఈ మోటార్ సైకిల్ ధర గతంలో రూ. 79,901 (ఎక్స్-షోరూమ్)గా ఉండేది. అయితే ఇప్పుడు ఈ బైక్ ధరను కంపెనీ రూ.1,750 పెంచింది. దీంతో ఇప్పుడు హీరో ప్యాషన్ ప్లస్ ధర రూ. 81,651 (ఎక్స్-షోరూమ్)కు చేరుకుంది.
ప్యాషన్ ప్లస్ పవర్: కంపెనీ ఈ హీరో ప్యాషన్ ప్లస్ ఇంజిన్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. ఈ బైక్‌లో అదే 97.2 cc, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్, 2-వాల్వ్ ఇంజిన్ ఉంది. ఇదే ఇంజిన్ స్ప్లెండర్ ప్లస్, HF డీలక్స్‌లలో కూడా కన్పిస్తుంది. ఈ బైక్‌లోని ఇంజిన్ 8,000 rpm వద్ద 8.02 PS శక్తిని, 6,000 rpm వద్ద 8.05 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ బైక్ 70 కి.మీ మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.
హీరో బైక్ కలర్ ఆప్షన్: ఈ హీరో మోటార్‌సైకిల్‌కు ఇప్పుడు రెండు కొత్త కలర్ ఆప్షన్‌లు జోడించారు. ఇది డ్యూయల్-టోన్ బాడీ టోన్ పెయింట్ స్కీమ్‌ను కలిగి ఉంటుంది. ఈ బైక్‌ను బ్లాక్, రెడ్ కలర్స్‌లో డిజైన్ చేశారు. అలాగే ఈ బైక్ బ్లాక్ కలర్లో బ్లూ యాక్సెంట్స్ ఆప్షన్‌ను కూడా అందిస్తుంది. అయితే కంపెనీ ఈ ప్యాషన్ ప్లస్ డిజైన్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. ఈ మోటార్ సైకిల్ బ్లాక్ కలర్లో 5-స్పోక్ అల్లాయ్ వీల్స్ కలిగి ఉంది.
ఓపెన్'ఏఐ' నానో వెర్షన్- GPT-4O మల్టీమోడల్కు మించిన వేగంతో!
సిట్రోయెన్ డార్క్ ఎడిషన్ సిరీస్ వచ్చేశాయోచ్- సూపర్ స్టైలిష్ లుక్‌లో అదుర్స్!- మీరూ ఓ లుక్కేయండి!
మార్కెట్‌లో దుమ్ము రేపుతున్న ఎస్‌యూవీలు- రూ.7లక్షల లోపు టాప్ మోడల్స్ ఇవే!