YSRCP LEADER AHMED BASHA ARRESTED: కడపకు చెందిన వైఎస్సార్సీపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న కడప తాలూకా పోలీసులు, ముంబై నుంచి కడప తీసుకొస్తున్నారు. అహ్మద్ బాషాపై లుక్ అవుట్ నోటీసులు ఉన్న నేపథ్యంలో ముంబయి ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని కడప పోలీసులకు అప్పగించారు.
2022లో కడప వినాయక నగర్లో స్థల వివాదంలో జరిగిన ఘర్షణలో ముస్తాక్ అహ్మద్ అనే వ్యక్తి పైన అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషా తన అనుచరులతో కలిసి ప్రత్యక్షంగా దాడికి దిగాడు. ఈ ఘటన అప్పుడు సంచలనం కలిగిన అహ్మద్ బాషాపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అరెస్టు చేస్తారని భయంతో దుబాయ్ లోనే తలదాచు కుంటున్నారు. తాజాగా రంజాన్ పండుగ కోసం అహ్మద్ బాషా కడపకి వచ్చారు. శనివారం రాత్రి ముంబై నుంచి కువైట్ వెళ్లేందుకు విమానాశ్రయం చేరుకోగా, అప్పటికే లుక్ అవుట్ నోటీసులు ఆయన పైన జారీ చేయడంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఇమ్మిగ్రేషన్ అధికారులు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కడప నుంచి పోలీసులు ముంబైకి బయలుదేరి వెళ్లి అహ్మద్ బాషాను అదుపులోకి తీసుకున్నారు. ముంబై నుంచి రోడ్డు మార్గాన కడపకు తరలించారు. కడప తాలూకా పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో అహ్మద్ బాషాను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కడపలోని మరో పోలీస్ స్టేషన్లో కూడా అహ్మద్ బాషాపై కేసు నమోదు చేశారు. సోమవారం ఉదయం కడప కోర్టులో అహ్మద్ బాషాను హాజరపరిచిన తర్వాత మిగిలిన కేసులు పైన కూడా పీటీ వారెంట్లపై అదుపులోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. ఇతనిపైన సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టారనే ఆరోపణలపై కూడా కేసులు ఉన్నాయి.
గతంలో నోటీసులు: అహ్మద్ భాషాకు కడప చిన్నచౌకు పోలీసులు గతంలో నోటీసులు అందజేశారు. కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి పైన, హోం మంత్రి అనితపైన, స్పీకర్ అయ్యన్నపాత్రుడుపైన సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారనే అంశంపై అహ్మద్ భాషాపై అప్పట్లో కేసు నమోదు అయింది. అందులో భాగంగానే కడప చిన్నచౌకు పోలీసులు అహ్మద్ భాషకు గతేడాది నోటీసులు జారీ చేశారు. అయితే తాను విచారణకు రాలేనంటూ అప్పట్లో అహ్మద్ భాష పోలీసులకు లేఖ పంపారు. 15 రోజులు సమయం కావాలని అందులో పేర్కొన్నారు.
రూ.50 లక్షల మోసం - మాజీ డిప్యూటీ సీఎం ఇంటి వద్ద మహిళల ఆందోళన