YSRCP Followers Attack on TDP Activist in Nellore District: ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయినా వైఎస్సార్సీపీ నాయకుల తీరు మాత్రం మారడం లేదు. వారి అక్రమాలను ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడటం ఇంకా కొనసాగుతునే ఉన్నాయి. గత ప్రభుత్వంలో హయాంలో మాదిరిగానే ఇప్పుడు కూడా ఖాళీగా భూమి కనిపిస్తే చాలు దౌర్జన్యంగా ఆక్రమిస్తున్నారు. వారిని ప్రశ్నించిన వారిపై ఎదురు దాడులు చేస్తున్నారు. ఇలాంటి ఘటనే నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.
నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో మంగళవారం రాత్రి వైఎస్సార్సీపీ మూకలు రెచ్చిపోయాయి. టీడీపీ కార్యకర్తలపై మారణాయుధాలతో దాడి చేశారు. మొత్తం నలుగురు టీడీపీ కార్యకర్తలు గాయపడగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బోగోలు మండలం అల్లెమడుగు పంచాయతీ కడనూతలలో జగన్ హయాంలో వైఎస్సార్సీపీ నేతలు ప్రభుత్వ భూమిని ఆక్రమించారు. అక్కడ ముళ్ల పొదలు పెరిగి పాములు, తేళ్లు నివాసాల్లోకి వస్తుండటంతో స్థానికులు వైఎస్సార్సీపీ మూకలను ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన వైఎస్సార్సీపీ శ్రేణులు టీడీపీ కార్యకర్తలపై మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడి చేశారు. అనంతరం బాధితులను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
''ఎన్నికల సమయంలో టీడీపీకి ప్రచారం చేసినందుకు కక్ష పెంచుకుని మమ్మల్ని చంపేస్తామని బెదిరించి అనంతరం ఈ దాడి చేశారు. ఎంతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఓ పథకం ప్రకారం మా బాబాయ్‌పై రాడ్లతో గట్టిగా కొట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం''-బాధితుడి కుటుంబసభ్యులు
పెద్దాపురంలో రెచ్చిపోయిన వైఎస్సార్సీపీ - టీడీపీ కార్యకర్తపై కత్తులతో దాడి
డోన్‌లో రెచ్చిపోయిన వైఎస్సార్సీపీ నాయకులు - టీడీపీ నాయకులపై కర్రలతో దాడి - YSRCP Leaders Attack