Women Protest Against YS Jagan in Podili : ప్రకాశం జిల్లా పొదిలిలో వైఎస్సార్సీపీ మూకలు రెచ్చిపోయారు. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలను సమర్థించిన జగన్ క్షమాపణ చెప్పాలంటూ మహిళలు నల్లబెలూన్లు, ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో మహిళలపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి.
సాక్షి ఛానల్‌లో అమరావతి మహిళలను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలను సమర్థించిన జగన్ క్షమాపణ చెప్పాలని పొదిలిలో మహిళలు డిమాండ్ చేశారు. పొదిలి చిన్న బస్టాండ్ వద్ద మహిళలు ప్లకార్డులు, నల్లబెలూన్లతో నిరసన తెలిపారు. జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసన తెలుపుతున్న మహిళలపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వగా పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి అక్కడి నుంచి పంపించేశారు.
జగన్ పొదిలి పర్యటనను వ్యతిరేకిస్తూ పొదిలిలోని బస్టాండ్ కూడలి, కొనకనమిట్ల కూడలిలో నిరసనకు దిగారు. మహిళలపై అసభ్య వ్యాఖ్యలను సమర్థించిన జగన్ ఏం ఉద్దరించాలని పొదిలి వస్తున్నారని మహిళలు విమర్శించారు. రహదారి పక్కన నిల్చొని నిరసన తెలుపుతున్న తమపై రాళ్ల దాడి చేయడం సరికాదన్నారు. మహిళల పట్ల గౌరవం లేని జగన్ అండ్ సైకో బ్యాచ్‌కి ప్రజలు బుద్ధి చెప్పినా సిగ్గు రాలేదని మండిపడ్డారు.
తీవ్రంగా ఖండించిన మంత్రి లోకేశ్ : పొదిలిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలు, పోలీసులపై వైఎస్సార్సీపీ సైకోల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి లోకేశ్ ప్రకటన విడుదల చేశారు. 'జగన్ రెడ్డి గారూ మొన్న తెనాలి గంజాయి బ్యాచ్ రౌడీషీటర్లకు ఓదార్పు యాత్ర చేశారు. ఇప్పుడేమో తల్లిలా గౌరవించాల్సిన మహిళలను వేశ్యలని కారుకూతలు కూసిన వారికి మద్దతుగా నిలుస్తున్నారు' అని లోకేశ్ మండిపడ్డారు.
#YCPinsultsWomen#YCPattacksWomen #PsychoFekuJagan
— Lokesh Nara (@naralokesh) June 11, 2025
పొదిలిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలు, పోలీసుల పై వైకాపా సైకోల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. మహిళలు, పోలీసుల పై రాళ్ల దాడి చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షిస్తాం. జగన్ రెడ్డి గారు మొన్న తెనాలి గంజాయి బ్యాచ్… pic.twitter.com/yYCcBnvXsN
సొంత తల్లి, చెల్లిని మెడ పట్టి బయటకు గెంటేసి కోర్టుకు ఈడ్చారని విమర్శించారు. సొంత చెల్లి పుట్టుకపై దుష్ప్రచారం చేయించిన మీరు మహిళలను గౌరవిస్తారని ఆశించడం అత్యాశేనని వ్యాఖ్యానించారు. మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకుగాను పొదిలిలో మహిళలపై వైఎస్సార్సీపీ నేతలు చేసిన దాడికి జగన్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని లోకేశ్ డిమాండ్ చేశారు. మహిళలు, పోలీసులపై రాళ్ల దాడి చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షిస్తామని మంత్రి హెచ్చరించారు.
జగన్ ఉన్మాద మనస్తత్వానికి నిదర్శనం : పొదిలిలో మహిళలపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడి చేయటం దుర్మార్గమని టీడీపీ నేత దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. పొదిలిలో రాళ్లదాడి జగన్ ఉన్మాద మనస్తత్వానికి నిదర్శనమని విమర్శించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలపై రాళ్ల దాడి చేశారని మండిపడ్డారు. పోలీసుల తలలు పగలగొట్టిన వైఎస్సార్సీపీ సైకో మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదేం పిచ్చి! - పోలీస్ వాహనంపైకి ఎక్కిన వైఎస్సార్సీపీ కార్యకర్త