Young Woman Murdered in Ananthapur District: అనంతపురంలో ఓ యువతి దారుణ హత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనంతపురంలోని రామకృష్ణకాలనీకి చెందిన ఎరుకల తన్మయి (20) ఇంటర్ పూర్తిచేసి ఇంట్లోనే ఉంటోంది. ఈ నెల 3న ఇంటినుంచి వెళ్లి తిరిగి రాలేదు. మర్నాడు కుటుంబసభ్యులు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు యువతి తల్లిదండ్రులిచ్చిన ఆధారాల మేరకు రాయదుర్గానికి చెందిన ఓ యువకుడిని అనుమానితుడిగా గుర్తించి విచారించారు. ఈ నెల 7 వ తేదీన రాత్రి కూడేరు మండలం గొట్కూరు సమీపంలో జాతీయ రహదారి పక్కన ముళ్లపొదల్లో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉన్నట్లు గుర్తించి తన్మయి తల్లిదండ్రులకు పోలీసులు సమాచారమిచ్చారు. తరువాత వారు చూసి ఆ మృతదేహం తమ కుమార్తెదేనని గుర్తించారు.
తలపై బలంగా కొట్టి హత్య: తన్మయి తలపై నిందితులు బలంగా కొట్టి హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధరించారు. ఇంకా వైద్యుల నుంచి పోస్టుమార్టం నివేదిక అందాల్సి ఉంది. తన్మయి హత్యకు కారకులుగా అనుమానిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నట్లు తెలిసింది. వారిలో ఫెర్రర్‌నగర్‌కు చెందిన నరేశ్ నేరాన్ని అంగీకరించినట్లుగా తెలిసింది. తన్మయి హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షిస్తామని మంత్రి నారా లోకేశ్ హెచ్చరించారు.
అనంతపురం రామకృష్ణ కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్య ఘటన నన్ను తీవ్రంగా కలచి వేసింది. దుండగులు రాక్షస ప్రవృత్తితో మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టడం షాక్ కు గురిచేసింది. కూటమి ప్రభుత్వంలో ఉన్మాదులు, సైకోలకి తావులేదు, ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్య కేసులో నిందితులను…
— Lokesh Nara (@naralokesh) June 8, 2025
బాధిత కుటుంబానికి అండగా ఉంటామని లోకేశ్ భరోసా ఇచ్చారు. దుండగులు రాక్షస ప్రవృత్తితో బాలికను హత్య చేయడం షాక్‌కు గురిచేసిందన్న మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో ఉన్మాదులు, సైకోలకు తావులేదని లోకేశ్ స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా ఎస్పీతో మాట్లాడిన హోంమంత్రి అనిత నిందితులు ఎంతటి వారైనా సరే ఉపేక్షించొద్దని ఆదేశించారు.
తాడేపల్లిలో సీఎం నివాసానికి సమీపాన యువతి దారుణ హత్య
యువతి దారుణ హత్య.. 35 ముక్కలు చేసి వేర్వేరు ప్రాంతాల్లో వేసిన బాయ్‌ఫ్రెండ్